– టీడీపీ నేతల ఖాతాల్లోకి నిధులు వచ్చాయంటున్న ఏపీ సీఐడీ, ఎటునుంచి వచ్చాయో, ఎవరి ఖాతాల్లోకి.. ఎప్పుడు వచ్చాయో పూర్తి ఆధారాల్ని బయటపెట్టాలి.
– రాష్ట్ర యువత భవిష్యత్ కు బంగారుబాటలువేసే ప్రాజెక్ట్ ను నాశనంచేసిన జగన్, నిస్సిగ్గుగా టీడీపీపై నిరాధార ఆరోపణలు చేస్తున్నాడు.
• సీమెన్స్ సంస్థ తప్పుచేస్తే దానికి చంద్రబాబు ఎలా బాధ్యులవుతారు?
• అదే సీమెన్స్ సంస్థ ఏపీప్రభుత్వంతో ఒప్పందంచేసుకోకముందు, 6రాష్ట్రప్రభుత్వాలతో ఒప్పందాలు చేసుకుంది. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సీమెన్స్ అవినీతిలో భాగస్వాములేనా?
– టీడీపీ శాసనసభ్యులు, పీ.ఏ.సీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో అవినీతిజరిగిందంటూ జగన్ అతని మీడియా లేనిపోని ఆరోపణలతో, అభూతకల్పనలతో దుష్ప్రచారం చేస్తోందని, వైసీపీప్రభుత్వం ఏర్పడి 4ఏళ్లు అవుతున్నా, జగన్ దానిపై ఎందుకు ఏమీతేల్చలేకపోయాడని టీడీపీ శాసనసభ్యులు, పీ.ఏ. సీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు.
జూమ్ ద్వారా బుధవారం ఆయనవిలేకరులతో మాట్లాడిన వివరాలు ఆయన మాటల్లోనే .. “హైదరాబాద్ ను ఎలాగైతే చంద్రబాబుగారు ఐటీహబ్ గా మార్చారో, అదేవిధంగా విభజనా నంతర ఏపీలోని యువతకు, మెరుగైన ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించేందుకు సీమెన్స్ సంస్థతో గతంలో టీడీపీప్రభుత్వం ఒప్పందంచేసుకుంది. సీమెన్స్ సంస్థకు అధిపతిగా ఉన్న సుమన్ బోస్ తాను నిర్ణయించుకున్న కొందరికి ఏదో లబ్ధిచేకూర్చాడని మీడియాలో వచ్చిం ది. సుమన్ బోస్ చర్యకు చంద్రబాబుకి ఏమిటి సంబంధం? సీమెన్స్ అనేది జర్మనీకిచెందిన సంస్థ. అది 160కి పైగా దేశాల్లో దానికార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆ సంస్థ గుజరాత్ లోని యువతకు నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన శిక్షణ ఇస్తోందని తెలిసి, దానిపై స్టడీ చేశాకే, చం ద్రబాబు ప్రభుత్వం ఆసంస్థతో ఒప్పందంచేసుకుంది.
సీమెన్స్ సంస్థ తప్పుచేస్తే దానికి టీడీీపీ ప్రభుత్వం, చంద్రబాబు ఎలా బాధ్యులవుతారు?
