• అనితపై సోషల్ మీడియాలో విషప్రచారంచేసిన వారిని వదిలేసి, ఆమెపై తప్పుడుకేసులు పెట్టడం వైసీపీప్రభుత్వ పైశాచకత్వంకాదా?
• అనితను దూషించనట్టే, పోలీసుల కుటుంబాల్లోని, వైసీపీ నేతల కుటుంబాల్లోని మహిళల్ని దూషిస్తే ఖాకీలు ఊరుకుంటారా?
• ఉన్నతస్థానాల్లోని దళితుల్నికూడా వదలకుండా, తన ఎంగిలిమెతుకులు తినే పేటీఎమ్ కుక్కల్ని వారిపైకి ఉసిగొల్పుతున్నాడు.
• దళితులు తనకు బంధువులని మోసగించిన జగన్, నిత్యం దళితులపై ఈర్ష్యాద్వేషాలతో రగిలిపోతున్నాడు.
• ఒంగోలులో గిరిజనయువకుడిపై మూత్రంపోస్తే, ముఖ్యమంత్రికి చీమకుట్టినట్టులేదు : ధారు నాయక్
• గంజాయి సాగు, విక్రయాలతో వైసీపీనేతలు, కార్యకర్తలు జేబులు నింపుకుంటుంటే, చేయనినేరాలకు అమాయక గిరిజనులు జైళ్లపాలవుతున్నారు : ధారు నాయక్
– టీడీపీ అధికారప్రతినిధి పిల్లి మాణిక్యరావు , టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దారునాయక్
రాష్ట్రంలో దళితులపై దాడులు చేయడాన్ని జగన్మోహన్ రెడ్డి, అతని పార్టీవారు ప్రత్యేక అర్హతగా పరిగణిస్తున్నారని, ఎంతటిఉన్నత స్థానంలో ఉన్న దళితులైనా సరే, వారిపై దాడిచేయండి.. చంపేయండి అనేలా ముఖ్యమంత్రి వైసీపీ మూకల్ని ప్రోత్సహిస్తు న్నాడని, డాక్టర్ సుధాకర్ నుంచి టీడీపీ మహిళానేత వంగలపూడి అనితవరకు అందరూ జగన్ అండ్ సైకో బ్యాచ్ బాధితులేనని టీడీపీ అధికారప్రతినిధి మాణిక్యరావు తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో బుధవారం ఆయన టీడీపీనేత దారు నాయక్ తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు వారి మాటల్లోనే ..
“ జగన్ పాలనలో దళితులు ఎవరూ రాష్ట్రంలో ఉండటానికి వీల్లేదన్నంత దుర్మార్గంగా వైసీపీ పేటీఎమ్ బ్యాచ్ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. తెలుగుదేశంపార్టీలో కీలకస్థానం లో ఉన్న వంగలపూడి అనిత వ్యక్తిత్వాన్ని, ఆమెకుటుంబాన్ని దారుణంగా ట్రోల్ చేస్తు న్నారు. అనితకు, వైసీపీనేతలు, ఆపార్టీ పేటీఎమ్ బ్యాచ్ కు ఎలాంటి విరోధాలులేవు.
ఆమె చేసిన తప్పేంటో వైసీపీప్రభుత్వంలో రాష్ట్రంలో జరిగే అరాచకాలు, ముఖ్యంగా ఆడ బిడ్డలపై జరిగే దారుణాలగురించి పాలకుల్ని నిలదీయడమే. దానికే వైసీపీ పేటీఎమ్ కుక్కలు, ఆపార్టీకి చెందిన నీతిమాలిన వ్యక్తులు అనిత వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ, ఆమెను మానసికంగా వేధిస్తున్నారు.
వాళ్ల ఇళ్లల్లోని ఆడవాళ్లను ఎవరైనా, ఏమైనా అంటే వైసీపీ నేతలు, ఆపార్టీ పేటీఎమ్ కుక్కలు ఊరుకుంటాయా?
కొన్ని వైసీపీ పేటీఎమ్ కుక్కలు అయితే జర్నలిస్టుల ముసుగులో అనిత వ్యక్తిత్వాన్ని దారుణంగా కించపరుస్తున్నారు. ఆమె ఇంటిపేరు, ఒంటిపేరుని, ఆమె వ్యక్తిత్వాన్ని, జీవితాన్ని కించపరుస్తూ అనరాని మాటలంటున్నారు. అనితను అనరాని మాటలం టున్నవారిని ఒకటే అడుగుతున్నాం. ఆమెను అనేవారు ఎవరైనాసరే, ఏ కులం, ఏపార్టీ వారు అయినాసరే, వారితల్లులు, అక్కచెల్లెళ్లను కూడా అలానే అనగలరా? వ్య భిచారం చేస్తే పుట్టినవారు కూడా అంతదారుణంగా మాట్లాడరు..రాయరు.
అలాంటి అసభ్యపదజాలంతో అనితను దూషిస్తున్నారు. సజ్జనరావు అనేవాడు జర్నలిస్ట్ ము సుగులో అనితను దూషిస్తే, ఆమె అతనింటికివెళ్లి, అతని భార్యను ప్రశ్నించింది. దానికే అనితపై తప్పుడుకేసులు పెట్టారు. తనను ఇలాదూషించారని అనిత కేసుపెడితే దాన్ని తీసుకోనిపోలీసులు, ఆమెను దూషించినవాడి కేసుని వెంటనే నమోదుచేసి, అనితపై ఎఫ్.ఐ.ఆర్ నమోదుచేయడాన్ని ఏమనాలి? నిజమైన పోలీసులు ఎవరైనా ఇలా ప్రవర్తిస్తారా?
నందిగామ సీఐ, ఎస్సై, ఎవరైనా సరే వారికుటుంబసభ్యుల గురించి ఎవరైనా విషప్రచారంచేస్తే సదరు పోలీస్ అధికారులు ఊరుకుంటారా? దళితవర్గానికి చెందిన ఆడబిడ్డ కష్టపడిచదువుకొని పైకొచ్చి, ఎమ్మెల్యేగా పనిచేసి, టీడీపీలో కీలకస్థా నంలో పనిచేస్తుంటే, జగన్ ఎంగిలిమెతుకులకు ఆశపడిన కొన్నిపేటీఎమ్ కుక్కులు ఆమెపై నీతిమాలినప్రచారం చేస్తుంటే చూస్తూఊరుకోవాలా? తనకు ఎదురవుతున్న అవమానాలు, వేధింపులపై ఆమె మాట్లాడకూడదా? దళిత ఆడబిడ్డ అంటే జగన్ కు, అతని పార్టీవారికి, వైసీపీ పేటీఎమ్ కుక్కలకు ఎందుకంత అసూయద్వేషం?
వంగలపూడి అనితపై కామెంట్స్, పోస్టింగ్స్ పెట్టిన సజ్జనరావు, పీ.ఎల్.ఆర్ లు, వైసీపీ పేటీఎమ్ కుక్కలు జగన్ ని మించిన దుర్మార్గులు ఎవరూ ఉండరని తెలుసుకోవాలి
డాక్టర్ సుధాకర్, సీఐ ఆనందరావు, పొలిటీషియన్ అనిత లాంటివాళ్లు దళితులుగా పుట్టి, అందరూగర్వించే స్థాయికి రావడానికి ఎంతకష్టపడి ఉంటారు? సజ్జనరావు అనే వాడు కడుపుకి అన్నమే తింటున్నాడా..లేక గడ్డి తింటున్నాడా? అన్నం తినేవాడు ఎవడూ ఆడబిడ్డలపై ఇంతహీనంగా విషప్రచారంచేయడు. అనిత తనపై దుష్ప్రచారం చేస్తున్న సజ్జనరావు ఇంటికెళ్లి మాట్లాడితే, ఆమెతనను నాకొడకా అన్నదని చెప్పి, దానికి పెడార్థాలు తీసి, ఆమె నాకు తల్లా.. మానాన్నకు ఏమవుతుంది అని దుర్మార్గం గా మాట్లాడటం సిగ్గుచేటు.
