– రాష్ట్రాన్ని వదిలేసి రాజస్థాన్ నుంచి సోలార్ విద్యుత్ కొనాల్సిన అవసరం ఏమొచ్చింది? – కొనుగోలు ధర రూ.2.49పైసలంటున్న ప్రభుత్వం డిస్కంలకు చేరేసరికి ఎంతవుతోందో ఎందుకు చెప్పడం లేదు?
– అధికారంలోకి రాగానే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను ఎందుకు రద్దుచేశారు?
– ఎవరికి మేలుచేసేందుకు కొత్తఒప్పందాలు చేసుకుంటున్నారు?
– మీ రివర్స్ టెండరింగ్ విద్యుత్ ఒప్పందాలకు వర్తించదా?
– రూ.30వేలకోట్ల విలువైన టెండర్ని, నామినేషన్ పద్థతిలో ఎలా అప్పగిస్తారు?
– ప్రభుత్వం అదానీసంస్థకు మేలు చేయడంకోసం రూ.లక్షా 20 వేల కోట్ల భారాన్ని ప్రజలపై వేయడానికి సిద్ధమైంది
– పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్
9 వేలమెగావాట్ల సోలార్ విద్యుత్ ని దేశంలోనే తక్కువ ధరకు తాము కొన్నామని చెప్పుకుంటున్న రాష్ట్రప్రభుత్వం, నవంబర్, డిసెంబర్ 2020 లో సెకీ పిలిచిన టెండర్లలో అతితక్కువగా యూనిట్ సోలార్ విద్యు త్ రూ.2లకే రాగా, అదేసమయంలో గుజరాత్ ప్రభుత్వం పిలిచిన టెండర్లలోకూడా 1.99పైసలకే వచ్చిందని, ఇదిజరిగిన 22 నెలల తర్వాత, ఏపీప్రభుత్వాన్ని సంప్రదించిన అదానీసంస్థ రూ.2.90పైసలు పైన కోట్ చేసిందని సెకీ చెప్పడంతో, వెంటనే 24గంటల్లోనే కేబినెట్ ఆమోదిచండంకూడా జరిగిపోయిందని టీడీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, శాసనసభ్యులు పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
అదానీ సంస్థ చెప్పిన రూ.2.90పైసలు ఎక్కువధరని 22నెలలనుంచీ దేశంలో ఏరాష్ట్రము సదరుసంస్థతో ఒప్పందంచేసుకోవడం, విద్యుత్ కొనడానికి ముందుకురావడం జరగలేదు. దేశంలో ఏరాష్ట్రమూ అదానీ సంస్థతో ఒప్పందానికి ఇష్టపడకపోతే, ఏపీప్రభుత్వం మాత్రమే ఎందుకు ఒప్పందంచేసుకుంది? సెప్టెంబర్ 15 న సెకీ తమకు టెండర్ వేసిన అదానీసంస్థ రూ.2.49పైసలకే ఇవ్వాలనుకుంటోందని లేఖరాస్తే, 16నే ఏపీప్రభుత్వం ఆమోదించింది. సాయంత్రం లేఖవస్తే, మరునాటి ఉదయానికే, కేబినెట్ అప్రూవల్ పూర్తై, ఆమోదం తెలపడం జరుగుతుం ది.
రూ.30వేలకోట్ల పెట్టుబడికి సంబంధించిన విషయంలో ఏమీ ఆలోచించకుండా, లోతుపాతులు పరిశీలించకుండా, ప్రభుత్వం ఎలా నిర్ణయంతీసుకుంటుందని ప్రశ్నిస్తున్నాం? రాష్ట్రానికి రూపాయి ఆదాయంలేకుండా, ఒక్కఉద్యోగం రాకుండా, సదరుసంస్థతో ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏమిటని ప్రశ్నిస్తున్నాం. రూ.2.49పైసలు చాలా తక్కువని ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వం అదానీసంస్థతో ఒప్పందం చేసుకున్నదానికంటే తక్కువగా అదే సమయంలో యూనిట్ సోలార్ విద్యుత్ రూ.1.99పైసలకు, రూ.2కే ఒప్పందాలు జరిగాయి. సోలార్ విద్యుత్ ధరలు పతనమైన 22నెలల తర్వాత ఈ ప్రభుత్వానికి రూ.2.49 పైసలు తక్కువగా అనిపించిందా? అదానీసంస్థ అంతచౌకగా విద్యుత్ ఇస్తే, ఇతరరాష్ట్రాలు ఎందుకు కొనలేద ని తాము, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం.
