అవి 1-Mental Body (The power of source, no physical shape directly connected with super power of Universe ) ఇది మన ఆలోచనలకు మూల బిందువు, యూనివర్స్ నుండి వచ్చే సందేశాలను, లేదా మనం పంపే సందేశాలను యూనివర్స్ ద్వారా నిర్దేశం చేసిన వారికి చేరవేస్తుంది, తద్వారా వారిని మనకు స్పందించి, దగ్గర చేస్తుంది, లేదా వారి సహాయం మనకు అందిలే చేస్తుంది, అటువంటి వారు మనకు పరిచయం అయి వారితో మనవ సంబంధాలు ( human relations ) ఏర్పడేలా జరిగి , ఇక్కడ ఇద్దరూ ఒకరికి ఒకరు ఉపయోగం చెంది, సమాన సంతృప్తి పొందెల జరుగుతుంది.
ఇదే like minded thought people gathered at one place అని కూడ అంటుంటాము. అంటే మనలో పుట్టే ప్రతీ ఆలోచన ( thought ) మన mental body నుండి పుడుతుంది లేదా ఇతరులు యూనివర్స్ ద్వారా మనకు పంపిన సందేశం లేదా ఆలోచన మనం చేసే ఆలోచన ఒకే frequency లొ connect అవుతుంది, ఒక developped ఆలోచనగా మన Mental body లొ రూపు దిద్దుకొంటుంది.
సరిగ్గా mental body ( దీనికి రూపం ఉండదు), ఇది చావు తరువాత కూడా physical body వున్న ప్రదేశం లొ 9 రోజుల నుండి 21 రోజుల వరకు వుండి, దిన ఖర్మలు తీరిన తరువాత spiritual body తొ కలిసి ( దీనికి రూపం ఉండదు ) ఈ యూనివర్స్ లొ అంతర్థనం( mega merging ) అయిపోతుంది.
2- Physical Body – దీనినే మనం శరీరం లేదా దేహం అంటాం. Mental body చేసిన లేదా పంపిన ఆలోచన బ్రెయిన్ (మెదడు ) ద్వారా సిగ్నల్ గా ( సమాచారం గా ) శరీరం ద్వారా పనులుగా ( actions ) గా జరుగుతుంది, ఇవి తిరిగి వాస్తవం గా భౌతిక ప్రపంచంలో పరిచయం చేయబడును, అనేక ఆవిష్కరణలు ఇలానే వాస్తవ రూపంలో మన ముందుకు వచ్చాయి. ఈ విదంగా mental body నుండి వచ్చే ఆలోచనల నాణ్యత, మనం ఎటువంటి వారితో సహవాసం, సాధన చేస్తున్నాం, ఎటువంటి పరిసరాల ప్రభావం లొ వున్నాం.
యూనివర్స్ కు మనం ఏమి సందేశం పంపుతున్నాం ( law of attraction ) దాని మీద ఆధార పడి ఉంటుంది. శరీరం నాశనం అయినప్పుడు ఈ physical body ఒక నిర్జీవ పదార్థం అయిపోతుంది, దీనినే మనం దేహం చాలించడం, తనువు చాలించడం అంటాం, కాని ఇక్కడ నుండి అంటే physical body నాశనం అయిన తరువాత కూడ ఆ వ్యక్తి తన mental body + Spiritual body లను 9 నుండి 21 రోజుల వరకు కలిగి తన physical body తొ సంబందించిన వారిని వైబ్రేషన్ ( కంపన ) రూపంలో పలకరిస్తూ ఆ పరిసరాలలొ తిరుగుతూ ఉంటాడు, అందుకే పెండ్లికి వెళ్ళాక పోయిన చావుకు వెళ్ళాలి అంటారు.
3-Spiritual Body – దీనినే దివ్య ఆత్మ శరీరం అని కూడ అంటారు, కాని దీనికి రూపం ఉండదు. ఇది మన ఖర్మలను ఇంకో జన్మకు చేర్చి, ఇంకో జన్మలో ఆ క్రొత్త శరీరం ద్వారా అనుభవం చెందేలా చేయును. ఇది mental body పంపిన ఆలోచనలు, గత ఖర్మలు కొన్ని, ప్రస్తుత ఖర్మలు కొన్నిగా వేరు చేసి, శరీరం ద్వారా అనుభవం చెందేలా చేయును, ఇదే ఎటువంటి భార్య, ఎటువంటి భర్త, ఎటువంటి పిల్లలు, ఎటువంటి వారు నీ జీవితం లో నీ శరీరం కు అనుసంధానం కావాలో నిర్ణయం చేయును. సమాజం లొ కీర్తి, సేవా, విజయాలు, శాంతి, సంతోషం అన్నీ ఈ spiritual body యొక్క దిశా నిర్దేశం మీదనే నడుచును.
Mental body – ఆలోచనలు పుట్టించును
Physical body – ఆలోచనలు అమలు చేయును
Spiritual body – కర్మలను అనుసంధానం చేసి ఫలితం వచ్చునట్లు చేయును.
– సేకరణ