పశువులకు పుట్టినవాడే అలా ప్రవర్తిస్తాడు. సజ్జనరావుని తిట్టడానికి మాకు సంస్కారం అడ్డొస్తుంది. సజ్జనరావు అనితపై చేసిన దుష్ప్రచారానికి సంబంధించిన కామెంట్స్, ఫోటోలు, అసభ్యకర రాతల్ని పీ.ఎల్.ఆర్ అనేపేరుతో ఉన్న జర్నలిస్ట్ పోస్ట్ చేశాడు. సజ్జనరావు, పీ.ఎల్.ఆర్ లాంటి వెధవల్ని పట్టుకోవడం పోలీ సులకు కష్టమా? పోలీసులు పట్టించుకోనందునే వైసీపీ పేటీఎమ్ కుక్కలు వీధుల్లో పడి మొరుగుతున్నాయి.
తన ఎంగిమెతుకులు తినే కుక్కల్ని ఉసిగొల్పి జగనే, టీడీపీ నేతలపై, గిట్టనివారిపై విషప్రచారం చేయిస్తున్నాడు. దళితులు నాబంధువులని చెప్పి, వారి గొంతులుకోయడానికి కత్తులునూరుతున్నాడు. నమ్మినవాళ్లు ఎవరైనాసరే, వాళ్లను నట్టేటముంచే స్వభావం జగన్ ది. ముఖ్యమంత్రి పదవికోసం తండ్రిని హెలికాఫ్ట ర్ ఎక్కించి చంపేశాడు.
ఎన్నికల్లో గెలవడానికి బాబాయ్ పై గొడ్డలిపోట్లువేసి, బాత్రూమ్ లో పడుకోబెట్టాడు. తల్లిని, చెల్లిని ఎన్నికలప్రచారానికి వాడుకొని ఈడ్చిబయటపడేశా డు. ఇంతకంటే దారుణమైనవ్యక్తి ఎవరైనా ఉంటారా? అలాంటివాడి మోచేతినీళ్లు తాగే వైసీపీ పేటీఎమ్ కుక్కలు విశ్వాసంగా ఉంటాయనుకోవడం అత్యాశే.
వచ్చేఎన్నికల్లో దళితులు కొట్టేదెబ్బ, జగన్ కు చావుదెబ్బే అవుతుంది
జగన్మోహన్ రెడ్డి, వైసీపీనేతలు, ఆపార్టీ రౌడీలు, పేటీఎమ్ బ్యాచ్ చేసే దుర్మార్గాలు, అరాచకాలు అన్నీ గమనిస్తున్నాం. ప్రతి అరాచకానికి భవిష్యత్ లో సమాధానంచెప్పు కోక తప్పదని జగన్ ను హెచ్చరిస్తున్నాం. రాష్ట్రంలో దళితులే లేకుండా చేయాలనుకుంటున్న జగన్ ఆశలు ఎప్పటికీ నెరవేరవు. వచ్చేఎన్నికల్లో దళితజాతి కొట్టే దెబ్బ, జగన్ కు చావుదెబ్బే అవుతుంది.” అని మాణిక్యరావు తేల్చిచెప్పారు.
ఒంగోలులో గిరిజనయువకుడిపై మూత్రంపోస్తే, ముఖ్యమంత్రిలో చలనంలేదు, గిరిజనుల్నిచిన్నచూపుచూస్తున్న జగన్మోహన్ రెడ్డికి, వచ్చేఎన్నికల్లో తగిన బుద్ధిచెబుతాం. : ఎం. ధారు నాయక్
జగన్మోహన్ రెడ్డి పాలనలో దళితులు, గిరిజనులు నిత్యం భయభ్రాంతులతో బతుకు తున్నారు. గిరిజనులపై కక్షకట్టిన జగన్, వైసీపీప్రభుత్వం, అక్రమకేసులతో వారిని హింసిస్తోంది. నెలక్రితం ఒంగోలులో గిరిజనయువకుడు మేటునవీన్ ను దారుణంగా అవమానించారు. అతనినోటిలో మూత్రంపోసి చిత్రహింసలకు గురిచేశారు. మధ్యప్రదేశ్ లో జరిగిన దానికంటే ఒంగోలులోజరిగిన దారుణమే తీవ్రమైనది. తనకుజరిగిన అవమానంపై నవీన్ పోలీస్ స్టేషన్లో కేసుపెడితే, దానిపై పోలీసులు ఎలాంటిచర్యలు తీసుకోలేదు.
