Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి ఎన్నికల్లో లబ్ధి పొందడానికే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల జపం

• మంత్రులు చేస్తున్నది సామాజిక సాధికార బస్సుయాత్ర కాదు..అబద్ధాలు, అసత్యాల యాత్ర. వైసీపీ బస్సుయాత్ర, బుస్సుయాత్రగా మారింది
• ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు ఉండే ప్రాంతాలకు సామాజిక సాధికార బస్సుల్ని తీసుకెళ్లి, ఆయా వర్గాలవారికి సమాధానం చెప్పే ధైర్యం మంత్రులు, వైసీపీనేతలకు ఉందా?
• జగన్ రెడ్డి నాలుగున్నరేళ్లలో దళితజాతికి చేసిన మోసం వంచనకు, వారిని అన్యాయంగా బలితీసుకున్నందుకు ఆగ్రహంతో ఉన్న దళితుల్ని ఎదుర్కొనే ధైర్యం మంత్రులకు ఉందా?
• సామాజిక సాధికార బస్సుల్లో మంత్రులు, వైసీపీ నేతలు దళితవాడలకు వెళ్తే దళితులు వారి వెంటపడి మరీ తరిమితరిమి కొడతారు: వర్ల రామయ్య

• జగన్ ప్రారంభించిన బస్సుయాత్ర బుస్సుయాత్రగా మారింది
• సామాజిక సాధికార బస్సయాత్రకు దళిత, బీసీ, మైనారిటీ వర్గాల స్పందన కరువై, మంత్రుల ముఖాలు వెలవెలబోతున్నాయి
• ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బీసీలకు సమాధికట్టిన జగన్మోహన్ రెడ్డిని ఇంకా బడుగు బలహీనవర్గాలు నమ్మాలా?
• పార్టీలు, కులమతాలకు బీసీల్లో చైతన్యం తీసుకొచ్చి, వచ్చేఎన్నికల్లో జగన్ రెడ్డికి బీసీల దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపిస్తాం – కొల్లు రవీంద్ర

• అంజాద్ బాషా లాంటి పాలెగాడిని పక్కన పెట్టుకొని ముస్లింలను ఉద్ధరిస్తున్నాను అని జగన్ చెబితే మైనారిటీలు నమ్మేస్థితిలో లేరు.
• మైనారిటీల సంక్షేమానికి వెచ్చించాల్సి న రూ.5,400 కోట్ల సబ్ ప్లాన్ నిధుల్ని ఎందుకు దారిమళ్లించాడో జగన్ మైనారిటీలకు సమాధానం చెప్పాలి.
• వక్ఫ్ భూముల్ని దిగమింగుతున్న వైసీపీనేతలపై జగన్ ఎందుకు చర్యలు తీసుకోడు?
• చంద్రబాబు హాయాంలో హజ్ యాత్రకు, మసీదులు, షాదీఖానాలు, ఖబరిస్తాల నిర్మాణానికి అందిన ఆర్థిక సహాయం నేడు ఎందుకు అందడంలేదో జగన్ చెప్పాలి.
• ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తానన్న హామీ నాలుగున్నరేళ్లలో జగన్ ఎందుకు నెరవేర్చలేదు?: -నసీర్ అహ్మద్

• గిరిజన యువతపై తప్పుడు కేసులు.. గిరిజన మహిళలపై దాడులు, అత్యాచారాలు… గిరిజన సంపద దోపడీ తప్ప జగన్ రెడ్డి గిరిజనులకు చేసింది శూన్యం
• రాష్ట్రంలోజరుగుతున్నది సామాజిక సాధికార బస్సుయాత్ర కాదు… అవినీతిపరులు దగాకోరుల అబద్ధాల అసత్యాల యాత్ర.
• గిరిజనులకు గతప్రభుత్వం అమలుచేసిన 16 పథకాలు జగన్ రద్దుచేశాడు.
• ఎన్నికలకు ముందు గిరిజనులకు ఉచిత విద్యుత్ ఇస్తానన్న హామీ జగన్ అమలుచేయడం లేదు: ధారు నాయక్

