-అక్రమంగా ఫామ్ నెం.7 తో ఓట్ల ను తొలగిస్తున్నారు
-టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా
విజయవాడ : రాష్ట్రం లో అధికారం లో ఉన్న వైసీపీ కి ఓటమి భయం పట్టుకుంది. అక్రమంగా వైసీపీ గెలవాలని ప్రయత్నాలు చేస్తుంది. వైసీపీ చేర్చిన దొంగ ఓట్ల ను ఇప్పటికే అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళాము. టీడీపీ బృందం అధ్వర్యంలో అరుగురు సభ్యులు ఢిల్లీ లో ప్రధాన ఎన్నికల కమిషనర్ కి ఫిర్యాదు చేశాం. దొంగ ఓట్ల ద్వారా జగన్ మోహన్ రెడ్డి గెలవాలని అనుకుంటున్నారు.
ప్రజల డేటా ను వాలంటీర్ వ్యవస్థ ద్వారా సేకరించి టీడీపీ సానుభూతి పరుల ఓట్ల ను తొలగిస్తున్నారు. అక్రమంగా ఫామ్ నెం.7 తో ఓట్ల ను తొలగిస్తున్నారు. ఇలా చేసినందుకు సెంట్రల్ నియజకవర్గ లో ఒక BLO ను సస్పెండ్ చేశారు . 4 గురు BLO లకు మెమో లు జారీ చేశారు. ఈ నెల 10 లోపు రాష్ట్రానికి వస్తామని కేంద్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం నుండి అధికారులు వస్తున్నారని సమాచారం అందింది. ప్రజలకు తమ ఓటు ను తాము కాపాడుకోవాలి. ప్రజలు చైతన్యం కలిగి ఉండాలి. మీ ఓటు ఉందో లేదో మీరే సరి చూసుకోవాలి. ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ప్రతినొక్కరు డౌన్ లోడ్ చేసుకోవాలి.
257 పోలింగ్ స్టేష్లలో చనిపోయిన వారి ఓట్లు 8000 వేలు ఉన్నాయి. కేంద్ర ఎన్నికల అధికారి దృష్టికి తీసుకుని ఈ విషయాన్ని తీసుకుని వెళ్లాము.ఇప్పటికే చనిపోయిన వారి ఓట్లు తొలగించాలని ఎన్నికల అధికారులు ఆదేశాలు ఇచ్చారు. చాలా చోట్ల ఒక పేరు మీద రెండు ఓట్లు ఉన్నాయి. ఇలా ఉన్న ఓట్లు 8000 వరకు ఉన్నాయి. డిసెంబర్ 2,3 తేదీల్లో సెంట్రల్ నియోజకవర్గం లో 77 పోలింగ్ కేంద్రాల్లో BLO, సూపర్ వైజర్ అందరూ అందుబాటులో ఉంటారు.
ఓట్ల నమోదు , మార్పులు ఉన్న వారు నమోదు చేసుకోవాలి. ఓటర్లు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఓటు మనకి రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ప్రతి ఒక్కరూ తమ ఓట్ల ను కాపాడుకోవాలి. కర్ణాటక ఫలితాలే మళ్ళీ తెలంగాణ లో కూడా వచ్చేలా ఉన్నాయి. పది ఏళ్లుగా ఉన్న ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు తెలంగాణ ప్రజలు సిద్దం గా ఉన్నారు. ఇదే ఆంధ్రప్రదేశ్ లో కూడా రిపీట్ అవ్వడం ఖాయం. వైసిపి నీ ఇంటికి పంపటం ఖాయం.
ఈ కార్యక్రమంలో టిడిపి అధికార ప్రతినిధి నవనీతం సాంబశివరావు , TNTUC అర్బన్ అధ్యక్షుడు గరిమెళ్ళ చిన్నా , రాష్ట్ర తెలుగు యువత మీడియా కోఆర్డినేటర్ పరుచూరి శివ భార్గవ్ పాల్గొన్నారు .