జరిగిన దారుణం బాహ్యప్రపంచానికి తెలిశాక పోలీస్ వ్యవస్థలో కదలిక రావడం దురదృష్టకరం. జగన్మోహన్ రెడ్డి ఒక అజెండా ప్రకారమే గిరిజనులపై హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నాడు. పల్నాడుజిల్లా నకరికల్లులో గిరిజనమహిళని వైసీ పీనేత శ్రీనివాసరెడ్డి దారుణంగా ట్రాక్టర్ తో తొక్కించి చంపితే, ప్రభుత్వం ఎలాంటిచర్యలు తీసుకోలేదు. నెల్లూరుజిల్లాలో కార్పొరేటర్ గా ఉన్న గిరిజనమహిళ స్రవంతిని, సొంత పార్టీవారు అవమానిస్తే, ముఖ్యమంత్రి మాటమాత్రంగాకూడా స్పందించలేదు.
ఉత్సవ విగ్రహం లాంటి ఉపముఖ్యమంత్రి పదవి గిరిజనులకుఇచ్చిన జగన్, మొత్తం జాతినే తనకాలి కింద అణిచేయాలని చూస్తున్నాడు. రాజన్నదొర ఉపముఖ్యమంత్రిస్థానంలో ఉండి, గిరిజనులకు రక్షణ కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యాడు. కేవలం తననియోజకవర్గానికే ఉపముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ, గిరిజనులపై జరిగే దారుణాల విషయంలో ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యాడు. ఐటీడీఏల్లో అవినీతిపెచ్చుమీరినా, రాజన్నదొర ఏనాడూ దానిపై స్పందించిందిలేదు.
గంజాయి అమ్ముకొని జేబులు నింపుకునేది వైసీపీనేతలు కార్యకర్తలా… చేయని నేరానికి జైలుకెళ్లాల్సింది గిరిజనులా?
సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని తిరువూరు నియోజకవర్గంలోని గంపలగూడెం లో బాణావత్ లక్ష్మానాయక్ పై అక్రమకేసులు పెట్టారు. రాష్ట్రంలో ఎక్కడ గంజాయి దొరికినా జగన్మోహన్ రెడ్డి, అతనిప్రభుత్వం గిరిజనుల్నే దోషులుగా చిత్రీకరించే ప్రయత్నంచేస్తోంది. వైసీపీప్రభుత్వానికి గిరిజనులంటే చిన్నచూపు. జగన్ పాలనలో బతుకు దెరువులేక, గిరిజనకుటుంబాలు రాష్ట్రంవిడిచి వలసపోతున్నాయి.
గిరిజనులకు గత ప్రభుత్వం అమలుచేసిన 16 ప్రత్యేకపథకాల్ని జగన్ రద్దుచేశాడు. గిరిజనుల్ని వేధిస్తూ, వారినిబలితీసుకుంటున్న ముఖ్యమంత్రికి వచ్చేఎన్నికల్లో తగినబుద్ధి చెబుతాం. వైసీ పీనేతలు, కార్యకర్తలు, గంజాయి అమ్ముకొని జేబులునింపుకుంటుంటే అమాయకగిరి జనులు జైళ్లకు వెళ్లాలా?
గిరిజనగ్రామాలు తండాలకు రోడ్లు, తాగునీరు, విద్యుత్ వంటి మౌలికసదుపాయాలు కూడా కల్పించలేని జగన్, అతనిప్రభుత్వం కావాలనే గిరిజను లపై కక్షసాధింపులు, వేధింపులకు పాల్పడుతోంది.” అని ధారు నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు.