Suryaa.co.in

Andhra Pradesh

విద్యా కమిటీ ఎన్నికల్లోను జగన్ ఫ్యాక్షన్ మార్క్

– విద్యాలయాలను అడ్డం పెట్టుకొని దోచుకునేందుకు యత్నం
– టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మానం ప్రణవ్ గోపాల్
జగన్ రెడ్డి దృష్టిలో ఎన్నికలంటే దాడులు, దౌర్జన్యాలు, మాత్రమే. ఆఖరికి విద్యాభివృద్ధికి ఉపయోగపడే పాఠశాల విద్యా కమిటీ ఎన్నికల్లోను జగన్ ఫ్యాక్షన్ తరహా పాలన భయటపడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల విద్యా కమిటీ ఎన్నికలు రాజకీయ ఎన్నికలంటే ఘోరంగా మారాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్ రెడ్డి ఏ విధంగా భయబ్రాంతులకు గురి చేశారో విద్యా కమిటీ ఎన్నికల్లోను అదే విధంగా రచ్చ చేయాలనుకోవడం సిగ్గుచేటు. అధికారం పక్షం నాయకులు విచ్చలవిడిగా విద్యా కమిటీ ఎన్నికల్లో ఘర్ణణలకు పాల్పడటం హేయం. ఓటు వేసేందుకు వెళ్తున్న తల్లిదండ్రులను సైతం కొంత మంది వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. ఘర్షణల కారణంగా కొన్ని చోట్ల ఎన్నికను వాయిదా వేసిన సందర్బాలు లేకపోలేదు.
పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, విద్యార్ధులకు బోధన, హాజరు తదితర వాటికి సంబంధించి విద్యా కమిటీలను ఏర్పాటు చేసుకుంటారు. ఇన్నాళ్లు కేవలం విద్యా వ్యాప్తి కోసం ఈ కమిటీలు పని చేసేవి. కాని జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పరిస్థితి మారింది. కేవలం విద్యాలయాలను అడ్డం పెట్టుకొని దోచుకునేందుకే ఈ కమిటీలు పని చేస్తున్నాయనేది అక్షర సత్యం. మన బడి నాడు నేడు పథకం విద్యా కమిటీలకు కాసుల వర్షాన్ని కురిపించింది. దోచుకునేందుకు నాడు నేడు దోహదపడింది. పాఠశాలలో చేయని పనులు చేసినట్లుగా, తక్కువ పనులకు ఎక్కువ బిల్లులు పెట్టడం ఇలా అనేక రకాలుగా అవినీతికి పాల్పడ్డారు. విద్యా కమిటీలను దోపిడీ కమిటీలుగా మార్చిన ఘనత జగన్ రెడ్డికే దక్కింది.

LEAVE A RESPONSE