Suryaa.co.in

Andhra Pradesh

కాపుల ద్రోహి జగన్మోహన్ రెడ్డి

– 4ఏళ్లలో జగన్, కాపులకు ఏంచేశాడో, ముఖ్యమంత్రికి ఊడిగంచేస్తున్న ఆ సామాజికవర్గ మంత్రులు, వైసీపీనేతలు చెప్పగలరా?
– కాపుల సంక్షేమం, మేలుకోసం పాటుపడిన కాపుల బంధువులు చంద్రబాబు. 4ఏళ్లలో జగన్, కాపులకు ఏంచేశాడో, ముఖ్యమంత్రికి ఊడిగంచేస్తున్న ఆ సామాజికవర్గ మంత్రులు, వైసీపీనేతలు చెప్పగలరా?
• కాపులకు ప్రభుత్వసొమ్ముఇచ్చి, వారిని ఆదుకున్న ఏకైక వ్యక్తి చంద్రబాబు ఒక్కడే
• రూ. 5వేలకోట్లతో కాపుకార్పొరేషన్, 5శాతం రిజర్వేషన్లు, కాపుయువతీయువకులకు విదేశీవిద్య, స్వయంఉపాధి రుణాలు అందించాడు
• కాపు కార్పొరేషన్ కు 10వేలకోట్లు ఇస్తానని 10రూపాయలు ఇవ్వలేదు
• 4 ఏళ్లలో జగన్ కాపులకు ఇదిగో ఈ మంచి చేశాడని, పదవులు, పరపతికోసం జగన్ కు ఊడిగంచేస్తున్న వైసీపీకాపునేతలు, ప్రభుత్వంలోని కాపుమంత్రులు చెప్పగలరా?
• మంత్రులు అంబటి, కొట్టుసత్యనారాయణ, బొత్స, దాడిశెట్టిరాజా, అమర్నాథ్, మాజీ మంత్రి పేర్నినాని ఎవరైనా సరే జగన్ కాపులకు చేసింది ఇది అని ఆధారాలతో నిరూపించగలరా?
• సుప్రీంకోర్టు చెప్పినా, సిట్ లు వేసినా టీడీపీ, ఆపార్టీనేతలు, చంద్రబాబు తప్పుచేశారని నిరూపించడం జగన్ తరంకాదు
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు

పదవులు, పరపతికోసం జగన్మోహన్ రెడ్డికి ఊడిగంచేస్తున్న అధికారపార్టీకాపునేతలు, ఆ వర్గం మంత్రులు ఎవరైనా ఈ నాలుగేళ్లలో వైసీపీప్రభుత్వం కాపులసంక్షేమం, మేలుకోసం ఏం చేసిందో చెప్పాలని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు . ఆ వివరాలు ఆయన మాటల్లోనే…

వైసీపీకాపునేతలు, ప్రభుత్వం లోని కాపుమంత్రులు పదవులు, పరపతికోసం కాపుల ఆత్మ గౌరవాన్ని, పౌరుషాన్ని జగన్మోహన్ రెడ్డికి తాకట్టుపెట్టారు
“మంత్రులు అంబటి రాంబాబు, కొట్టుసత్యనారాయణ, బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, దాడిశెట్టి రాజా, మాజీమంత్రి పేర్నినాని ఎవరైనా సరే మా జగన్మోహన్ రెడ్డి కాపుల కోసం ఇదిగో ఇదిచేశాడని చెప్పగలరా? మీరంతా పదవులకోసం కాపుల ఆత్మగౌర వాన్ని, పౌరుషాన్ని జగన్మోహన్ రెడ్డికి తాకట్టుపెట్టి, ఆయనవద్ద పాలేర్లలా పాలెగాళ్లలా పని చేస్తున్నారు. అలాంటి మీరు కాపులకుఏమీ చేయలేదని చంద్రబాబుని అనడం సిగ్గుచేటు. 2014లో చంద్రబాబునాయుడు కాపుకార్పొరేషన్ ఏర్పాటుచేయబట్టే, స్వాతంత్ర్యం వచ్చాక తొలిసారి కాపులకు ప్రభుత్వంనుంచి ఒకరూపాయిరావడం జరిగింది. అది నిజంకాదని వైసీపీ లోని కాపునేతలు, మంత్రులు చెప్పగలరా? ఈరోజు కొన్నివేలమంది కాపు యువతీయువకు లు విదేశాల్లో చదువుతున్నారంటే దానికి కారణంచంద్రబాబు కాపులకోసం అమలుచేసిన విదేశీవిద్యపథకం కాదా అని ప్రశ్నిస్తున్నాం. తెలుగుదేశంప్రభుత్వం కాపుకార్పొరేషన్ ద్వారా వేలకోట్లుకాపు వర్గ అభివృద్ధికోసం వెచ్చించింది. కాపుల్లోని నిరుద్యోగయువతకు స్వయం ఉపాధిరుణాలు అందించిన ఏకైక నాయకుడు చంద్రబాబు ఒక్కడే. కాపుయువతకు కార్లు అం దించాడు. ఇన్నిచేసిన చంద్రబాబుని పట్టుకొని కాపులకు ఆయనేం చేయలేదు అంటున్న అధికారపార్టీలోని కాపునేతలు నిజంగా సిగ్గుతో తలదించుకోవాలి.

