Suryaa.co.in

Andhra Pradesh Political News

జగన్‌ సర్కారు తీరు చిత్ర.. విచిత్రం!

-ప్రజలు 151, 22 సీట్లు ఇచ్చి గెలిపించినందుకు తగిన శాస్తి

సాధారణంగా ప్రభుత్వం రకరకాల డిపార్ట్మెంట్ లకు సంబంధించిన పనులకు టెండర్ పిలుస్తుంటారు. అందుకు సంబంధించిన డబ్బులు రాష్ట్ర బడ్జెట్లో ప్రవేశపెట్టి ఆ బడ్జెట్ ప్రకారం ఆ జిల్లాలకు, కేంద్రాలకు అలాట్ చేసి టెండర్లు పిలుస్తుంది.

ఆ పిలిచిన టెండరుకు క్వాలిఫికేషన్ ప్రకారం కాంట్రాక్టర్లు టెండర్ వేస్తారు ఇస్తారు .అయితే ఈ ప్రభుత్వం కాంట్రాక్టు విధానం లో కొత్త విధానాన్ని ప్రవేశ పెట్టింది.అది పని విలువ నూరు కోట్లు దాటితే టెండర్ వేసి దానిని దక్కించుకుంటే ,తిరిగి ఈ ప్రభుత్వం కొత్త విధానం ప్రకారం రివర్స్ టెండర్ పిలుస్తారు. రివర్స్ టెండర్ లో ప్రభుత్వానికి సంబంధించిన కాంట్రాక్టర్ కు పని అప్పగిస్తున్నారు.

ప్రస్తుతం ప్రభుత్వం చెప్పిన ఇంకొక విధానం ఏంటంటే.. మీరు టెండర్లు వెసుకొని దక్కించుకొండీ. పనులు చేయండి. కానీ డబ్బులు మాత్రం బిల్లులు మాత్రం మేము ఇచ్చినప్పుడు తీసుకోవాలి. ఇదొక విచిత్రమైన నా పరిస్థితి ఈ పరిస్థితి ఇంకా ఏ రాష్ట్రంలో అయినా ఉందా ? కేంద్రప్రభుత్వంలో ఉందా? ప్రైవేట్ కాంట్రాక్టర్ సంస్థలలో ఏమైనా ఉందా ?.

జరిగిన పనికి బిల్లులు చెల్లించకపోతే, ఏ కాంట్రాక్టర్ అయినా ఎంత డబ్బు తీసుకువస్తారు ? డబ్బులు తీసుకు వచ్చి పనులు చేసి, ఆ పనులకు సంబంధించి డబ్బులు ప్రభుత్వం సకాలంలో ఇవ్వకపోతే అయిన వడ్డీలు ఎవరు ఇస్తారు? మరి వేసేటప్పుడు ఏమైనా మీరు ఇన్ని సంవత్సరాలకు డబ్బులు ఇస్తాము అని ఏమైనా చెప్పగలరా చెప్పారా ?.. ఇది విచిత్రమైన పరిస్థితి.

ప్రభుత్వం బిల్లులు సకాలంలో ఇవ్వకపోతే, కోర్టుకు పోవడానికి అవకాశాలు లేనట్టుగా రాసి ఇవ్వాలి అని కండిషన్ పెడుతున్నారు. ఈ విచిత్రమైన పరిస్థితి ప్రజలకు, కాంట్రాక్టర్లకు అర్థం కావడం లేదు.

సాధారణంగా సంవత్సరానికి ఒకసారి.. డిపార్ట్మెంట్ వారీగా కొంత మొత్తాన్ని అలాట్ చేసిన తర్వాత, ఆ అలాట్ చేసిన అమౌంట్ లోనే టెండర్ పిలుస్తారు.ఆ మొత్తాన్ని ప్రభుత్వం డిపార్ట్మెంట్ హెడ్ కింద లెక్కల్లో ఉంచబడుతుంది. టెండర్లు వచ్చిన కాంట్రాక్టర్ పనులు చేసిన తర్వాత, డిపార్ట్మెంట్ ఇంజనీర్లు చేసిన పనిని “యం బుక్ “రికార్డ్ చేసి, సంబంధిత అకౌంట్స్ ఆఫీసర్ వారికి సబ్మిట్ చేస్తారు . వారు బిల్లులు మంజూరు చేస్తారు. ఇదీ జరుగుతున్న విధానం.

కానీ ఈ ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని ప్రవేశ పెడితే, కాంట్రాక్టర్లు ఆ జీవో రద్దు కొరకు హైకోర్టుకు పోవడం.. కోర్టువారు కాంట్రాక్ట్ చేసినవారికి డబ్బులు ఇవ్వడం న్యాయం కాబట్టి, ఆ జీవోను రద్దు చేయడం ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడం జరుగుతుంది.

అసలు పనులు చేసిన తర్వాత బిల్లులు మంజూరు చేయకపోతే, ఏ కాంట్రాక్టర్ అయినా కూడా కొంత డబ్బులు బ్యాంకు ద్వారా, కొంత సొంత డబ్బులు పెట్టుబడి పెట్టి పనులు చేస్తుంటారు .కానీ తిరిగి ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితుల్లో ఎవరు టెండర్ వేస్తారు? ఏ విధంగా పనులు జరుగుతాయి? ఈ రాష్ట్రం లో ఇది ఒక విచిత్రమైన పరిస్థితి వేచి చూద్దాం ఏమి జరుగుతుందో ?

దీనివల్ల అభివృద్ధి ఆగిపోయి రోడ్లన్నీ గుంతల మయం అయిపోయి.. ఇప్పటికే ప్రజలు నా నా ఇబ్బందులు పడుతున్న ఈ పరిస్థితుల్లో , ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం ఘోరం. ప్రభుత్వ పనులు చేసే దానికి కాంట్రాక్టర్లు ముందుకు రాక అభివృద్ధి పూర్తిగా ఆగిపోతుంది . ప్రజలు 151, 22 సీట్లు ఇచ్చి గెలిపించినందుకు తగిన శాస్తి జరిగింది. ఇటువంటి అర్థం,పర్డం లేని పనులు చేస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, రాబోయే ఎన్నికల్లో చిత్తు,చిత్తుగా ఓడించి బిజెపి + జనసేన పార్టీలను గెలిపించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుదామ్.

– కరణం భాస్కర్
బిజెపి ,
మొబైల్ నెంబర్ 7386128877.

LEAVE A RESPONSE