– కల్తీమద్యం తయారీ, విక్రయదారులు, ఎర్రచందనం స్మగ్లర్లను పెద్దల సభకు పంపాలన్న జగన్ ఆలోచన, రాష్ట్ర భవిష్యత్ వినాశనానికే దారితీస్తుంది.
• కల్తీమద్యం, విక్రయాలతో జైలుపాలై బెయిల్ పై బయటున్నశ్యామ్ ప్రసాద్ రెడ్డి తప్ప, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా జగన్ కు ఎవరూ దొరకలేదా?
• పట్టభద్రుల సమస్యలపై అవగాహనఉన్న కంచర్ల శ్రీకాంత్ ని కాదని, కల్తీమద్యం తయారీ, విక్రయదారైన శ్యామ్ ప్రసాద్ రెడ్డిని గెలిపిస్తే ఏంజరుగుతుందో విజ్ఞులైన పట్టభద్రఓటర్లు ఆలోచించాలి.
• ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాలు, గెలుపుకోసం జగన్ అనుసరిస్తున్న తప్పుడు విధానాలపై కేంద్రఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేయబోతున్నాం : టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు.
• వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో 13 మంది నేరచరితులేనని A.D.R సంస్థ తేల్చింది : బొండా
నిమ్మల రామానాయుడు (టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, శాసనసభ్యులు), బొండా ఉమామహేశ్వరరావు (టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు)
పెద్దలసభ అయిన శాసనమండలిని గతంలో దారుణంగా అవమానించిన జగన్మోహన్ రెడ్డి, నేడు తనపార్టీ తరపున ఆసభకు పంపే అభ్యర్థుల్ని గెలిపించుకోవడానికి అడ్డదారులు, అక్రమ మార్గాలను ఎంచుకున్నాడని, ఫోర్జరీ సంతకాలు, ఫోర్జరీ స్టాంప్ లు, నకిలీవిద్యార్హతల ధృవపత్రాలతో పట్టభద్రుల ఓట్లలో పెద్దఎత్తున దొంగఓట్లను చేర్పించాడని టీడీపీ పొలిట్ బ్యూ రోసభ్యులు, శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు తెలిపారు.
మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం ఆయన పార్టీ పొలిట్ బ్యూరోసభ్యు లు బొండా ఉమామహేశ్వరరావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు.
ఆ వివరాలు వారిమాటల్లోనే …
కల్తీ మద్యం తయారీ, విక్రయదారుగాఉన్న వ్యక్తితప్ప, పెద్దలసభకు పంపడానికి జగన్ కు మంచివాళ్లు ఎవరూ దొరకలేదా?
“వైసీపీతరుపున తూర్పురాయలసీమ నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీచేస్తున్న పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి మద్యం అక్రమరవాణా, కల్తీమద్యంతయారీ విక్రయాల కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అతను ప్రస్తుతం బెయిల్ పై బయటఉన్నాడు. కల్తీమద్యంతో 11 మందిని పొట్టనపెట్టుకున్న వ్యక్తిని జగన్ పెద్దలసభకు పంపాలని నిర్ణయం తీసుకోవడం ని జంగా సిగ్గుచేటు. తాను బెయిల్ పై బయటకువచ్చి ముఖ్యమంత్రికాగా లేనిది, మద్యం అమ్మకునే శ్యామ్ ప్రసాద్ రెడ్డి మండలిసభ్యుడు అయితే వచ్చేనష్టం ఏమిటని ముఖ్యమంత్రి ఆలోచించినట్టున్నాడు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి మద్యంతయారీ, విక్రయం కేసుల్లో ఏ3గా ఉన్నా డు.
అతని ఇల్లు, పొలాలవద్దే గతంలో అక్రమమద్యం లభించింది. శ్యామ్ ప్రసాద్ రెడ్డి, కేవలం 10, 8రూపాయలకే కల్తీమద్యం విక్రయాలు జరిపేవాడని అక్కడివారే చెబుతున్నారు. అత నిపై ఐపీసీ 420, 487, 120 (బీ) సెక్షన్లకింద కేసులు నమోదయ్యాయి. అలానే ఎక్సైజ్ యాక్ట్ 34, 37కి సంబంధిం చిన కేసులుకూడా శ్యామ్ ప్రసాదరెడ్డిపై ఉన్నాయి. అలాంటివారి ని గెలిపిస్తే, జగన్ ను ముఖ్యమంత్రిని చేయడం ద్వారా జరిగిననష్టంకంటే ఎక్కువ నష్టం రా ష్ట్రానికి జరుగుతుంది. రాష్ట్ర భవిష్యత్ వినాశనానికే జగన్ తప్పుడువ్యక్తుల్ని గౌరవసభకు పం పాలని నిర్ణయించుకున్నాడు.