ముఖ్యమంత్రి అయిన వెంటనే కాపుకార్పొరేషన్ కు రూ.10వేలకోట్లు ఇస్తానన్న జగన్, 4ఏళ్లలో పదిరూపాయలు కూడా ఇవ్వలేదు
తాను అధికారంలోకి వచ్చిన వెంటనే, చంద్రబాబునాయుడి కంటే మిన్నగా కాపుకార్పొరేషన్ కు రూ.10,000కోట్లు ఇస్తాను అన్న జగన్మోహన్ రెడ్డి ఈనాలుగేళ్లలో కనీసం 10రూపాయలు కూడా ఇవ్వలేదు. ఇది వాస్తవమోకాదో వైసీపీలోని కాపునేతలు, కాపుమంత్రులకు తెలియ దా? ఏరుదాటాక తెప్పతగలేసినట్టు, కాపులఓట్లు వేయించుకొని ముఖ్యమంత్రి అయిన జగ న్మోహన్ రెడ్డి, వారిని నట్టేటముంచాడు. కాపులద్రోహిగా మిగిలిన జగన్మోహన్ రెడ్డి మెప్పుకో సం సొంతకులాన్ని అపహాస్యంచేస్తూ, కించపరుస్తూ మాట్లాడవద్దని అంబటిరాంబాబు, కొట్టు సత్యనారాయణ, బొత్స సత్యనారాయణ, దాదిశెట్టి రాజా, మాజీమంత్రి పేర్నినాని ఇతర నేత లకు హితవుపలుకుతున్నాను. మీకు, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి కాపులకు మేలు, మంచిచేయడం ఎలాగూచేతకాదు. కనీసం కాపులకు మంచిచేసిన చంద్రబాబుని మాటలన డం అయినా మానుకోండి.

చంద్రబాబు తీసుకొచ్చిన కాపుకార్పొరేషన్ ను ఎందుకు నిర్వర్యం చేశాడో జగన్ కాపులకు సమాధానం చెప్పాలి
చంద్రబాబునాయుడు కాపులకు అమలుచేసిన 5శాతంరిజర్వేషన్లను తొలగించింది జగన్మో హన్ రెడ్డి కాదా? కాపులసంక్షేమం కోసం చంద్రబాబు ఏర్పాటుచేసిన కాపుకార్పొరేషన్ ను నిర్వీర్యంచేసింది ఈ జగన్మోహన్ రెడ్డికాదా? కాపువర్గంలోని మహిళలకు ఏదోఇస్తున్నట్టు జగన్ చెబుతున్నాడు. రాష్ట్రంలో కోటిమంది కాపులుంటే, వారిలో 50లక్షలమంది మహిళలు ఉంటే, కేవలం 2.50లక్షలమందికి కాపునేస్తం కింద అరకొరసాయం చేసి, అదే పెద్దగొప్ప అయినట్టు డబ్బాలుకొడుతున్నారు. కేవలం 2.50లక్షలమంది కాపుమహిళలకు ఆర్థికసా యం చేస్తే మిగిలిన 47లక్షలమంది ఏమైపోయారని ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నాం. చంద్రబాబుపాలన కాపులకు నిజంగా స్వర్ణయుగం. కాపుజాతికి తీరని ద్రోహంచేసిన కాపు ద్రోహి జగన్మోహన్ రెడ్డి , అతనికి వంతపాడుతున్న వైసీపీకాపువర్గం నేతలు, మంత్రులు భవి ష్యత్ లో సొంతవారిచేతిలోనే చావుదెబ్బలు తినడం ఖాయమని హెచ్చరిస్తున్నాం.

