యువతకు రాజకీయ ప్రాధాన్యం కల్పించేలా కృషి

-తెలుగునాడు విద్యార్థి, ఐటీడీపీ ప్రతినిధులతో సమావేశమైన గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌

టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే యువతకు రాజకీయ ప్రాధాన్యం కల్పించేలా కృషి చేస్తానని గుంటూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ అన్నారు. గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆదివారం జరిగిన తెలుగునాడు విద్యార్థి విభాగం, ఐటీడీపీ సంయుక్త సమావేశంలో ముఖ్యఅతిథిగా పెమ్మసాని పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు జగన్‌ పాలనలో టీడీపీ నేతలు అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారని, యువత ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాలకు వలసలు పోయే పరిస్థితి కల్పించారన్నారు. ‘వైసీపీ ప్రభుత్వం సోషల్‌ మీడియా, సిద్ధం పోస్టులకు వందల కోట్లు ఖర్చు పెడుతుంది… చాలామంది మమ్మల్ని అడుగుతున్నారు… మీరు ఎందుకు ఖర్చు పెట్టడం లేదని… అలాంటి వాళ్లకు మేము ఒకటే చెబుతున్నాం…మా దగ్గర అవినీతి సొమ్ము లేదు’ అని స్పష్టంగా చెప్పగలనని తెలిపారు.

పిడుగురాళ్ల మాధవి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి గెలుపు ఎంత అవసరమో అందరికీ తెలుసని, ప్రతిఒక్కరూ ఈ ఎన్నికలను వ్యక్తిగత బాధ్యతగా తీసుకుని పనిచేయాలని కోరారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలలలో ఎక్కువ శాతం యువతపైనే జరుగుతున్నాయన్నారు. ఈ సమావేశంలో ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బూర్ల రామాంజనేయులు, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు మన్నవ వంశీ, కిరణన్న, జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply