స్వాతంత్య్రోద్యమ నేత, సంస్కరణవాది బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులర్పించారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన జయంతి కార్యక్రమంలో సీఎం వైయస్ జగన్ బాబూ జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. కార్యక్రమంలో సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్, చీఫ్ సెక్రటరీ డాక్టర్ కేఎస్. జవహర్ రెడ్డి, సీఎంవో అధికారులు పాల్గొన్నారు.