చంద్రబాబునాయుడు రాష్ట్ర అవసరాలకు మించి విద్యుత్ ఒప్పందాలు చేసుకోవడంవల్ల రాష్ట్ర గ్రిడ్ వ్యవస్థ తట్టుకోలేకపోతోందని, గతంలో టీడీపీహాయాంలో చేసుకున్న సోలార్ విద్యుత్ ఒప్పందాలను జగన్ ప్రభుత్వం రద్దుచేసింది. మరిఇవాళ 10వేల మెగావాట్లను ఈ ప్ర్రభుత్వం బయటి రాష్ట్రాలనుంచి కొంటే, గ్రిడ్ వ్యవస్థ తట్టుకుంటుందా? రాత్రికి రాత్రి పాలకులు రాష్ట్రంలో ఏం పెట్టుబడులు పెట్టారో చెప్పాలి. కేవలం రైతులకు పెట్టే ట్రాన్స్ ఫార్మర్లు తప్ప, విద్యుత్ లైన్ల వ్యవస్థలను మెరుగు పరచడం, భారీలైన్లు కొత్తగా వేయడం జరగలేదుకదా? ఆఖరికి గతప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను రద్దుచేయడంకోసం కోర్టులకు కూడా అబద్దాలు చెప్పారు. ఒకప్రతిపాదనకు లెక్కలు తీసుకునే ముందు ప్రభుత్వం కనీసం లెక్కలు కూడా చూడదా?
యూనిట్ రూ.2.49పైసలకే వస్తోందని, సోలార్ విద్యుత్ కొంటున్నామని కేబినెట్లో చెప్పారు. రాష్ట్రప్రభుత్వాన్ని దీనిపై సవాల్ చేస్తున్నా? ఏపీ డిస్కమ్ లకు చేరేసరికి అదే రూ.2.49పైసలే పడుతుందా..లేక పెరుగుతుందో ప్రభుత్వం చెప్పాలి. మా దగ్గరున్న లెక్కలప్రకారం డిస్కం లకు చేరేసరికి యూనిట్ విద్యుత్ ధర రూ.3.50పైసలు నుంచి రూ.4.50పైసలు పడుతుంది. ఫ్రిజ్ లు, టీవీలు కొనండి అని ప్రకటనలు ఇచ్చి, కిందమాత్రం ధరలు అధికం, పన్నులు అధికమని వేస్తారు. అలానే ప్రభుత్వం చెబుతున్న రూ.2.49పైసల వెనక, ఎన్నిఅదనపు భారాలున్నాయో చెప్పాల్సిన పనిలేదు. రూ.2.49పైసలకి సోలార్ విద్యుత్ కొంటున్నామని చెబుతూ, ప్రభుత్వం నేరుగా ప్రజలను మోసగిస్తోంది. విద్యుత్ కొనుగోళ్ల పేరుతో ప్రజలకు తీసుకొచ్చిన స్కామ్ కాదుఇది.. అదానీలకోసం తయారుచేసిన స్కామ్ ఇది.
ప్రభుత్వం కొనాలనుకుంటున్న విద్యుత్ ఉత్పత్తి తయారీ జరిగేది రాజస్థాన్ లో, అదానీ సంస్థ సోలార్ ప్యానెల్స్ కొనేది గుజరాత్ లో. రూ.30వేలకోట్ల జీఎస్టీ మొత్తం గుజరాత్ కు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు రాజస్థాన్ కు పోతుంటే, అలాంటిసంస్థవల్ల రాష్ట్రానికి ఏం ఒరుగుతోందని, ఏపీప్రభుత్వం దానినుంచి రూ.2.49పైసలకు సోలార్ విద్యుత్ కొంటోందో ప్రభుత్వం, ప్రజలకు సమాధానంచెప్పాలి. అసలు ఏపీప్రభుత్వం చెబుతు న్న రూ.2.49పైసలు ధర నమ్మేదేనా? రాజస్థాన్ నుంచి ఏపీ డిస్కంల కు చేరేసరికి, ప్రభుత్వం చెబుతున్నట్లుగా సోలార్ యూనిట్ విద్యుత్ ధర రూ.2.49పైసలేనా? అంతకంటే ఎక్కువే పడుతుందని మాదగ్గర ఉన్న సమాచారం. కనీసంగా రూ.3.50పైసలుపడితే, గరిష్టంగా రూ.4. 50 పైసలవరకు పడుతుంది.