పేదల గొంతుకోస్తున్న నిజమైన పెత్తందారు జగన్ రెడ్డి, అతని ప్రభుత్వం సామాజిక సాధికార బస్సుయాత్ర చేపట్టడం మరోసారి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు నయవం చన చేయడమేనని, తనను ఏ వర్గం పట్టించుకోవడం లేదని తెలిసే జగన్మోహన్ రెడ్డి బస్సుయాత్ర ప్రారంభించాడని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో సోమవారం ఆయన టీడీపీ నేతలు కొల్లు రవీంద్ర, నసీర్ అహ్మద్, ధారునాయక్ లతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు వారి మాటల్లోనే…

నిజంగా మంత్రులు, వైసీపీనేతలకు దమ్ము, ధైర్యముంటే బస్సుల్ని దళితవాడల్లోకి తీసుకెళ్లి, దళితులు అడిగే ప్రశ్నలకు సమాధానంచెప్పాలి : వర్ల రామయ్య
“ రాష్ట్రంలోగానీ, వైసీపీలో గానీ, ప్రభుత్వంలో గానీ ఎక్కడా మచ్చుకైనా సామాజిక న్యాయం ఉందా? ప్రభుత్వం తరుపున సామాజిక సాధికార బస్సుయాత్ర చేస్తున్న మంత్రులు, వైసీపీనేతలను ఒక్కటే ప్రశ్నిస్తున్నాం. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు ఉండే ప్రాంతాల్లో సామాజిక సాధికార యాత్ర బస్సుల్ని నిలిపే ధైర్యం ఉందా అని మంత్రులు, వైసీపీనేతల్ని ప్రశ్నిస్తున్నాం.

ప్రభుత్వం తలపెట్టిన బస్సు యాత్రను తూతూమంత్రంగా నిర్వహిస్తున్న మంత్రులు. బస్సుల్ని ఎక్కడో పెట్టి, డ్వాక్రా మహిళలు, అంగన్ వాడీ సిబ్బంది, వాలంటీర్ల సాయంతో ప్రజల్ని బస్సులున్న చోటికి తరలించి, యాత్రను మమ అనిపిస్తోంది. ఎస్సీలకు ఇది చేశాననే నమ్మకం, ధైర్యం జగన్ రెడ్డికి ఉంటే, ఆ వర్గం నివసించే ప్రాంతంలో సామాజికసాధికార బస్సుల్ని నిలపా లి. అలానే బీసీలు, మైనారిటీలు నివసించే చోట బస్సుల్ని నిలిపి, అక్కడే మంత్రులు, వైసీపీనేతలు మాట్లాడాలి. అలా మాట్లాడే ధైర్యం వారికి ఉందా అని ప్రశ్నిస్తున్నాం.

మంత్రులకు ధైర్యముంటే దళితవాడల్లోకి సామాజికసాధికార బస్సుల్ని తీసుకెళ్లి, అక్కడ దళితులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి
నిజంగా మంత్రులు, వైసీపీనేతలు దళితవాడల్లోకి, పల్లెల్లోకి బస్సులు తీసుకెళితే, అక్కడి దళితులు వారిని తరిమి తరిమి కొడతారు. చంద్రబాబు మాకోసం అమలుచేసి న 27 సంక్షేమపథకాల్ని జగన్ రెడ్డి ఎందుకు రద్దుచేశాడో సమాధానం చెప్పండి అంటూ వెంటపడి మరీ మంత్రుల్ని, వారి బస్సుల్ని తరిమి కొడతారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు రూ.1,14,000కోట్లు మీరు, మీ ముఖ్యమంత్రి ఎందుకు దారిమళ్లించారో చెప్పండి అంటూ దళితులు మంత్రుల్ని నిలదీస్తారు.

ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములు 14 లక్షల ఎకరాలు ఎందుకు కాజేశారని ఆయా వర్గాలవారు మంత్రుల్ని ప్రశ్నిస్తారు. నాలుగున్నరేళ్లలో ఎందరో దళితయువకులు, దళిత ఆడబిడ్డల్ని ఎందుకు అన్యాయం గా పొట్టనపెట్టుకున్నారో చెప్పాలంటూ ఆగ్రహంతో మంత్రులకు ఎదురు తిరుగుతారు. ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని తెలిసే మంత్రులు దళిత వాడల్లోకి వెళ్లకుండా, వెళ్లినా బస్సులు దిగకుండా సామాజికసాధికార బస్సుయాత్రను మొక్కుబడిగా నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు.

దళిత యువకుల్ని చంపడం.. శిరోముండనాలు చేయడం..దళిత మహిళల్ని హత్యాచారాలతో బలి తీసుకోవడమే జగన్ రెడ్డి దళితసమాజానికి చేసిన మంచి అని మంత్రులు దళితవాడల్లోకి వెళ్లి చెప్పగలరా?
డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ పేరు తొలగించి, విదేశీవిద్య పథకానికి జగన్ పేరు పెడతారా? ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు పొందిన అంబేద్కర్ ఎక్కడ.. ప్రపంచంలోనే గొప్ప అవినీతిపరుడిగా పేరుపొందిన జగన్ ఎక్కడ? విదేశీవిద్య పథకం ద్వారా నాలుగున్న రేళ్లలో జగన్ రెడ్డి ఎంతమంది దళిత, బీసీ, మైనారిటీ యువకుల్ని విదేశాలకు పంపా డో మంత్రులు చెప్పాలి. చంద్రబాబునాయుడు వేలసంఖ్యలో ఇన్నోవాకార్లు ఇచ్చి, ఎందరో దళితబిడ్డలు తమ కాళ్లపై తాము నిలబడేలా ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేశారు. నాలుగేళ్లలో జగన్ రెడ్డి ఒక్క ఎస్సీ యువకుడికైనా రూపాయి స్వయం ఉపాధి రుణం ఇచ్చారా?

ఇచ్చాడని మంత్రులు బస్సుయాత్రలో నిరూపించగలరా? చంద్రబా బు దళిత బిడ్డలకు కార్పొరేట్ విద్యను అందించడం కోసం బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు తీసుకొస్తే వాటిని జగన్ రద్దు చేశాడు. స్కూళ్ల రద్దుపై సుప్రీంకోర్టు ఈ ప్రభుత్వానికి చీవాట్లు పెట్టి, బుద్ధిలేదా అని ప్రశ్నించింది. ఇదేనా జగన్ రెడ్డి దళితులకు చేసిన మేలు ?

దళితయువకుడు సుబ్రహ్మణ్యాన్ని దారుణంగా చంపేసి, అతని శవాన్ని అతని ఇంటివద్దే పడేసిన తన పార్టీ ఎమ్మెల్సీని పక్కనే కూర్చోబెట్టుకుంటున్న ముఖ్యమంత్రి సిగ్గులేకుండా దళితబిడ్డలకు తాను మేనమామని ఎలా చెబుతాడు? దళితుల్ని చంపు తూ.. చంపిస్తూ..వారిపై తప్పుడు కేసులు పెడుతూ.. మేనమామనంటే సరిపోతుందా ? అందుకే మంత్రులు..వైసీపీ ఎమ్మెల్యేలకు ఛాలెంజ్ చేస్తున్నాం.. బస్సుల్ని దళిత పల్లెల్లో నిలబెట్టి జగన్ రెడ్డి చేసిన ఘనకార్యాలు ఇవి అని చెప్పగల ధైర్యం వారికి ఉందా?