సీమెన్స్ సంస్థకు సంబంధించిన ఒక డాక్యుమెంట్ ను ఇప్పుడు ప్రజలముందు ఉంచుతు న్నాం. అదిచూశాక జగన్, అతనిమంత్రులు, అతని అవినీతిమీడియా మాట్లాడాలి. టీడీపీప్ర భుత్వం సీమెన్స్ సంస్థతో చేసుకున్న ఒప్పందంలో చాలాస్పష్టంగా, సీమెన్స్ సంస్థ ఏంచే యాలో, దాని అనుబంధసంస్థ అయిన డిజైన్ టెక్ ఏంచేయాలో చాలాస్పష్టంగా పేర్కొనడం జరిగింది. సీమెన్స్ సంస్థో, డిజైన్ టెక్ వారో తప్పులుచేస్తే, వాటికి టీడీపీప్రభుత్వానికి, చంద్ర బాబుగారికి ఏంటి సంబంధం? సీమెన్స్ సంస్థతప్పుచేస్తే, ఆ సంస్థతో గతంలో ఒప్పందాలు చే సుకున్న తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ ప్రభుత్వాలుకూడా తప్పుచేసినట్టేనా? వాటి గురించి జగన్ అతని మీడియా ఎందుకు ప్రశ్నించదు? సీమెన్స్ సంస్థతో చేసుకున్న ఒప్పందానికి సంబంధించి టీడీపీప్రభుత్వంవిడుదలచేసిన నిధులు బినామీ అకౌంట్ల నుంచి తిరిగి తెలుగు దేశంనేతల అకౌంట్లలోకి బదిలీ అయ్యాయంటున్నారు. ఎవరి అకౌంట్లలోకి ఎప్పుడు బదిలీ అయ్యాయో అదికూడా చెప్పండి. బట్టకాల్చి ముఖాన వేయడంకాదు… టీడీపీనేతల ఖాతాల్లోకి నిధులు ఎలావచ్చాయో, ఎటు నుంచి వచ్చాయో, ఆనేతలు ఎవరో బయటపెట్టండి. ఇష్టానుసారం ఆరోపణలు చేస్తే జగన్, అతనిప్రభుత్వంపై న్యాయపోరాటం చేస్తాం.
రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ప్రభుత్వపాలసీలతో లబ్ధిపొందినవారు, జగన్మో హన్ రెడ్డి, అతనికుటుంబసభ్యుల అకౌంట్లలోకి, వారికి చెందిన కంపెనీలఖాతాల్లోకి డబ్బులు మళ్లించారని తాము గతంలో ఆధారాలతో సహా బయటపెట్టాము. ఇప్పటికీ దానికే కట్టుబడి ఉన్నాము. మేంచెప్పినవాటినే కేంద్రదర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీలు నిర్ధారించాయి. అలానే ఇప్పుడు స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో చంద్రబాబుకి ఎలాంటి లబ్ధికలిగిందో, ఏ టీడీపీనేత ల అకౌంట్లలోకి డబ్బులు వచ్చాయో ఆధారాలు బయటపెట్టండి. కేవలంఆరోపణలు చేయడం , బట్టకాల్చి ముఖానవేయడం జగన్ కు, అతనిప్రభుత్వానికి, అతని అవినీతిమీడియాకు అ లవాటైంది. సుమన్ బోస్, డిజైన్ టెక్ ఎండీ వికాస్ ఖన్వేల్కర్ కు మధ్యజరిగిన లావాదేవీల తో టీడీపీప్రభుత్వానికి ఏమిటి సంబంధం? సీమెన్స్ సంస్థతో టీడీపీప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలో సంతకాలు పెట్టింది సుమన్ బోస్ కాదా? సీమెన్స్ సంస్థతో 6రాష్ట్రప్రభుత్వాలు గతంలో ఒప్పందాలు చేసుకున్నాయి… ఆయాప్రభుత్వాలు కూడా అవినీతికి పాల్పడ్డాయనే జగన్ అతని మీడియాఉద్దేశమా? జగన్, వైసీపీప్రభుత్వం, సాక్షి మీడియా ఇదేవిధంగా ఇష్టానుసారం ఆరోపణలుచేస్తే న్యాయపోరాటం చేసైనా వారికి బుద్ధిచెబుతాం.
సీమెన్స్ సంస్థకు నిధులు విడుదలచేసిన ప్రేమచంద్రారెడ్డిని సీఐడీ, జగన్ ప్రభుత్వం ఎందు కు విచారించదు? తానే తప్పూచేయలేదని, చంద్రబాబే అంతాచేశాడని ప్రేమచంద్రారెడ్డి, జగన్ కు చెప్పాడా?