అక్కడెక్కడో రాజస్థాన్ లో పెట్టుబడులు పెట్టే సంస్థతో ఒప్పందంచేసుకునే బదులు, ఏపీప్రభుత్వం సదరుసంస్థతో ఈ రాష్ట్రంలోనే ఎందుకు పెట్టుబడులు పెట్టించలేకపోతోంది? ఇప్పటికే ఈ ప్రభుత్వం వేలఎకరాలుసేకరించింది కదా.. రాష్ట్రం ఏమీ గొడ్డుపోలేదు కదా? చంద్రబాబునాయుడి హయాంలో రాష్ట్రంలో సోలార్ పార్క్ ల ఏర్పాటుకి భూమిసేకరించి, సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటే, వాటన్నింటినీ అకారణంగా రద్దుచేశారు.
ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏ అదానీసంస్థతో అయితే ఒప్పందంచేసుకుందో, అదే సంస్థకు అధికటెండర్లు దక్కేలా గతంలో కూడా జగన్ ప్రభుత్వం వ్య వహరిచింది. 6వేలమెగావాట్లకు సంబంధించి టెండర్లు పిలిస్తే, వాటిలో అధికభాగం ఆ సంస్థకే దక్కాయికదా? ఆ వ్యవహారం కోర్టులో ఉండగానే, తాజాగా టెండర్లు పిలుచుకోవచ్చని న్యాయస్థానంచెప్పినా కూడా విన కుండా జగన్ ప్రభుత్వంమరలా కొత్తగా, అదానీసంస్థకు దొడ్డిదారిన మేలుచేకూర్చడంకోసమే ఈవిధమైన ఒప్పందం చేసుకోవడమనేది నిజంకాదా?
10వేలమెగావాట్ల టెండర్లుకాదు.. 50వేల మెగావాట్లకు టెండర్లు పిలిచినా, అవికొత్తగా పిలవాలని మాత్రమే తాముడిమాండ్ చేస్తున్నాం. చట్టప్రకారం ఏపీఈఆర్సీ అనుమతులు తీసుకొని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా, రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చేసంస్థలకు స్వాగతం పలికితే సంతోషిస్తాం. దానివల్ల రాష్ట్రంలోని యువతకు ఉపాధి, ఉద్యోగాలు లభించడంతోపాటు, ఆదాయంకూడా వస్తుంది.
ప్రధానులకు దగ్గరగా ఉన్నారన్న భావజాలంతో రాష్ట్రప్రయోజనాలను తాకట్టుపెట్టేలా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఎవరికోసమో స్పష్టంచేయాలి. నిజంగా ప్రభుత్వం రాష్ట్రరైతులకోసమే నిర్ణయాలు తీసు కుంటే, యూనిట్ రూ.2లు, రూ.1.99పైసలకు వస్తుంటే, రూ.2.49కి ఎందుకు కొంటోంది? ఈ ప్రభుత్వం టెండర్లు పిలిచినకాలంలోనే, గుజరాత్ ప్రభుత్వం రూ.1.99పైసలకు ఒప్పందాలు చేసుకున్నది నిజం కాదా? ఆ విధంగా ఈ ప్రభుత్వం ఎందుకు టెండర్లు పిలవడం లేదు. ఏ సంస్థ పెట్టుబడులు పెట్టినా, అవినెలకొల్పిన సోలార్ ప్యానెళ్లు, 20, 25 ఏళ్ల తరువాత తిరిగి ప్రభుత్వపరం అయ్యేలా ఎందుకు చేయలేకపోతు న్నారు? చంద్రబాబునాయుడు గారు తొలిదశలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అలాచేయబట్టే, థర్మల్ ఫ్లాంట్ రాష్ట్రానికి ఫ్రీగా వచ్చింది. ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలకు తామువ్యతిరేకంకాదు. కేవలం ఏపీలో పెట్టుబడులు పెట్టించాలన్నదే తమ డిమాండ్.
ప్రభుత్వం వెనకాముందూ ఆలోచించకుండా,అదానీసంస్థతో చేసుకున్న ఒప్పందం కారణంగా 25 ఏళ్లలో ఏపీప్రజలపై రూ.లక్షా20వేలకోట్ల అదనపుభారంపడనుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంవల్ల పేదలు, సామాన్యులు, మధ్యతరగతివారు రూ.లక్షా20వేలకోట్లు కట్టాలా?