డాక్టర్ సుధాకర్ని, కిరణ్ కుమార్.. విక్రమ్.. ఓంప్రతాప్ వంటి దళితబిడ్డల్ని తమ నాయకుడే చంపించాడని మంత్రులు దళితవాడల్లోకి వెళ్లి చెప్పగలరా? వరప్రసాద్ అనే దళితయువకుడు తమ ఇసుకమాఫియాపై ప్రశ్నించాడని అతనికి శిరోముండనం చేయించామని ధైర్యంగా మంత్రులు చెప్పగలరా? జగన్ రెడ్డి ముఖ్య మంత్రి అయ్యాక ఒక్క బ్యాక్ లాగ్ పోస్ట్ అయినా భర్తీ చేశాడా?

తన నియోజకవర్గంలో దళితమహిళ నాగమ్మ దారుణంగా అత్యాచారం కావింపబడి, హత్యకు గురైతే ఆమె కుటుంబాన్ని కూడా పరామర్శించని ముఖ్యమంత్రి దళితులకు మేనమామా? వెటర్న రీ వైద్యులు అచ్చెన్నను అన్యాయంగా బలితీసుకున్న జగన్ రెడ్డి, పల్లెల్లోకి వెళ్లి తాను దళితుల్ని అచ్చెన్న మరణం ద్వారా తాను దళితుల్ని ఉద్ధరించానని చెప్పగలడా?” అని రామయ్య నిలదీశారు.

తన, తన ప్రభుత్వ అవినీతి దుర్మార్గాలను ప్రశ్నించిన బీసీలకు సమాధి కట్టానని చెప్పగల ధైర్యం ముఖ్యమంత్రికి ఉందా? జగన్ ప్రారంభించిన బస్సుయాత్ర, బుస్సుయాత్రగా మారింది : కొల్లు రవీంద్ర
“జగన్ రెడ్డి తలపెట్టిన సామాజిక సాధికార బస్సుయాత్రకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల స్పందన కరువైంది. మంత్రులు చేస్తున్న బస్సుయాత్ర బుస్సుయాత్రగా మారిం దనేది పచ్చినిజం. ఎన్నికలు సమీపిస్తున్నందునే జగన్ కు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారి టీలు గుర్తుకు వచ్చారు. నాలుగున్నరేళ్లుగా ఆయా వర్గాలను దారుణంగా వంచించి, వారిని అన్యాయంగా బలితీసుకున్న జగన్ రెడ్డి.. నేడు గొంతుచించుకొని ఎంతగా నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని అరిచినా ఎలాంటి ఉపయోగం ఉండదు.

తాను ఈ నాలుగున్నరేళ్ల పాలనలో ఎస్సీలకు ఇన్నివేలకోట్ల స్వయం ఉపాధి రుణా లిచ్చి.. ఇంతమందిని ఆదుకున్నానని ముఖ్యమంత్రి వారి ముందుకొచ్చి చెప్పగ లడా? అలానే ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతకు ఇన్నిలక్షలకోట్ల స్వయం ఉపాధి రుణా లిచ్చి, ఇంతమందికి మంచి భవిష్యత్ కల్పించానని చెప్పగలడా? బీసీ సబ్ ప్లాన్ నిధులు రూ.75 వేలకోట్లు ఎగ్గొట్టి, బడుగు బలహీన వర్గాలకు తీరని ద్రోహం చేశానని చెప్పగల ధైర్యం ముఖ్యమంత్రికి ఉందా?

బీసీల రిజర్వేషన్లలో 10శాతం కోతపెట్టానని, దానివల్ల 16,800 పదవులు బీసీలకు దక్కుకుండా పోయాయని ధైర్యంగా చెప్పగల ధైర్యం ముఖ్యమంత్రికి ఉందా? 56 బీసీ కార్పొరేషన్లు పెట్టానంటున్న ముఖ్యమంత్రి, వాటిద్వారా ఎంతమంది బీసీ యువతకు ఎలాంటి సాయం చేశాడో చెప్పగలరా? కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లుగా చలామణీ అవుతున్నవారంతా గుండెలపై చెయ్యేసుకొ ని, ఈప్రభుత్వం ద్వారా తమవర్గాలకు ఇదిగి ఈ మేలు చేశామని చెప్పగలరా? రాజ్యాంగపరంగా, న్యాయంగా బీసీలకు దక్కాల్సిన పదవులు దక్కకుండా చేసి, నామమాత్రంగా పనికిరాని పదవులు ఇచ్చి నేను పదవులిచ్చానని జగన్ గొప్పులు చెప్పుకుంటున్నాడు.