పట్టభద్రుల సమస్యలపై అవగాహనఉన్న కంచర్ల శ్రీకాంత్ ని కాదని, కల్తీమద్యం తయారీ, విక్రయదారైన శ్యామ్ ప్రసాద్ రెడ్డిని గెలిపిస్తే ఏంజరుగుతుందో విజ్ఞులైన పట్టభద్రఓటర్లు ఆలోచించాలి.
శ్యామ్ ప్రసాద్ రెడ్డి విక్రయించే కల్తీమద్యం తాగి, చాలామంది ప్రాణాలుకోల్పోయారని, అనేక మంది కాళ్లుచేతులు చచ్చుబడి మంచాలకే పరిమితమయ్యారని మద్యాన్ని పరీక్షించిన ల్యా బ్ లు ఇచ్చిన నివేదికల్లో స్పష్టంచేశారు. ఎర్రచందనం అక్రమరవాణాచేసే అంతర్జాతీయ స్మగ్ల ర్ అప్పుతో శ్యామ్ ప్రసాదరెడ్డికి సన్నిహిత సంబంధాలున్నాయి.
అప్పు చనిపోయేవరకు అతనితోకలిసే శ్యామ్ ప్రసాద్ రెడ్డి కల్తీమద్యం వ్యాపారంచేస్తున్నాడని రాయలసీమ వాసులు చెబుతున్నారు. మద్యం తయారీ, విక్రయాలు, ఎర్రచందనం స్మగ్లింగ్ తో సంబంధాలున్న శ్యా మ్ ప్రసాద్ రెడ్డి పట్టభద్రులఎమ్మెల్సీగా పోటీచేయడం సిగ్గుచేటు. అలాంటి వ్యక్తిని గెలిపించి పెద్దలసభకు పంపిస్తే, పట్టభద్రులంతా వారిపరువు వారి తీసుకున్నట్టేనని స్పష్టంచేస్తున్నాం.
పట్టభద్రుల సమస్యలపై అవగాహన ఉండి, వారికోసం పనిచేసే కంచర్ల శ్రీకాంత్ లాంటి వారిని కాదని, మద్యంతయారీ, విక్రయదారుల్ని గెలిపిస్తే ఎలాంటి పరిణామాలు ఉత్పన్నమవుతా యో విజ్ఞులైన పట్టభద్రులంతా ఆలోచించాలని కోరుతున్నాం. సమర్థుడైన శ్రీకాంత్ ను గెలిపిం లి” అని నిమ్మల పట్టభద్రులకు విజ్ఞప్తిచేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాలు, ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానా లపై కేంద్రఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేయబోతున్నాం : టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు
అధికారపిచ్చితో పాలనచేస్తున్న జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజాస్వామ్యం అడుగడుగునా అ పహాస్యం పాలవుతోంది. గతంలోతిరుపతి ఎంపీ ఉపఎన్నికలో మంత్రులు పెద్దిరెడ్డి రామచం ద్రారెడ్డి, ఇతరులు పక్కజిల్లాలనుంచి దొంగఓటర్లను తీసుకొచ్చి దగ్గరుండి దొంగఓట్లు వేయిం చారు. ఆనాడు జరిగిన ప్రజాస్వామ్యహననాన్ని చూసి రాష్ట్రప్రజలంతా ముక్కున వేలేసుకు న్నారు. ఇప్పుడు దానికి పదింతలు దొంగఓట్లను నమ్ముకొని ఎమ్మెల్సీఎన్నికల్లో గెలవాలని జగన్మోహన్ రెడ్డి, అతని బృందం పనిచేస్తోంది.