సీమెన్స్ సంస్థకు రూ.375కోట్లు విడుదలచేశారని గంటాసుబ్బారావుని అర్థరాత్రి అరెస్ట్ చేశా రు. అదే సుబ్బారావు గతంలో రాజశేఖర్ రెడ్డి హయాంలో జవహర్ నాలెడ్జ్ సెంటర్స్ కోసం పనిచేశారు. అతని తెలివితేటల్ని రాజశేఖర్ రెడ్డి లానే చంద్రబాబుగారు కూడా రాష్ట్రంకోసం ఉపయోగించుకున్నారు. అసలు నిధులు విడుదలచేసింది ప్రేమచంద్రారెడ్డి, అదే వ్యక్తి ఇప్పు డు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పనిచేస్తున్నారు. ఆయన్ని ఎందుకు సీఐడీ విచారించదు? ప్రేమచంద్రారెడ్డి నిధులువిడుదలచేస్తూ, చాలాస్పష్టంగా దానికి సంబంధించిన వివరాలన్నీ తెలియచేశారు. సీమెన్స్ సంస్థకు నిధులు ఇవ్వడానికిముందే, వారుఇచ్చే సాఫ్ట్ వేర్, ఇతరపరి కరాలకు సంబంధించి కేంద్రప్రభుత్వ సంస్థతో అంచనాలు రూపొందించారు. ఆ కేంద్రప్రభుత్వ సంస్థతో మొత్తం వాల్యుయేషన్ వేయించాక, నిధులు విడుదలచేయించే ముందు, మొత్తం ని ధులు ఒకేసారి ఇవ్వమని, వాల్యుయేషన్ నివేదిక వచ్చాకే ఇస్తామని, అప్పటివరకు దఫదఫాలుగా ఇస్తామని ప్రేమచంద్రారెడ్డి చాలాస్పష్టంగా తన నోట్ లో రాశారు.
ఆ నోట్ ని జగన్, అతనిమీడియా ఎందుకు బయటపెట్టదు? చంద్రబాబు చెబితేనే తానునిధులు విడుద ల చేశానని ప్రేమచంద్రారెడ్డి, జగన్మోహన్ రెడ్డి చెవిలోచెప్పాడా? సీమెన్స్ సంస్థకు నిధులు ఊరికే ఇచ్చామో లేదో నిర్ధారించాల్సింది జగన్మోహన్ రెడ్డో, సజ్జలరామకృష్ణారెడ్డో కాదు. రాష్ట్ర ఖజానాలో నిధులుపరిమితంగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి ఆదేశాలప్రకారమే సంబంధి తశాఖల అధికారులు నడుచుకుంటారని, ప్రభుత్వాన్ని నడుపుతున్న జగన్ కు తెలియదా?
సీమెన్స్ సంస్థతో గతంలో 6 రాష్ట్రప్రభుత్వాలు ఒప్పందాలు చేసుకున్నాయి.. అవన్నీ కూడా అవినీతికి పాల్పడినట్టేనా?
స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో చంద్రబాబు అవినీతిచేశాడని, సుమన్ బోస్ ను అడ్డుపెట్టుకొ నే ఇదంతా చేశాడని ఉత్తుత్తిఆరోపణలు చేయడం కాదు. సుమన్ బోస్ తో గతంలో ఒప్పందా లుచేసుకున్న 6రాష్ట్రాల ముఖ్యమంత్రులుకూడా అవినీతికి పాల్పడ్డారా? 6రాష్ట్రాల్లో సీమెన్స్ సంస్థచేయని తప్పులు, ఏపీలోనే చేసిందా? అదేనిజమైతే మీ ప్రభుత్వంలోని సీఐడీ నిగ్గు తేల్చినఅంశాల్ని ఆయా రాష్ట్రప్రభుత్వాలకు జగన్ ప్రభుత్వం పంపించవచ్చుకదా! రూ.3,300 కోట్లకు సంబంధించి సీమెన్స్ సంస్థ యువతశిక్షణకు అవసరమైన సాఫ్ట్ వేర్, వస్తువులు, ఇతరత్రా పరికరాలు శిక్షణాకేంద్రాలకు ఇచ్చిందో లేదో ఎందుకు చెప్పరు? దానికి సంబంధిం చిన పత్రాలు ఎందుకు జగన్ ప్రభుత్వం బయటపెట్టదు?
అర్జా శ్రీకాంత్ గతంలో ఇచ్చిన నివేదిక నచ్చకనే ప్రభుత్వం మరలా అతన్ని విచారణకు పిలిచిందా?