సర్పంచ్ లు, ఎంపీపీలు, జడ్పీటీసీలుగా ఉన్న బీసీలకు నిధులు అందించకుండా, వారిని రాష్ట్రం విడిచిపోయేలా చేసింది జగన్ రెడ్డి కాదా? రాష్ట్రాన్ని తన వర్గానికి చెందిన సామంతరాజులకు అప్పగించిన జగన్ రెడ్డి, ప్రశ్నించే దళితులు, బీసీలు మైనారిటీలపై తప్పుడుకేసులు పెట్టి వేధించడం.. వారిని చంపేయడమేనా వారికి చేసిన సామాజిక న్యాయం? మొన్నటికి మొన్న పుంగనూరులో బీసీలపై దాడిచేసి వారి బట్టలిప్పించి వారిని భయపెట్టారు.

బీసీలపై అంతటి దారుణానికి ఒడిగట్టిన తనపార్టీ వారిపై ముఖ్యమంత్రి ఏంచర్యలు తీసుకున్నారు? కావలిలో ఆర్టీసీ డ్రైవర్ పై వైసీపీ గూండాలు దాడిచేస్తే ఆర్టీసీ అధికారులు, రవాణాశాఖమంత్రి, ముఖ్య మంత్రి ఎందుకు స్పందించలేదు? డ్రైవర్ ను పరామర్శించడానికి వెళ్తున్న తనను, టీడీపీనేతల్ని ఎందుకు అడ్డుకున్నారు?

ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బీసీలకు సమాధికట్టిన జగన్మోహన్ రెడ్డిని ఇంకా బీసీలు నమ్మాలా?
కొన్ని వేలమంది బీసీలపై అక్రమ కేసులు పెట్టించి, వారిని పోలీసులతో వైసీపీవారితో చావగొట్టించి, ఇంకా దారికి రాని వారిని అన్యాయంగా బలితీసుకున్న జగన్ రెడ్డి ఏ ముఖం పెట్టుకొని బీసీలను ఉద్ధరించానంటున్నాడు? 60కి పైగా బీసీనేతలను కిరాతకంగా చంపడమే గాక, వారి ఆస్తులు, భూములు వైసీపీ ప్రభుత్వం కొల్లగొట్టింది నిజం కాదా? గతంలో టీడీపీ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన దాదాపు 8వేల ఎకరాలను వారిని భయపెట్టి లాక్కున్నది నిజం కాదా?

బీసీ విద్యార్థులకు, యువతకు సంబంధించిన విద్యాసంస్థల్ని జగన్ రెడ్డి మూసేయించింది కాదా? బీసీయువతకు స్కాలర్ షిప్పులు నిలిపేసి, వారిని ఉన్నతవిద్యకు దూరంచేసింది నిజంకాదా? బీసీ యువతకు తమప్రభుత్వం ఫీజురీయింబర్స్ మెంట్ నిలిపేసిందని చెప్పగల ధైర్యం బీసీ మంత్రులు..ముఖ్యమంత్రికి ఉందా? ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బీసీలకు సమాధికట్టిన జగన్మోహన్ రెడ్డిని ఇంకా బీసీలు నమ్మాలా? తన సోదరిని ఏడిపిస్తున్న వారిని ప్రశ్నించినపాపానికి బీసీ బాలుడిని దారుణంగా తగలబెట్టి చంపిన వైసీపీ కార్యకర్తలపై ముఖ్యమంత్రి ఎందుకు చర్యలు తీసుకోలేదు?

