– తిరుమలను రాజకీయాలకు వాడుకోద్దు
– బుద్దా వెంకన్న ఫైర్!
విజయవాడ: సీఎం హోదాలోనే నీఇంట్లో వాళ్ళే నీ మాట వినలేదు. నీ ఇంట్లో నీ భార్యని కూడా తిరుమలకు తీసుకురాలేవు. తిరుమలను స్వార్థ రాజకీయాల కోసం వాడుకోవడం నీచం… బుద్ధి తెచ్చుకో… అని జగన్పై తెలుగుదేశం పార్టీ(టీడీపీ) నేత బుద్దా వెంకన్న మండిపడ్డారు. ఈ మేరకు ఆయన శనివారం మీడియాతో ఏమన్నారంటే…
తిరుమల వెళతానన్న జగన్.. నిన్న సాయంత్రం తనకు అనుమతి ఇవ్వలేదని చెప్పడం హాస్యాస్పదం. మనం అనుకుంటే కాదు… ఆ స్వామి అనుగ్రహిస్తేనే మనం వెళ్లగలం. వెంకన్న స్వామి అనుమతి లేదు కాబట్టే జగన్ వెళ్లలేకపోయారు. బైబిల్ ఇంట్లో చదువుకునే జగన్ కు వెంకన్న మీద నమ్మకం ఉందని డిక్లరేషన్ ఎందుకు ఇవ్వరు. నిబంధనల మేరకు డిక్లరేషన్ అడిగితే రాద్దాంతం ఎందుకు? ఇప్పుడు టీడీపీ పై బురద జల్లాలని చూస్తున్నారు. గతంలో తిరుమల ఆలయ పరిసరాల్లో జగన్ చెప్పులు వేసుకుని తిరిగారు. ఇప్పుడు నెయ్యి కల్తీ వివాదంలో మీ పాత్ర ఉంది. అందుకే వైవీ సుబ్బారెడ్డి ని వెనుకేసుకు వస్తున్నావు.
తిరుమల సాక్షి గా తప్పుచేయలేదని చెప్పే ధైర్యం ఉందా? ఆ స్వామి ఆశీస్సులు చంద్రబాబుకి ఉన్నాయి. మావోయిస్టు ల దాడి నుంచి వెంకన్న స్వామి చంద్రబాబు ను ఆనాడు కాపాడారు. వైసీపీ హయాంలో తిరుమల లో అపవిత్రం జరిగింది. అదే అడిగితే చంద్రబాబు పై విమర్శలు చేస్తావా? నువ్వు తిరుమల రావడం ఆ స్వామికే ఇష్టం లేదు. అందుకే ఆయన నిన్ను రానివ్వకుండా నీకు నువ్వే ఆగేలా చేశాడు. జగన్ జమానాలో అన్ని అవినీతి, అక్రమాలే.. ప్రభుత్వం వీటి పై విచారణ చేయడంతో జగన్ లో భయం పట్టుకుంది. అందుకే ఇప్పుడు ప్రతి అంశాన్ని కుల, మతాల వారీగా వివాదం చేస్తున్నారు. మానవ కులం నీదేంటి.. మా అందరిదీ మావన కులమే. జగన్ ఇప్పుడు అయినా బుద్ధి తెచ్చుకో.. తీరు మార్చుకో.
కలుగులో దాక్కున్న వంశీ, కొడాలినాని లు ఇప్పుడు బయటకి వచ్చారు. మొక్కుబడులు ఉంటే తల నీలాలు ఇస్తారు. ఈ విషయం కూడా తెలియకుండా చంద్రబాబు గుండు కొట్టించుకుంటారా అని జగన్ అడిగారు. ఆయన ప్రతి యేడాది కోటి రూపాయలు విరాళం ఇస్తారు. నువ్వు ఒక్క రూపాయి అయినా విరాళం ఇచ్చావా? నిన్ను స్వామివారే ఆపారు… నువ్వు రావడం ఆయనకి ఇష్టం లేదు. మొదటి జాబితాలో నీ పేరు లేదని కొంతమంది వాగుతున్నారు. లిస్ట్ లతో నాకు పని లేదు…నా గుండెల్లో చంద్రబాబు ఉంటారు. నాకు పదవులు ఇస్తే ఇంకా పని చేస్తా… నేనైతే పార్టీ కోసం, చంద్రబాబు, లోకేష్ కు భక్తుడిగా ఉంటా.