అధికార కాంక్షతో రగిలిపోతున్న జగన్, ధనం, అధికారంసాయంతో దొంగఓట్లతోనే అన్నిఎన్నికల్లో గెలవాలని చూస్తున్నాడు. పట్టభద్ర ఎన్ని కల కోసం వైసీపీ విచ్చలవిడిగా దొంగ ఓట్లను తయారుచేసింది. కొన్నిప్రాంతాల్లో ఒక్కో ఇంటిలో 10, 12, 20, 38 మంది పట్టభద్రులు ఉన్నట్టు అధికారులు ఓట్లునమోదుచేశారు. తప్పుడు చిరునామాలతో, తప్పుడు ధృవీకరణపత్రాలు, భారీస్థాయిలో దొంగఓట్లు నమోదు చేశారు. 5, 7, 10వ తరగతి చదివినవారిని పట్టభద్రులుగా నిర్ధారించి ఓటర్లుగా చేర్చారు.
స్థానికఎన్నికల్లో ఇంటర్ విద్యార్హతతో కార్పొరేటర్లుగా పోటీచేసిన వైసీపీఅభ్యర్థులు, ఎమ్మెల్సీ ఎన్నికలనాటికి గ్రాడ్యుయేట్లు అవ్వడం.. జగన్ ప్రభుత్వంలోనే సాధ్యం.
అధికార పార్టీ అండతో భారీస్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన దొంగఓట్ల వ్యవహారంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు ఆధారాలతో సహా ఫిర్యాదుచేసినా చర్యలులేవు. ఆటోతోలుకునే వారు, కూరగాయలు, పండ్లు అమ్ముకొని జీవిస్తూ ఎలాంటి విద్యార్హతలు లేనివారందరినీ వై సీపీనేతలు, అధికారులు పట్టభద్రులుగా చేర్చారు. ఈ వ్యవహారంపై ఎన్నికలకమిషన్ స్పం దించి, చర్యలు తీసుకోకుంటే పరిణామాలు చాలాతీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నాం.
దొంగఓట్లకోసం తిరుపతి ఎమ్మార్వో, విద్యుత్ శాఖ అధికారిసంతకాలను కూడా వైసీపీనేతలు ఫోర్జ రీచేశారు. తిరుపతిలో అధికారపార్టీకి చెందిన ఇద్దరుకార్పొరేటర్లు గతంలో ఇచ్చిన ఎన్ని కల అఫిడవిట్ లో ఇంటర్ చదివినట్టు వారే వారి సెల్ఫ్ డిక్లరేషన్లలో స్పష్టంగా చెప్పారు. 8వడివిజన్ కార్పొరేటర్ మునిరత్నం రెడ్డి, 12వ డివిజన్ వైసీపీకార్పొరేటర్ ఎస్.కే.బాబు రాత్రికిరాత్రి గ్రాడ్యుయేట్లు ఎలాఅయ్యారో ప్రభుత్వం, అధికారులు సమాధానంచెప్పాలి. ఇంటర్ చదివినవారందరినీ రాత్రికిరాత్రి గ్రాడ్యుయేట్లుగా మారుస్తూ జగన్, విద్యాశాఖ మంత్రి కొత్తగా జీవో తీసుకొచ్చారా? ఇలాంటి ఉదాహరణలు మావద్ద కోకొల్లలు ఉన్నాయి.
తాము బయటపెట్టిన దొంగఓటర్ల జాబితాలో నిజమైన గ్రాడ్యుయేట్లు ఉన్నారని నిర్ధారించే ధైర్యం అధికారులకుందా? వైసీపీ నమోదుచేయించిన ఓటర్లంతా నిజమైన గ్రాడ్యుయేట్లేనని అధికారయంత్రాంగం ధృవీకరిస్తే, తామే తప్పు ఒప్పుకొని క్షమాపణచెబుతాం.
దొంగఓట్లతో, తప్పుడు మార్గాల్లో గెలుస్తానన్న నమ్మకంతోనే జగన్మోహన్ రెడ్డి వచ్చేఎన్నిక ల్లోకూడా 175 స్థానాలు గెలుస్తానంటున్నాడా? ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికలో గెలవడం కోసం వైసీపీతరుపున పోటీచేస్తున్న అభ్యర్థి బంగారుబిస్కట్లు పంచుతుంటే, అధికారయం త్రాంగం చోద్యంచూస్తోంది. ఆధారాలతోసహా టీడీపీ ఫిర్యాదుచేసినా స్పందించని అధికారులపై కచ్చితంగా న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాం.