టీడీపీ పెద్దలఖాతాల్లోకి నిధులువస్తే, ఎలా వచ్చాయో, ఎటునుంచి వచ్చాయో జగన్ ప్రభుత్వం బయటపెట్టాలి. అర్జాశ్రీకాంత్ ఇదివరకే స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాల్లో యువత శిక్షణపొందిందని, అక్కడమంచి శిక్షణఇస్తున్నారని జగన్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాడు. అతను ఇచ్చిన నివేదిక నచ్చ కనే మరలా సీఐడీవిచారణకు పిలిచారు. జగన్ అతనిప్రభుత్వం దురుద్దేశాలతో వేసే కమిటీలకు అనుగుణంగానే అధికారులు కూడా తప్పుడు నివేదికలు ఇవ్వాలా? అలాఇవ్వకపోతే బ లవంతంగా కొట్టించి మీకునచ్చినట్టు రాయిస్తారా? శ్రీకాంత్ స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలలో జరుగుతున్నదాన్ని ఉన్నదిఉన్నట్టు తననివేదికలో చెప్పడమే, ఆయనచేసిన తప్పా? సీమెన్స్ సంస్థతో టీడీపీప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలో మొత్తం బాధ్యత ఆసంస్థదే. కాదు మాకేంసంబంధంలేదని చెబితే, మేంకోర్టుకు వెళతాం. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో జగన్, అతని అవినీతిమీడియా, సీఐడీ జరిగిందిఅంటున్న అవినీతి మొత్తం కట్టుకథల పునాదుల పై సృష్టించిందే. సీమెన్స్ సంస్థ తప్పుచేస్తే, దానికి చంద్రబాబుకి ఏమిటి సంబంధం? ఆసంస్థ తప్పుచేస్తే, అదే బాధ్యతవహించాలి..లేదా సంస్థ వెండార్స్ బాధ్యులవుతారు. దాన్ని వారు ఏరకంగా తేల్చుకుంటారో వారిష్టం. అంతేగానీ టీడీపీపెద్దల ఖాతాల్లోకి నిధులువచ్చాయని ఊ రికే నిరాధారఆరోపణలు చేస్తే అవినిజాలు అయిపోవు. రాజశేఖర్ రెడ్డి అధికారాన్ని అడ్డుపె ట్టుకొని జగన్ అవినీతికి పాల్పడ్డాడని తాము చెప్పినవాటిని ఆధారాలతో బయటపెట్టాము. ఆ విధంగా తాను అధికారంలోకివచ్చిన ఈ నాలుగేళ్లలో జగన్ స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో జరిగింది అంటున్న అవినీతికి సంబంధించిన ఆధారాలను ఎందుకు బయటపెట్టడు? తెలుగుదేశం పెద్దలఖాతాల్లోకి నిధులు వెళ్లాయనడం కాదు..ఎన్నినిధులు ఏఏ పెద్దల ఖాతా ల్లోకి వెళ్లాయో బయటపెట్టమని తామే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
కల్లబొల్లిమాటలు,కట్టుకథలతో లేనిదాన్ని ఉన్నట్టు నిరూపించాలని చూస్తే, దానికి తగిన మూల్యం చెల్లించుకుంటారు
వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ అవినాశ్ రెడ్డిని విచారణకు పిలవడం, అతన్ని అరెస్ట్ చే స్తారనే మాటలు వినిపిస్తుండటంతోనే ప్రభుత్వం పనిగట్టుకొని స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ అంశాన్ని తెరపైకి తెచ్చింది. దానిలో భాగంగానే అర్జాశ్రీకాంత్ ను సీఐడీ విచారణకు పిలిచింది. కట్టుకథలు, కల్లబొల్లిమాటలతో లేనిదాన్ని ఉన్నట్టు నిరూపించలేరు. అదేగానీ చేయాలను కుంటే ఈ ప్రభుత్వం, దానికి సహకరిస్తున్నఅధికారులు కూడా భవిష్యత్ లో మూల్యం చెల్లిం చుకుంటారు. ప్రభుత్వం ఈ వ్యవహారంలో ప్రేమచంద్రారెడ్డిని విచారించింది అని ఎక్కడా బయ టకు రాలేదు. అదేగానీ జరిగితే, ఆయనేంచెప్పాడో అదికూడా బయటపెట్టాలికదా! ప్రభుత్వ వేధింపులు, సీఐడీ టార్చర్ తట్టుకోలేక విచారణకు వెళ్లినవారు చంద్రబాబుపేరు చెప్పినంత మాత్రాన ఆయన తప్పుచేసినట్టా?” అని కేశవ్ స్పష్టంచేశారు.