కల్తీ మద్యం అమ్ముతూ, వేలాది కుటుంబాలను రోడ్డునపడేసిన ముఖ్యమంత్రి, గంజాయి మాదకద్రవ్యాల వ్యాపారంతో దళిత, బీసీ, మైనారిటీ యువత జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తున్న ముఖ్యమంత్రి వారిని మాయమాటలతో వంచించడానికే బస్సుయాత్ర ప్రారంభించాడు. నాలుగున్నరేళ్లలో జగన్ రెడ్డి దళిత, బీసీ మైనారిటీలకు చేసిన గాయాలు ఎప్పటికీ మానవు. వాటికి ఆయింట్ మెంట్ పూయడానికి.. గాయపడినవారిని అనునయిం చడానికే జగన్ రెడ్డి బస్సుయాత్రల పేరుతో కొత్త నాటకం మొదలెట్టాడు.

బీసీలకు దళిత, బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలకు భయపడే ముఖ్యమంత్రి చుట్టూ పోలీసుల్ని వైసీపీ కార్యకర్తల్ని పెట్టుకొని బిక్కు బిక్కుమంటూ నెట్టుకొస్తున్నాడు. పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా సమావేశాలు నిర్వహించి, రాష్ట్రంలోని బీసీల్లో చైతన్యం తీసుకొచ్చి, వచ్చేఎన్నికల్లో జగన్ రెడ్డికి బీసీల దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపిస్తాం.” అని రవీంద్ర హెచ్చరించారు.

నాలుగున్నరేళ్లలో జగన్ తనవర్గాన్ని ఉద్ధరించాడు తప్ప, మైనారిటీలు, ఇతర వర్గాలకు ఒరగబెట్టిందేమీ లేదు : నసీర్ అహ్మద్
“ వైసీపీ ప్రభుత్వం నాలుగున్నరేళ్లు అధికారంలో ఉండి సామాజిక న్యాయాన్ని తుంగ లో తొక్కి, ఇప్పుడు బస్సుయాత్రలు చేయడం విడ్డూరంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నానన్న అహంకారంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల నడ్డి విరిచాడు. వారికి ప్రభుత్వం తరుపున అందిచాల్సిన సహాయసహాకారాలు అందించకపోగా, వారి జీవితాలను కూడా నాశనం చేశాడు. కేవలం తన వర్గమైన రెడ్లకు మేలు చేయడం.. వారికి దోచిపెట్టడం తప్ప జగన్ ముఖ్యమంత్రిగా ఏ వర్గానికి ఏమీ చేయలేదు.

900 నామినేటెడ్ పదవుల్లో 782 పదవుల్ని రెడ్లకే కట్టబెట్టాడు. వైస్ ఛాన్సలర్లుగా చదువుకున్న మేథావుల్ని నియమించకుండా, 36 వైస్ ఛాన్సలర్లలో రెడ్లకే అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. ప్రభుత్వ న్యాయవాదుల నియామకంలో కూడా జగన్మోహన్ రెడ్డి తనవర్గానికే అధికప్రాధాన్యత ఇచ్చాడు. 45 మందికి పైగా ప్రభుత్వ సలహాదారుల్ని నియమించిన జగన్ వారిలో 35 మంది వరకు రెడ్లనే నియమించాడు. ఇదీ జగన్ రెడ్డి నాలుగున్నరేళ్లలో అమలు చేసిన అసలైన రెడ్డి సామాజికవర్గ సామాజిక న్యాయం .