కాపుల రిజర్వేషన్లు రద్దు చేసి, కాపుల్ని అణగదొక్కుతూ, కాపుజాతిపై పగసాధిస్తున్నాడు
2004-2009 మేనిఫెస్టోలో కాపుల్ని ఆదుకుంటానని చెప్పిన వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి మోసగిం చాడు. 2019 లో కొడుకు అధికారంలోకి వచ్చాక కాపుకార్పొరేషన్ తీసేశాడు, చంద్రబాబు కాపువర్గానికి అమలుచేసిన 5శాతం రిజర్వేషన్లు తొలగించాడు. కాపులకు టీడీపీప్రభుత్వం, చంద్రబాబు అమలుచేసిన విదేశీవిద్య, స్వయంఉపాధి రుణాలు, ఇతరత్రా పథకాలు అన్నిం టినీ జగన్మోహన్ రెడ్డి రద్దుచేసి, కాపుజాతిపై పగసాధిస్తున్నాడు. ఆనాడు చిరంజీవిగారిపై వైసీపీమూకలు తిరుపతిలో దాడికి తెగబడితే, జగన్మోహన్ రెడ్డి కనీసం మాటమాత్రంగా కూడా ఘటనను ఖండించలేదు. విశాఖపట్నంలో పవన్ కల్యాణ్ గారిపై వైసీపీగూండాలు దాడికియత్నిస్తే, దానిపై ప్రభుత్వం స్పందించలేదు. వైసీపీ పేటీఎం కుక్కలతో నోటికొచ్చినట్టు పవన్ కల్యాణ్ ని, కాపుల్ని తిట్టిస్తున్నారు. వైసీపీ అధికారం లోకి వచ్చాక కాపులకు చేసింది శూన్యమని చిన్నపిల్లాడిని అడిగినా చెబుతాడు. అందరికీ ఇచ్చే బియ్యాన్ని కూడా కాపులకు మాత్రమే ప్రత్యేకంగా ఇచ్చినట్టు ప్రచారం చేయడం నిజంగా జగన్మోహన్ రెడ్డి దౌర్భాగ్యమనేచెప్పాలి. కాపులకు తీరని అన్యాయంచేసిన జగ న్ కు ఆ సామాజికవర్గంలోని కాపునేతలు, మంత్రులు భజనచేయడం నిజంగా చాలాచాలా బాధాకరం.

