– తాలిబన్ల పాలన కంటే రాష్ట్రంలో దుర్మార్గపు పాలన
– ఎస్పీ రవి శంకర్ రెడ్డి ఐపీఎస్ కోడ్ అమలు చేయాలి కానీ వైసీపీ కోడ్ ని అమలు చేస్తున్నారు
– పల్నాడులో ఎమ్మెల్యేలు ఏమి చెబితే అదే ఎస్పీ చేస్తున్నారు
– టీడీపీ పల్నాడు జిల్లా అధ్యక్షులు జివి ఆంజనేయులు
వైసిపి శ్రేణులు దాడిలో గాయపడిన టిడిపి కార్యకర్తలను పరామర్శించి అనంతరం నరసరావుపేట టిడిపి కార్యాలయంలో టిడిపి పల్నాడు జిల్లా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
పల్నాడు జిల్లాలో ఎస్పీ రవి శంకర్ రెడ్డి ఐపీఎస్ కోడ్ అమలు చేయాలి కానీ వైసీపీ కోడ్ ని అమలు చేస్తున్నారు.నరసరావుపేటలో జరిగిన ఘర్షణలో 19 మంది టీడీపీ వర్గీయులపై హత్యాయత్నం కేసులు నమోదు చేసి, వైసీపీ నేతలపై స్టేషన్ బెయిల్ కేసులు పెట్టారు. బాధితులపైనే తిరిగి కేసులు పెట్టడం సిగ్గుచేటు.
వైసీపీ పార్టీ కోసం పనిచేయాలని పోలీసులు అనుకుంటే మీ ఉద్యోగాలకు రాజీనామా చేసి వైసీపీ సభ్యత్వం తీసుకుని పని చేయండి.అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఏ సెక్షన్ లు పెట్టమంటే పోలీసులు వెంటనే అదే సెక్షన్ లు పెడుతున్నారు. నరసరావుపేటలో ఐపి పెట్టిన వాళ్లంతా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనుచరులను ఆశ్రయిస్తున్నారు.నరసరావుపేటలో ఘర్షణలో ఎమ్మెల్యే గోపిరెడ్డి దళితులను చంపమని వాళ్ళ అనుచరులకు ఆదేశాలు ఇచ్చారు.ఘటనా స్థలంలో ఎమ్మెల్యే ఉన్నా ఆయన మీద చిన్న కేసు కూడా నమోదు చేయలేదు.కర్రలు,రాళ్లతో వైసీపీ నేతలు బీభత్సం సృష్టిస్తే.. పోలీసులు అక్కడే ఉండి ఎందుకు అడ్డుకోలేక పోయారు. బాధితులపైనే మర్డర్ కేసులు పెట్టడం విడ్డురంగా ఉంది.
ఒకప్పుడు ఆంద్రప్రదేశ్ పోలీసులు అంటే దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉండేవారు,ఇప్పుడు చిట్టచివరి స్థానంలో ఉన్నారు. తాలిబన్ల పాలన కంటే రాష్ట్రంలో దుర్మార్గపు పాలన ఉంది.కళ్ళ ముందే విధ్వంసం జరుగుతున్నా పోలీసులు అడ్డుకోలేదు.మాకు అన్యాయం జరిగిందని అరవిందబాబు కి మహిళలు చెబితే అక్కడికి వెళ్లారు.మాచర్లలో టీడీపీ ఆఫీస్ ని ఎమ్మెల్యే అనుచరులు తగలబెడితే,అలాంటి వారిపై కూడా చిన్న కేసులు పెట్టిన చరిత్ర పోలీసులది. కారంపూడి టీడీపీ మండల అధ్యక్షుడుపై దాడి జరిగితే తిరిగి వాళ్లపై హత్యాయత్నం కేసు పెట్టారు. పల్నాడులో ఎమ్మెల్యేలు ఏమి చెబితే అదే ఎస్పీ చేస్తున్నారు. లా అండ్ ఆర్డర్ లో పోలీసులు పూర్తిగా విఫలం చెందారు.మా వాళ్లకు న్యాయం జరిగే వరకూ మాపోరాటం ఉంటుంది. అవసరం అయితే ప్రయివేటు కేసులు పెడతాము. నరసరావుపేట దాడిపై త్వరలోనే ఐజిని కలుస్తాం.