Suryaa.co.in

Andhra Pradesh

వ్యవస్థల్ని మేనేజ్ చేయబట్టే జగన్ జైలుకెళ్లకుండా దర్జాగా బయట తిరుగుతున్నాడు

• వ్యవస్థల్ని మేనేజ్ చేయడం..న్యాయస్థానాల్ని తప్పుదోవ పట్టించడం జగన్ రెడ్డికి అవినీతి చేసినంత తేలిక
• వ్యవస్థల్ని మేనేజ్ చేయబట్టే, పదేళ్లుగా బెయిల్ పై బయట ఉండి తన అవినీతి కేసుల విచారణకు జగన్ రెడ్డి గైర్హాజరువుతున్నాడు
• బాబాయ్ హత్యకేసులో నిందితుల్ని కాపాడటానికి జగన్ రెడ్డి వ్యవస్థల్ని మేనేజ్ చేసింది నిజం కాదా?
• కోడికత్తి కేసులో అమాయకుడైన దళితబిడ్డను బలిపెట్టి, తాను తప్పించుకోవడానికి వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నది నిజం కాదా?
• అన్నకాని అన్న గాలి జనార్థన్ రెడ్డికోసం న్యాయమూర్తికే లంచం ఆశచూపడం నిజం కాదా?
• మంత్రులు జగన్ రెడ్డి పెంపుడుకుక్కల కంటే దారుణంగా తయారై, టీడీపీపై..లోకేశ్ పై నిందలేస్తున్నారు.
• చేతిలో అవినీతి మీడియా, బులుగు మీడియా ఉన్నాయని జగన్ రెడ్డి, అతని మంత్రులు ఎంత బరితెగించి విషప్రచారం చేసినా చంద్రబాబుకి, టీడీపీకి అవినీతి మకిల అంటించలేరు
• హత్యలు, అవినీతి చేసిన వాళ్లు దర్జాగా బయట తిరుగుతుంటే, జనంకోసం పాటుపడిన చంద్రబాబు జైల్లో ఉండటమేంటి అని ప్రజలే వాపోతున్నారు
– జగన్ విసిరే బిస్కట్లకోసం మీడియా ముందుకొచ్చి చంద్రబాబుపై అభాండాలు వేస్తున్నారు
• టీడీపీ అధినేత ఏ తప్పూ చేయలేదు కాబట్టే. .ఆయన్ని అన్యాయంగా జైల్లో పెట్టి, ఆయన భద్రత, ఆరోగ్యంతో చెలగాటమాడుతోంది.
• ఎప్పటికైనా న్యాయం ధర్మమే గెలుస్తాయి గానీ, జగన్ రెడ్డి.. అతని నీతిమాలిన ప్రభుత్వం చేసే దుష్ప్రచారం, కుట్రలు, కుతంత్రాలు గెలవవు.
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు

వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో జగన్ రెడ్డి…వైసీపీలు మంచి దిట్టలని, దేశంలోనే అత్యంత అవినీతిపరుడిగా పేరుపొంది, ఆర్థికనేరగాడిగా ముద్రపడి 16నెలలు జైల్లో ఉన్న రాష్ట్రముఖ్యమంత్రి పదేళ్లుగా బెయిల్ పై బయట ఉండటమే అందుకు నిదర్శనమని, న్యాయస్థానాలకు కూడా హజరుకాకుండా తాను ఎలా తప్పించుకుంటున్నాడో జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలని, లోకేశ్ పై, టీడీపీపై దుష్ప్రచారం చేస్తున్న వైసీపీ నేతలు ఆ పార్టీ పేటీఎమ్ బ్యాచ్, మంత్రులు తమ నాయకుడి తీరుని ఎలా సమర్థించుకుంటారని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యలు బొండా ఉమామహేశ్వరరావు నిలదీశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే ..

“ పదేళ్లుగా బెయిల్ పై బయటఉండి న్యాయస్థానాలకు కూడా వెళ్లకుండా జగన్ రెడ్డి బయట ఎలా ఉంటున్నాడో.. ఎవరిని ఏ పద్ధతుల్లో ప్రలోభపెట్టి, ప్రజల్ని పీడిస్తూ రాజ భోగాలు అనుభవిస్తున్నాడో వైసీపీ పేటీఎం బ్యాచ్.. ఆపార్టీ నేతలు.. జగన్ కు ఊడిగం చేస్తున్న మంత్రులు సమాధానం చెప్పాలి. జగన్ రెడ్డి పెంపుడుకుక్కల కంటే దారుణం గా కొందరు వైసీపీనేతలు, మంత్రులు వ్యవహరిస్తున్నారు. వ్యవస్థల్ని మేనేజ్ చేయా ల్సిన దుస్థితి టీడీపీకి, లోకేశ్ కు పట్టలేదని అధికారపార్టీ గ్రహించాలి.

రూ.43వేలకోట్ల అక్రమాస్తులు కలిగి ఉన్నాడని నిరూపించబడి, 16నెలలు జైల్లో ఉండి వచ్చిన జగన్ రెడ్డి… ముఖ్యమంత్రి కాకముందు.. అయ్యాక ఏళ్ల తరబడి న్యాయస్థానాల్లో విచారణకు హాజరుకాకుండా బెయిల్ పై దశాబ్దం పాటు ఎలా ఉన్నాడో తానే సమాధానం చెప్పాలి. వ్యవస్థల్ని మేనేజ్ చేయడం..న్యాయస్థానాల్ని తప్పుదోవ పట్టించడం జగన్ కు అవినీతి చేసినంత తేలిక.

బాబాయ్ హత్యకేసులో నిందితుల్ని కాపాడటానికి జగన్ రెడ్డి వ్యవస్థల్ని మేనేజ్ చేసింది నిజం కాదా? కోడికత్తి కేసులో అమాయకుడైన దళితబిడ్డను బలిపెట్టి, తాను తప్పించుకోవడానికి వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నది నిజం కాదా? అన్నకాని అన్న గాలి జనార్థన్ రెడ్డికోసం న్యాయమూర్తికే లంచం ఆశచూపడం నిజం కాదా?

బాబాయ్ హత్యకేసులో తన తమ్ముడు అవినాశ్ రెడ్డి అరెస్ట్ కాకుండా జగన్ రెడ్డి వ్యవస్థల్ని మేనేజ్ చేసింది నిజంకాదా? సీబీఐ అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వెళ్లి నప్పుడు, అతని తల్లిని అడ్డం పెట్టి జగన్ తన తమ్ముడుని రక్షించింది నిజంకాదా? వివేకాహత్య కేసులో మరో ప్రధాన నిందితుడైన అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి జైల్లో కాకుండా బయట ఎలా ఉన్నాడు? అధికారంలోకి రావడానికి ఎంత నీచానికైనా ఒడి గట్టే మనస్తత్వం జగన్ రెడ్డిది. ఆ మనస్తత్వంతోనే సొంత బాబాయ్ ను చంపినవారికి కొమ్ముకాసి, ఆహత్యానేరాన్ని టీడీపీపైకి నెట్టి రాజకీయ లబ్ధి పొందాడు.

కేవలం ప్రజ ల్లో సానుభూతి పొందడం కోసం కోడికత్తితో భుజంపై గీయించుకొని, అయాకుడైన దళిత యువకుడిని అన్యాయంగా ఏళ్లతరబడి జైల్లో పెట్టింది నిజం కాదా? జగన్ రెడ్డి కోడికత్తి కేసులో ఎన్.ఐ.ఏ కోర్టులో విచారణకు హాజరుకాకుండా, దళితబిడ్డను అన్యాయంగా జైల్లో మగ్గిపోయేలా చేస్తున్నది నిజంకాదా? తన అన్నకాని అన్న గాలి జనార్ధన్ రెడ్డిని జైలు నుంచి విడిపించడంకోసం ఏకంగా న్యాయమూర్తికే జగన్ రెడ్డి లంచం ఆశచూపడం వాస్తవం కాదా? 38 కేసులున్న జగన్ పదేళ్లు గా బెయిల్ పై బయట ఉంటూ, న్యాయస్థానాల్లో విచారణకు కూడా హాజరుకావడం లేదంటే , వ్యవస్థల్ని మేనేజ్ చేయబట్టి కాదా?