చంద్రబాబు మైనారిటీలకోసం తీసుకొచ్చిన దాదాపు 11 పథకాలను రద్దుచేసిన జగన్ రెడ్డి ముస్లిం సమాజానికి తీరని అన్యాయం చేశాడు
మైనారిటీలకోసం టీడీపీప్రభుత్వం, చంద్రబాబునాయుడు అమలుచేసిన అనేక పథకా ల్ని జగన్ నిర్దాక్షణ్యంగా రద్దుచేశాడు. నాలుగున్నరేళ్ల పాలనలో కడపలో హజ్ హౌస్ ఎందుకు నిర్మించలేదో ముఖ్యమంత్రి మైనారిటీలకు సమాధానం చెప్పాలి. ఊకదంపు డు ఉపన్యాసాలిస్తున్న మైనారిటీ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఖబరిస్తా న్ భూముల్ని అన్యాక్రాంతం చేస్తుంటే, ముఖ్యమంత్రి ఎందుకు స్పందిండం లేదు? వక్ఫ్ భూముల్ని దిగమింగుతున్న వైసీపీనేతలపై జగన్ ఎందుకు చర్యలు తీసుకోడు?

చంద్రబాబు ముస్లిం మైనారిటీలకోసం ప్రవేశపెట్టిన దుల్హన్, రంజాన్ కానుక, దుకాన్ మకాన్, హజ్ యాత్రకు ఆర్థిక సహాయం అందించడం, మసీదులు, షాదీఖానాలు, ఖబరిస్తాల నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించడం వంటి పథకాలను ఎందుకు రద్దు చేశాడో జగన్ సమాధానం చెప్పాలి. ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తానన్న హామీని నా లుగున్నరేళ్లలో జగన్ ఎందుకు నెరవేర్చలేదు? మైనారిటీల సంక్షేమానికి వెచ్చించాల్సి న రూ.5,400 కోట్ల సబ్ ప్లాన్ నిధుల్ని ఎందుకు దారిమళ్లించాడో జగన్ మైనారిటీలకు సమాధానం చెప్పాలి. మౌలానా అబ్డుల్ కలాం జయంతిని పురస్కరించుకొని, గతేడాది నవంబర్ 2న ప్రకటించిన పురస్కారాలను నేటికీ ఎందుకు ఇవ్వలేదో ముఖ్య మంత్రి, మైనారిటీ శాఖ మంత్రి సమాధానం చెప్పాలి.

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంలో మైనారిటీలు బిక్కుబిక్కుమని భయంతో బతికే పరిస్థితి ఎందుకొచ్చిందో జగన్ సమాధానం చెప్పాలి
మైనారిటీలు బిక్కుబిక్కుమని బతికే పరిస్థితి రాష్ట్రంలో ఎందుకొచ్చిందో, వైసీపీ ప్రభు త్వంలో మైనారిటీలపై దాడులు, హత్యలు, అత్యాచారాలు ఎందుకు ఎక్కువయ్యాయో జగన్ ముస్లిం సమాజానికి సమాధానం చెప్పాలి. అబ్దుల్ సత్తార్, అబ్దుల్ సలాం కుటుంబాలు ఎందుకు బలయ్యాయో, చిన్నారి మిస్బాను ఎవరు బలితీసుకున్నారో, ఎంతోమంది మైనారిటీ యువకుల్ని అన్యాయంగా వైసీపీనేతలు, మంత్రులు ఎందుకు పొట్టనపెట్టుకున్నారో ముఖ్యమంత్రి చెప్పాలి. అంజాద్ బాషా లాంటి పాలెగాడిని పక్కన పెట్టుకొని ముఖ్యమంత్రి ముస్లింలను ఉద్ధరించాను అంటే మైనారిటీలు నమ్మేస్థితిలో లేరు.” అని నసీర్ అహ్మద్ స్పష్టం చేశారు.

గిరిజన ద్రోహి జగన్ కు బుద్ధి చెప్పడానికి గిరిజనులంతా ఏకం కావాలి : ధారు నాయక్
“ రాష్ట్రంలోజరుగుతున్నది సామాజిక సాధికార బస్సుయాత్ర కాదు… అవినీతిపరులు దగాకోరుల అబద్ధాల అసత్యాల యాత్ర. నాలుగున్నరేళ్ల పాలనలో జగన్, ఎస్సీ..ఎస్టీ… బీసీ…మైనారిటీలకు చేసింది శూన్యం. కేవలం ఆ వర్గాల ఓట్లకోసమే ముఖ్యమంత్రి, మంత్రులు కొత్త నాటకానికి తెరలేపారు.