దేశవ్యాప్తంగా విద్యుత్ ధరలు బాగా తగ్గుతున్నాయి. నిన్నటికి నిన్న పంజాబ్ లో యూనిట్ విద్యుత్ ధరను రూ.3వరకు తగ్గించారు. సగానికి సగం కోసేసి, పేదలకు రూ.1.19పైసలకే అందిస్తోంది. పైగా పంజాబ్ రా ష్ట్రానికి సోలార్ , పవన విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన వనరులుకూడా లేవు. దేశమంతా ధరలు తగ్గుతుంటే, ఏపీ ప్రభుత్వం ఎందుకు ప్రజలపై పిడుగులుపడే నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ఏచట్టంప్రకారం కూడా టెండర్ ప్రక్రియకాదు. నామినేషన్ పద్ధ తిలో గంపగుత్తగా అప్పగించడమే అవుతుంది. ఈనిర్ణయం తీసుకున్న అధికారులు కచ్చితంగా భవిష్యత్ లో శిక్షింపబడతారు.
రూ.30వేలకోట్ల పెట్టుబడి ఎక్కడో పెడతారు….అక్కడినుంచి విద్యుత్ కొంటామంటే చూస్తూఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నాం. రూ.2.49పైసలు అనేది ఆర్బ్రిటరీ. ప్రభుత్వం వేసిన సెలక్ట్ కమిటీ దాన్ని నిర్ణయించింది. కానీ ధరను నిర్ణయిచాల్సింది ఏపీ ఈ ఆర్సీ. ఏపీఈ ఆర్ సీ కూడా వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని ధరలు నిర్ణయిస్తుంది.
ధర ఏదైనా కానివ్వండి.. చట్టం ప్రకారం ఏ టెండర్ కు ఆ టెండర్ సపరేట్ గానే ఉంటుంది. గత టెండర్లో రూ.2.49పైసలకు యూనిట్ విద్యుత్ వస్తే, ఇంకో టెండర్లో అంతకంటే తక్కువకే రావచ్చునేమో? సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ అనేది ఒకవ్యాపారసంస్థ. కేంద్రప్రభుత్వం ఏర్పాటుచేసిన సదరుసంస్థకు కొన్ని పరిధులు, పరిమి తులు ఉన్నాయి. దేశంలో ఏంజరిగినా ఎలక్ట్రిసిటీ యాక్ట్ ప్రకారమే జరగాలి. ఏపీప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలో అనేకలోపాలు, లొసు గులు ఉన్నాయి.
యూనిట్ రూ.2.49పైసలని చెబుతూ ప్రభుత్వం ప్రజ లను మభ్యపెడుతోంది.. అదినిజం కాదని నేను ఆరోపిస్తున్నా. లేదు అదేధరకు వస్తుందని ప్రభుత్వం నిరూపిస్తే, తానే క్షమాపణ చెబుతాను. డిస్కంలకు చేరేసరికి రూ.2.49పైసలకే వస్తుందా.. లేక అంతకంటే ఎక్కువపడుతుందా అనేది స్పష్టంచేయాలి. నాకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం యూనిట్ రూ.3.50పైసలు, అంతకంటే ఎక్కువే పడుతోంది. ప్రభుత్వం రూ.2.49పైసలకంటే పైసాకూడా ఎక్కువపడదని చెబితే, తాను కచ్చితంగా స్పందిస్తాను.
గతంలో పవన్ విద్యుత్ తాలూకా ఒప్పందాలను ప్రభుత్వం నిలిపేసింది. దాంతో కొన్నిసంస్థలు కోర్టులను ఆశ్రయించాయి. కర్టెయిల్ మెంట్ పేరు తో పవనవిద్యుత్ ఆపేయడం మూలాన, ఏపీప్రభుత్వం సంస్థలకు ఎదు రుచెల్లించాల్సి వచ్చింది. గతంలో ఈ ముఖ్యమంత్రి, టీడీపీప్రభుత్వంలో జరిగిన ఏ ఒప్పందాలనైతే, తప్పుపట్టారో వాటినే ఇప్పుడు తిరిగి అమ ల్లోకి తెస్తున్నారు.