 జగన్మోహన్ రెడ్డి సిట్ లు వేసినా టీడీపీ, ఆ పార్టీ నేతలు, తప్పు చేశారని నిరూపించలేడు
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు, చంద్రబాబు రూ.5లక్షలకోట్లు దోచేశాడని, ఎంపరర్ ఆఫ్ కరప్షన్ అని తప్పుడురాతలతో పుస్తకాలు ముద్రించి, పిచ్చికూతలుకూసి, విషప్రచారంచేసి, ఎలాగోలా ప్రజల్ని నమ్మించి ముఖ్యమంత్రి అయ్యాడు. అధికారంలోకి వచ్చి 4ఏళ్లుఅయ్యాక కూడా చంద్రబాబుపై గతంలో చేసిన ఆరోపణలకుసమాధానం చెప్పకుండా, నిజానిజాలు నిగ్గుతేల్చకుండా జగన్మోహన్ రెడ్డి ఏంపీకాడని ప్రశ్నిస్తున్నా. ముఖ్యమంత్రి హో దాలో తనపార్టీవారితో జగన్ జరిపిన తొలిసమావేశంలో చంద్రబాబు, ఆయనప్రభుత్వం చేసిన అవినీతిని బయటపెట్టాలని, అలా చేసేవారిని సన్మానిస్తానని చెప్పాడు. అన్ని ప్రగల్భాలు పలి కిన జగన్ ఈ నాలుగేళ్లలో టీడీపీప్రభుత్వం ఏపథకంలో అయినా, ఏకాంట్రాక్ట్ లో అయినా, ఏ టీడీపీ నాయకుడు అయినా రూపాయి అవినీతిచేసినట్టు నిరూపించగలిగాడా? నిజంగా టీడీ పీప్రభుత్వం తప్పుచేసిఉంటే, ముఖ్యమంత్రి చేస్తానన్న సన్మానాలకోసమైనా ఆధారాలు బయటపెట్టేవారు. ఎక్కడాతప్పుజరగలేదు.. టీడీపీప్రభుత్వంగానీ, ఆపార్టీనేతలు గానీ ఆవ గింజంత అయినా తప్పుచేయలేదు కాబట్టే, జగన్, అతని ప్రభుత్వం నిరూపించలేకపోయింది . జగన్ సిట్ వేసినా, మరోటి వేసినా, టీడీపీని ఏంచేయలేడు. కేవలం ఎన్నికల్లో లబ్ధికోసమే జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీపై, చంద్రబాబుపై దుష్ప్రచారంచేశాడు. ఆనాడు జగన్ చెప్పినవన్నీ అబద్ధాలు అని ప్రజలకు కూడా అర్థమైంది. సుప్రీంకోర్టు చెప్పినా, జగన్మోహన్ రెడ్డి సిట్ లు వేసినా, మరోకమిటీ వేసినా తెలుగుదేశానికి, ఆపార్టీనేతలకు వచ్చిన ఇబ్బందే మీ లేదు. హైకోర్టు స్టేను సుప్రీంకోర్టులో వెకేట్ చేస్తే, దానికి అనుగుణంగా జగన్మోహన్ రెడ్డిని ముందుకెళ్లమనండి. ఏమవుతుంది?

4ఏళ్లుగా ఏంచేశాడు. జగన్ కు ఉన్న అవలక్షణాలు, అవినీతి, దోపిడీని ఇతరులకు అంటగట్టాలని చూస్తే ఎలా? తాను 16నెలలు జైల్లోఉన్నాడని, అందరూ జైలుకెళ్లాలని, పంపించాలని తహతహలాడుతున్నాడు. 4ఏళ్లనుంచి ప్రజల్ని, పరి పాలనని వదిలేసి, నిత్యం టీడీపీపై బురదజల్లడం, ఆపార్టీనేతల్ని వేధించడమే లక్ష్యంగా పని చేశాడు. చివరకు ఏంసాధించాడు? ఆఖరికి ఏమీలేక టీడీపీనేతలు చేసుకునే వ్యాపారాలపై కక్షకట్టాడు. వారికి చెందిన వ్యాపారకార్యకలాపాలపై నిఘాపెట్టి, బొక్కలు వెతికేపనిలో పడ్డాడు. చంద్రబాబు, టీడీపీ నేతలు, తప్పుచేయలేదుకాబట్టేధైర్యంగా జనంలో తిరుగుతున్నారు. తెలుగుదేశంపార్టీ, టీడీపీనేతలు, టీడీపీ ప్రభుత్వంగానీ ఏరోజూ ఎక్కడా ఏతప్పుచేయలేదు. కాబట్టే మేం ధైర్యంగా, నిర్భయంగా ప్రజల్లో తిరుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డిమాదిరి ఢిల్లీవెళ్లి కాళ్లుపట్టుకోవడం, బాబాయ్ ని చంపినతమ్ముడిని కాపాడుకోవడం, తనకేసులమాఫీకోసం లాబీయిస్ట్ లతో పైరవీలుచేయించడం లాంటివి చేయడంలేదు.” అని బొండా ఉమా తేల్చిచెప్పారు.

LEAVE A RESPONSE