పదవీ వ్యామోహం.. భయంతోనే మంత్రులు జగన్ రెడ్డి పెంపుడుకుక్కల కంటే దారుణంగా తయారై, వాస్తవాలుచెప్పలేని దుస్థితిలో లోకేశ్ పై, టీడీపీపై నిందలు వేస్తున్నారు
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అన్యాయంగా చంద్రబాబుని జైలుకు పంపిన జగన్ రెడ్డి.. చంద్రబాబు కంటే ముందు అదే కేసులో నిందితులుగా పేర్కొన్నవారందరికి బెయిల్ వచ్చినా, టీడీపీ అధినేతకు బెయిల్ రాకుండా చేస్తున్నది నిజం కాదా? 52 రోజులుగా చంద్రబాబు రిమాండ్ ఖైదీగా జైల్లో మగ్గిపోవడానికి జగన్ రెడ్డి వ్యవస్థల్ని మేనేజ్ చేయ డం కారణం కాదా? మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, గుడి వాడ అమర్నాథ్, అంబటి రాంబాబులు, సలహాదారు సజ్జల పదవులకోసం.. జగన్ విసిరే బిస్కట్లకోసం మీడియా ముందుకొచ్చి చంద్రబాబుపై అభాండాలు వేస్తున్నారు గానీ చంద్రబాబు తప్పు చేశాడని నిరూపించగలిగారా?

జగన్ మనస్తత్వం, దుర్మార్గం తెలిసినా కూడా పదవీవ్యామోహంతో, భయంతో మంత్రులు, వైసీపీనేతలు వాస్తవాలు చెప్పలేని దుస్థితిలో ఉన్నారు. ముందేమో చంద్రబాబుకి రూ.3,300కోట్లు ముట్టా యని, తరువాత రూ.350కోట్లని, రూ.120కోట్లని ప్రచారం చేసిన జగన్ రెడ్డి అండ్ కో కోర్టుకు వాస్తవాలు చెప్పాల్సి వచ్చేసరికి టీడీపీ సభ్యత్వం పొందడానికి పార్టీకి కార్యకర్త లు చెల్లించిన రూ.27కోట్లను అవినీతి సొమ్ముగా చిత్రీకరించే స్థాయికి దిగజారారు. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద చంద్రబాబుకి డబ్బు ఎలా వచ్చిందనే దానికి సంబంధించిన ఆధారాలు బయటపెట్టలేక, న్యాయస్థానాల్లో పరువు కాపాడుకోవడా నికి వందలకోట్ల ప్రజాధనం వెచ్చించి దేశస్థాయిలో పేరున్న ముకుల్ రోహిత్గీ వంటి న్యాయవాదుల్ని పెంచి పోషిస్తున్నాడు.

చంద్రబాబు తప్పు చేశాడనే ఆధారాలు ప్రభుత్వం వద్ద ఉంటే, న్యాయస్థానాల్లో కుంటిసాకులు చెబుతూ ఎందుకు తప్పించుకుంటోంది?
చంద్రబాబు తప్పు చేశాడనే ఆధారాలు ప్రభుత్వంవద్ద ఉంటే, న్యాయస్థానాల్లో కుంటిసాకులు చెబుతూ, తప్పుడు సమాచార మిస్తూ జగన్ అండ్ కో ఎందుకు తప్పించుకుంటున్నారు? కాలయాపన చేస్తూ చంద్ర బాబు బయటకు రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు? చేతిలో అవినీతి మీడియా, నీలి మీడియా ఉన్నాయని జగన్ రెడ్డి, అతని మంత్రులు ఎంత బరితెగించి విషప్రచారం చేసినా చంద్రబాబుకి అవినీతి మకిల అంటించలేరు.

హత్యలు, అవినీతి చేసిన వాళ్లు దర్జాగా బయట తిరుగుతుంటే, జనంకోసం పాటుపడిన చంద్రబాబు జైల్లో ఉండట మేంటి అని ప్రజలే వాపోతున్నారు నిజంగా చంద్రబాబు తప్పు చేసుంటే జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే ఆయన్ని జైలుకు పంపేవాడు. గతంలోనే అధికారుల్ని ప్రలోభపెట్టి… చంద్రబాబుని, టీడీపీప్రభుత్వాన్ని అవినీతిలో ముంచాలని ప్రయత్నం చేసిచేసి చివరకు జగన్ రెడ్డి భంగపడ్డాడు.

టీడీపీ అధినేత ఏ తప్పూ చేయలేదు కాబట్టే, ఆయన్ని అన్యాయంగా జైల్లో పెట్టి, ఆయన భద్రత, ఆరోగ్యంతో జగన్ రెడ్డి అతని ప్రభుత్వం చెలగాటమాడుతున్నాయి. ఎప్పటికైనా న్యాయం ధర్మమే గెలుస్తాయి గానీ, జగన్ రెడ్డి.. అతని నీతిమాలిన ప్రభుత్వం చేసే దుష్ప్రచారం, పాలకుల కుట్రలు, కుతంత్రాలు గెలవవు.” అని బొండా ఉమా తేల్చిచెప్పారు.

LEAVE A RESPONSE