దొంగఓట్ల చేర్పులో భాగంగా అధికారపార్టీ నేతలఆదేశాలకు తలొగ్గి తప్పుడుసంతకాలు పెట్టిన అధికారులందరూ మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరిస్తున్నాం. చిత్తూరుకలెక్టర్, తిరుపతి కలెక్టర్, తిరుపతి ఎస్పీ, చిత్తూరుతిరుపతి జిల్లాల ఎన్నికలఅధికారులు అందరూ వైసీపీప్రభుత్వ కుట్రలో భాగ స్వాములే. జగన్మోహన్ రెడ్డి ఉన్నాడనో, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమనకరుణాకర్ రెడ్డి చెప్పాడనో ఉద్యోగధర్మానికి విరుద్ధంగా పనిచేసేవారందరూ కటకటాల పాలు కావాల్సిందే.
టీడీపీ వారు ఇచ్చినఫిర్యాదులపై విచారణ జరిపి, ఓటర్లుగా నమోదైనవారంతా కష్టపడి చదు వుకున్న అసలైన గ్రాడ్యుయేట్సే అని అధికారులు నిర్ధారించగలరా? అధికారులు క్షేత్రస్థా యిలో పర్యటించి, వాస్తవాలు పరిశీలించి దొంగఓటర్లు, అసలు ఓటర్లు ఎవరోనిర్థారిస్తే, తప్పు ఒప్పుకొని క్షమాపణచెప్పడానికి తాము సిద్ధంగాఉన్నాం.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీతరుపున బరిలో నిలిచిన వారిలో 13మంది నేరచరితులే. దొంగ ఓట్ల తంతులో భాగస్వాములైన అధికారులతోపాటు, ఓట్లేయడానికి వచ్చేనకిలీఓటర్లంతా కటకటాలపాలు కావడం ఖాయం.
A.D.R (Association For Democratic Reforms) స్వచ్ఛందసంస్థ చేసిన సర్వేలో వైసీపీ తరుపున మండలికి పోటీ చేస్తున్నవారిపై ఎన్నికేసులున్నాయో బయటపడింది. 13మంది క్రిమినల్స్ వైసీపీ తరుపున ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేస్తున్నారని సదరుసంస్థ తేల్చింది. కల్తీ సారా అమ్మేవారు, ఎర్రచందనందొంగలు, బెయిల్ పై తిరిగేవాళ్లు పెద్దలసభకు వెళ్లి, ప్రజలకో సం, రాష్ట్రంకోసం పనిచేస్తారా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుకోసం తప్పుడుమార్గాలు అనుస రించిన వైసీపీ విధానాలను కేంద్ర ఎన్నికలసంఘం ముందుఉంచబోతున్నాం.
ఇప్పటికే టీడీ పీ ఎంపీలు ఈ విషయంపై కేంద్రఎన్నికలకమిషనర్ కు ఫిర్యాదుచేయబోతున్నారు. వైసీపీ నేతల అండతోనో, మంత్రి పెద్దిరెడ్డి, భూమనకరుణాకరెడ్డి చెప్పాడనో దొంగఓటర్లు ఓట్లువేయ డానికి పోలింగ్ బూత్ లకు వస్తే, వారిగొయ్యి వారు తీసుకున్నట్టే అని హెచ్చరిస్తున్నాం. ప్రతి దొంగఓటర్ వివరాలు మావద్దఉన్నాయి. వారిందరిపై తప్పకుండా క్రిమినల్ కేసులునమోదు చేయించి జైలుకుపంపేవరకు టీడీపీ ఊరుకోదని ఈసందర్భంగా హెచ్చరిస్తున్నాం.
తమవద్ద ఉన్నఅధారాలతో, దొంగఓట్ల తంతులో భాగస్వాములైన అధికారులు, నకిలీ గ్రాడ్యుయేట్స్ అందరూ కటకటాలపాలు కాకతప్పదని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. రాష్ట్రప్రజలంతా కూడా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాల్ని గమనించాలని కోరుతు న్నాం. ఎమ్మెల్సీ ఎన్నికలకోసమే ఇలాంటి తప్పుడుమార్గాలు ఎన్నుకున్న జగన్ అతని బ్యా చ్ అసలుసిసలు అసెంబ్లీ ఎన్నికలకోసం ఇంకెన్నిదారుణాలకు తెగబడతారో ప్రతిఒక్కరూ ఆలోచించాలి” అని బొండా విజ్ఞప్తిచేశారు.
విలేకరుల సమావేశంలో టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శులు బుచ్చిరామ్ ప్రసాద్, లుక్కా సాయిరామ్ గౌడ్ పాల్గొన్నారు.