Suryaa.co.in

Andhra Pradesh

ఎస్సీలకు నాలుగు సంవత్సరాలుగా జగన్ అన్యాయం చేశారు

– వైసిపి ఎమ్మెల్యే అభ్యర్ధులు మిడిల్ డ్రాప్ అవుతున్నారు
– షర్మిల, జగన్ కలసి ఆడుతున్న నాటకం ఇద్దరు వేరుకాదు
– బిజెపి రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు

విజయవాడ: అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం అందరూ హర్షించదగ్గదే అయితే ఎస్సీ వర్గాలకు గత నాలుగేళ్లుగా అన్యాయం చేసి ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం పేరుతో రాజకీయం చేయడాన్ని బిజెపి తప్పపడుతోందని బిజెపి రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు విమర్శించారు.

బిజెపి రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రం ఎస్సీ ఎస్టీ లకు కేటాయించిన నిధులను దారిమళ్లించిన విషయం పై ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

విద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ నియామకాలను రమేష్ నాయుడు తీవ్రంగా తప్పు పట్టారు వైస్ ఛాన్సలర్ ల వ్యవస్ధను రాజకీయ ఆవాసాలుగా మార్చేసారు అందువల్లన విద్యాలయాల్లో రాజకీయాలు పెరిగిపోతున్నాయన్నారు.

ఎమ్మెల్యేలను బదిలీ చేసే వ్యవస్ధకు వైసీపి శ్రీకారం చుట్టిందని అయితే ఎంపిక చేసిన అభ్యర్ధులు మిడిల్ డ్రాప్ అవుతున్నారంటు ఛలోక్తిలు విసిరారు.

షర్మిల, జగన్ మోహన్ రెడ్డి లు వేరుకారని వారిద్దరు కూడబలుక్కుని నాటకం ఆడుతున్నారన్నారు. ఆంద్రప్రదేశ్ లో కాంగ్రెస్ కు ప్రజలు అవకాశం ఇవ్వరు షర్మిల ఒక రాజకీయ నిరిద్యోగి అందువల్ల కాంగ్రెస్ కాళీగా ఉండడంతో ధరకాస్తు చేసుకుని అధ్యక్షరాలు తెచ్చుకుని అన్నా చెల్లెలు నాటకమాడుతున్నారు. పాత్రికేయుల సమావేశంలో ఓబిసి నేత బిఎస్ఆర్ పట్నాయక్, బిజెపి నేత రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE