Suryaa.co.in

Andhra Pradesh

సర్పంచ్ ల కన్నీళ్ల కు జగనే కారణం

– బీజేపీ అధికార ప్రతినిధి ఆర్. డి. విల్సన్

గ్రామీణాభివృద్ధి కి దోహద పడే నిధులు డైవర్ట్ చేసిన హీన చరిత్ర జగన్ ది అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎస్. సి కార్పొరేషన్ చైర్మన్ దుయ్య బట్టారా. బుధవారం బీజేపీ జిల్లా కార్యాలయం లో జిల్లా అధ్యక్షులు భరత్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన పాత్రికేయ సమావేశం లో ఆయన మాట్లాడారు.13,14.. ఆర్ధిక సంఘం నిధులు కూడా డైవర్ట్ చేసి రాష్ట్ర లోని అన్ని గ్రామాల్లో .. మౌలిక సదుపాయాలు లేని పరిస్థితి సీఎం జగన్ కల్పించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రామాల్లో తాగునీటి వసతులు, రోడ్లు పారిశుధ్యం కోసం.. నరేంద్ర మోడీ గారు ఇచ్చే నిధులు రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుందని విల్సన్ అన్నారు. రాష్ట్రంలో 10 లక్షల 70 వేల కోట్లు అప్పులు పేరుకు పేరుకు పోయి ప్రతి ఇంటి మీద ఐదు నుంచి ఏడు లక్షలు అప్పులు తేలయని అన్నారు.

బ్యాంకులకు వడ్డీ చెల్లించలేక రాష్ట్ర ప్రభుత్వం సతమతమవుతుందని. ప్రభుత్వ ఆస్తుల సైతం తనఖా పెట్టే దుస్థితికి రాష్ట్ర ప్రభుత్వం చేరుకుందని అన్నారు. జిల్లా కలెక్టరేట్లు మండల రెవెన్యూ కార్యాలయాలు కూడా తాకట్టుపెట్టబడుతున్నాయని అన్నారు.

అప్పులు తీర్చడానికి చెత్త మీద కూడా పన్ను వేసే పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం దిగజారిపోయిందని అన్నారు. కార్పొరేషన్ల పేరుతో తీసుకొచ్చిన 5 లక్షల కోట్ల ఏమైపోయాయో అర్థం కావడం లేదని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక శ్వేత పత్రం విడుదల చేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పురందేశ్వరి గారు కోరారని అన్నారు. ప్రభుత్వం తేలు కుట్టిన దొంగలాగా మారిపోయి అవాకులు చవాకులు పేలుతుందన్నారు. రాష్ట్ర స్థూల ఆదాయం 15 లక్షల కోట్ల చూపిస్తూ ఎఫ్ ఆర్ బి ఎం పరిమితికి మించి అప్పులు చేయడానికి ప్రభుత్వం తెగ బడిందన్నారు.

రాష్ట్రంలో ఒక పరిశ్రమ రాకుండా అభివృద్ధిని ఎలా ఎక్కవేసి చూపిస్తారని నిలదీశారు. మద్యం ఆదాయాన్ని చూపి అప్పులు చేస్తున్నారని.. ఉద్యోగులు దాచుకున్న పిఎఫ్ నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం డైవర్ట్ చేస్తుందన్నారు. ఎన్నారై జిసి నిధులు.. డిజాస్టర్ మేనేజ్మెంట్ నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం స్వాహా చేస్తుందన్నారు.

ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ మైనార్టీ కార్పొరేషన్ కేంద్రం ఇస్తున్న నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం డైవర్ట్ చేస్తుందన్నారు. దళిత గిరిజన, బీసీ, మైనార్టీల నిధులు డైవర్ట్ చేస్తున్న హీన చరిత్ర జగన్ది అన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా దళితుల నిధులను డైవర్ట్ చేసిన చరిత్ర లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఎన్ ఎస్ ఎఫ్ డి సి ఎన్ ఎస్ కే ఎఫ్ డి సి నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం డైవర్ట్ చేస్తుందన్నారు.

సర్పంచులకు బిజెపి అండగా నిలుస్తుంది : భరత్ కుమార్
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సర్పంచ్ నిధులను పక్కదారి మల్లిచడంపై రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి గారు ఇచ్చిన పిలుపుమేరకు వేలాది మందితో రేపు గురువారం కలెక్టరేట్ల ముందు ధర్నా జరుగుతుందని బిజెపి జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్ అన్నారు. గ్రామాల్లో కనీస వసతులు లేకపోవడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వమే అన్నారు. కనీసం వీధి దీపాలు వేయలేని పరిస్థితిలో సర్పంచులు కూరుకు పొయ్యారని అన్నారు.

గ్రామాల్లో రోడ్ల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. మెజార్టీ సర్పంచులు వైసిపి పార్టీకి చెందినా వాళ్లని రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసింది అన్నారు. మీడియా సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బి శ్రీనివాసులు, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు మొగారాల సురేష్ కుమార్, జిల్లా కార్యదర్శి గిరి కుమార్, జిల్లా అధ్యక్షుడు అశోక్ కుమార్, జిల్లా కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

LEAVE A RESPONSE