Suryaa.co.in

Andhra Pradesh

హిందువులారా తిలక్ లా తిరగబడండి

– సినిమా హీరోలు స్పందించరేం?
– కేంద్ర కార్మిక సంక్షేమశాఖ బోర్డ్ చైర్మన్ వల్లూరు జయప్రకాష్ నారాయణ
గణేష్ చతుర్థి వేడుకలకు అనుమతులు ఇవ్వకుండా అడ్డుపడుతూ, హిందువుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తుందని కేంద్ర కార్మిక సంక్షేమశాఖ బోర్డు చైర్మన్ వల్లూరు జయప్రకాష్ నారాయణ మండిపడ్డారు. గతంలో విదేశీయులు హిందువుల దేవాలయాలు మాత్రమే కూల్చివేశారు కానీ నేటి ప్రభుత్వం హిందువుల ఆలయాలతో పాటుగా, ఆచారాలను కూడా కూల్చివేసే దిశగా ప్రయత్నిస్తోందని ఈ సందర్భంగా అన్నారు.
ఎవరో అనుమతి ఇస్తే పండుగ జరుపుకునే అగత్యం ఈ దేశంలో హిందువులకు లేదు ఎప్పటికి రాదు అని అన్నారు.కులం మతం చూడకుండా పరిపాలిస్తాం అని మాటిచ్చి అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుండి కూడా వీరు కుల మత వర్గీకరణ ఏ విధంగా చేస్తున్నారో, ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, భారతీయ జనతా పార్టీ దీనిపై పోరాటం చేస్తూనే ఉంటుందని అన్నారు. .
మా కట్టు – మా బొట్టును ప్రశ్నించే హక్కు, ఈ ప్రభుత్వానికి లేదని ఆయన హెచ్చరించారు. ఎంతో మంది కార్మికులు అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి, విగ్రహాలు తయారీ చేసిన వారందరూ రోడ్డున పడిన పరిస్థితి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఉందని ఆయన అన్నారు.
వైస్సార్ వర్ధంతి నాడు, పీర్ల పండుగ నాడు, వాళ్ళకి ఇష్టమైన కార్యక్రమాలు నిర్వహించిననాడు లేని కరోన, ఆంక్షలు కేవలం హిందూ పండుగలకు మాత్రమే గుర్తొచ్చాయి అని ఆయన ప్రశ్నించారు. దీనిపై రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువులందరూ తిరగపడతారు అని ఆయన హెచ్చరించారు.
దీనిపై కేవలం హిందువులు మాత్రమే కాదని, పూలు పండ్లు మండపాలు, తోరణాలు, డప్పులు ఇలా అనేక వర్గాలు మతాలు వారు జీవితాలు కూడా దెబ్బతింటున్నాయి అని ఆయన ఈ ప్రభుత్వానికి గుర్తుచేశారు. తక్షణమే గణేష్ చతుర్థి వేడుకలను జరుపుకునేందుకు కరోన నిబంధనలతో కూడిన అనుమతులను ఇవ్వాలని, అనుమతి ఇచ్చిన ఇవ్వకపోయినా కూడా నూటికి నూరు శాతం గణేష్ మహోత్సవాలను జరిపి తీరతాము అని పత్రిక ముఖంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ తెలియజేసారు. గణేష్ చతుర్థి వేడుకలకు అనుమతులు ఇవ్వకుండా, హిందు మనోభావలతో ఆడుకుంటున్న ఈ ప్రభుత్వం పై భారతీయ జనతాపార్టీ తరుపున హై కోర్టు లో పిల్ వేయడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నట్టువంటి హిందువులందరూ , ఒక తిలక్ లాగా తిరగబడాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రతి సినిమా హీరో, డైరెక్టర్ లు వారి సినిమాలు, ఆఫీసు ల ప్రారంభోత్సవానికి అందరూ కూడా గణపతి పూజ తో ప్రారంభిస్తున్నప్పటికి ఏ ఒక్క సినీ హీరో, నిర్మాతలు, దర్శకలు దీనిపై స్పందించకోపవడం పై ఆయన విచారం వ్యక్తం చేశారు. ప్రతి హిందువు వారి సినిమాలు చూస్తూనే అవి నిలబడుతున్నాయని, వారందరూ హిందువుల మనోభావలను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై స్పందించాలని విజ్ఞప్తి చేశారు.

LEAVE A RESPONSE