గిరిజన యువతపై తప్పుడు కేసులు.. గిరిజన మహిళలపై దాడులు, అత్యాచారాలు… గిరిజన సంపద దోపడీ తప్ప జగన్ రెడ్డి గిరిజనులకు చేసింది శూన్యం
ముఖ్యమంత్రి అయినప్పటి నుంచీ జగన్మోహన్ రెడ్డి గిరిజనులపై దాడులు చేయిస్తూ, వారి సంపద కొల్లగొడుతున్నాడు. జగన్ జమానాలో గిరిజన మహిళలపై జరిగిన దాడులు.. అత్యాచారాలు..హత్యలు రాష్ట్రచరిత్రలో ఎన్నడూ జరగలేదు. ఇటీవల కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలో ముగ్గురు ఎస్టీ మహిళలను దారుణంగా చావగొట్టారు. వారిని చావగొట్టిన వారిని తూతూమంత్రంగా అరెస్ట్ చేసి, తెల్లారక పోలీసులు వదిలేశా రు. పల్నాడు జిల్లా నకరికల్లులో వైసీపీ కార్యకర్త శ్రీనివాసరెడ్డి గిరిజన మహిళ మంత్రూ బాయ్ ను ట్రాక్టర్ తో తొక్కించి చంపితే ముఖ్యమంత్రి, ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు.

గిరిజన యువతను గంజాయికి బానిసల్ని చేసిన ముఖ్యమంత్రి, వారి ద్వారా తన అక్రమ వ్యాపారాలు కొనసాగిస్తున్నాడు. గిరిజన యువతపై తప్పుడు కేసులు పెడుతూ, వారిని భయపెట్టి వారితో తప్పుడు పనులు చేయిస్తున్నారు. వైసీపీ నేతలు కాజేసిన హథీరాంజీ మఠం భూముల్ని ముఖ్యమంత్రి వెంటనే విడిపించాలి. బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేస్తే 20వేల మంది ఎస్టీ యువతకు ప్రయోజనం చేకూరుతుం దని తెలిసినా ముఖ్యమంత్రి ఆ దిశగా ఆలోచించడం లేదు. ఎస్టీల సంక్షేమానికి వెచ్చించాల్సిన నిధుల్ని జగన్ దుర్వినియోగం చేశాడు. గిరిజనులకు గతప్రభుత్వం అమలుచేసిన 16 పథకాలను జగన్ రద్దుచేశాడు.

ఎన్నికలకు ముందు గిరిజనులకు ఉచిత విద్యుత్ ఇస్తానన్న హామీని జగన్ అమలుచేయడం లేదు. బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు.. గురుకు లపాఠశాలలు లేకుండా చేసి, గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందకుండా చేసిన ఘనత జగన్ రెడ్డికే దక్కింది. గిరిజనుల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నానని, ఉపముఖ్యమంత్రి రాజన్నదొర నాపై తప్పుడు కేసులు పెట్టించారు. జీవోనెం-3ని సుప్రీంకోర్టు కొట్టేస్తే, దానిపై జగన్ ప్రభుత్వం స్పందించలేదు.

ఎస్సీ, ఎస్టీ లపైనే అట్రాసిటీ కేసులు పెడుతున్న వైసీపీప్రభుత్వానికి దళిత, గిరిజనులే తగిన బుద్ధి చెప్పాలి. ఐటీడీఏలను అవినీతికేంద్రాలుగా మార్చిన జగన్, గిరిజనుల సమస్యలు పట్టించు కోవడం లేదు. జగన్ కు బుద్ధిచెప్పడానికి గిరిజనులంతా ఏకం కావాల్సిన సమయం వచ్చింది” అని ధారునాయక్ స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE