-మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
జగన్… రాష్ట్రాన్ని అక్రమ మైనింగ్ కి అడ్డాగా మార్చారు. దండుపాళ్యం బ్యాచ్ ని మించి వైసీపీ మైనింగ్ మాఫియా అరాచకాలు సాగుతున్నాయి. ప్రజలకు నవరత్నాలు పంచుమతామని చెప్పిన వైసీపీ నేతలు అధికారంలోకి వచ్చాక నలుదిక్కుల్లోని సహజవనరుల్ని దోచుకుతింటున్నారు. అక్రమార్జనే పరమావదివగా వైసీపీ నేతలు మైనింగ్ నుంచి చివరకు మట్టిని సైతం వదటలటం లేదు. గనుల్లో మైనింగ్ చేస్తున్నారు, చెరువుల్లో మట్టిని తోడేస్తున్నారు, కొండల్లో ఉన్న రాళ్లను తరలిస్తున్నారు, అడ్డు వచ్చిన వారిపై బౌతిక దాడులకు పాల్పడుతున్నారు. గ్రామ స్ధాయి నుంచి రాష్ట్ర స్ధాయి వరకు వైసీపీ నేతలకు ఇదే పని..ఇందులో గ్రామపార్టీ అధ్యక్షుడి నుంచి తాడేపల్లి ప్యాలెస్ సజ్జల, జగన్ రెడ్డి వరకు తలాపాపం తిలా పిడికెడు అన్నట్టు అందరికీ వాటాలున్నాయి. రాష్ట్రంలో ఏ గ్రామంలో చూసినా సరే వైసీపీ తోడేళ్లు కొండల్ని చెరువులుగా మారుస్తున్నారు, చెరువుల్లో ఉన్న మట్టిని తోడేసి వాటిని లోయలుగా మారుస్తున్నారు. వైసీపీ నేతలు ఇలాగే దోపిడీ చూస్తూ పోతే భవిష్యత్ తరాలకు రాష్ట్రంలో కొండలు, చెరువులు చూసే అవకాశం ఉండదేమో అనిపిస్తుంది.
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలోని వెల్వడం చెరువులో మట్టి తవ్వకాలతో అధికార పార్టీ నేత ఒకరు కేవలం 15 రోజుల్లోనే రూ. కోటికి పైగా ఆర్జించారు. కడప సమీపంలోని చలమారెడ్డిపల్లె ప్రాంతం నుంచి అనుమతులు లేకుండా మట్టి తవ్వి టిప్పర్ రూ.15 వేలకు అమ్మేశారు. రోజూ వందల ట్రిప్పులు తరలించి లక్షల్లో సొమ్ము చేసుకున్నారు. అధికార పార్టీ స్థానిక నాయకులు పల్నాడు జిల్లా పిన్నెల్లిలోని నల్లచెరువులో 3 నెలలపాటు ట్రాక్టర్లు, టిప్పర్లతో వేల ట్రక్కుల మట్టిని తరలించారు. ప్రకాశం జిల్లాలోని యరజర్ల, మల్లవరం, కందులూరు, బూరేపల్లి కొండల్లో మట్టి తవ్వి గత రెండేళ్లలో రూ.50 కోట్లు పోగేసుకున్నారు. దీనిలో ఓ ప్రజాప్రతినిధి వియ్యంకుడి పాత్రపై ఆరోపణలున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు చేస్తున్న సహజవనరులు దోపిడీలు కోకొల్లలు. వీటిని ప్రశ్నిస్తే ప్రతిపక్ష పార్టీల నాయకుల నుంచి విలేకరులు, సామాన్యుల వరకు అందరిపై బెదిరింపులు, భౌతిక దాడులు, వేధింపులకు పాల్పడుతున్నారు.
తూ.గో జిల్లాలో ఇసుక మాఫియాను ప్రశ్నించినందుకు దళిత యువకుడు వరప్రసాద్ కి శిరోముండనం చేసి మొత్తం దళితజాతిని వైసీపీ అవమానించింది. గుడివాడలో గడ్డం గ్యాంగ్ అక్రమాలను అడ్డుకున్నందుకు ఆరై జాస్తి అరవింద్ పై వైసీపీ గూండాలు దాడికి పాల్పడటమే కాక తప్పుడు కేసులు పెట్టారు. గుంటూరు జిల్లాలో అనుమర్లపూడి చెరువులో మట్టితవ్వకాల్ని అడ్డుకునేందుకు వెళ్లిన దూళిపాళ్ల నరేంద్రకుమార్ కారుపై దాడి చేశారు, వేమూరులో నక్కా లక్ష్మయ్య అనే దళితుడ్ని తీవ్రంగా కొట్టి గాయపరిచారు. కృష్ణా జిల్లా పమిడి ముక్కల మండలంలో అక్రమ తవ్వకాల్ని అడ్డుకోబోయిన రెవిన్యూ సిబ్బందిపై దాడికి యత్నించారు. జగన్ రెడ్డి సొంత జిల్లా కడపలో వైసీపీ అరాచకాలకు అడ్డూ, అదుపు లేదు. వైసీపీ మైనింగ్ మాఫియా దండుపాళ్యం బ్యాచ్ ని మించి అరాచకాలకు పాల్పడుతుంటే రెవిన్యూ అధికారులు, పోలీసులు ఏం చేస్తున్నారు? అసలు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో అక్రమ మైనింగ్ జరగని ప్రాంతం ఉందా? ఇంతవరకు ఎంతమందిపై చర్యలు తీసుకున్నారు? మీ ధనదాహం కోసం ప్రకృతి ప్రసాదించిన సహజవనరుల్ని దోచేస్తూ రాష్ట్రాన్ని అక్రమ మైనింగ్ కి అడ్డాగా మార్చారు. వైసీపీ నేతల దోపిడి, దౌర్జన్యాలతో ప్రజలు విసిగిపోయారు, ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైసీపీని తరిమికొట్టేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు జోస్యం చెప్పారు.