Suryaa.co.in

Andhra Pradesh

పంచాయితీ అధ్యక్షులకు విలువలు లేవు.. జగన్ రెడ్డి ఉత్సవ విగ్రహాలులాగా మార్చాడు

– గ్రామాల పరిశుభ్రత గురించి ఎక్కువ శ్రద్ధ పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రమే
– “పంచాయితీతోనే ప్రగతి వర్క్ షాప్‌”లొ తెదెపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు

ఏ రాజకీయ నాయకుడు మాట్లాడినా గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్తుంటారు. ఆ కోవకు చెందిన నాయకుడే చంద్రబాబు నాయుడు . ప్రజల సంక్షేమం కోసమే తప్ప పదవులు అనుభవిద్దామని ఆయన రాలేదు. చంద్రన్న పరిపాలించిన 5 సంవత్సరాలు ఒక స్వర్ణ యుగం. ఆ 5 సంవత్సరాల్లో ఎవరైతే గ్రామ పంచాయితీ అధ్యక్షుడుగా ఉన్నారో వారు ప్రజల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోయారు.

రాజకీయాలకు సంబందం లేకుండా గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పని చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పక్కన కూర్చున్న వ్యక్తి ఒక గ్రామ పంచాయితీ ప్రెసిండెంట్. మంచినీటి సరఫరా, చెత్తను ఒక సంపదగా సృష్టించటం, గ్రామాల పరిశుభ్రత గురించి ఎక్కువ శ్రద్ధ పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రమే. పంచాయితీ ఎన్నికలు జరిగి మూడు సంవత్సరాలు కాబోవస్తుంది. కానీ పంచాయితీ అధ్యక్షులకు విలువలు లేవు, ఉత్సవ విగ్రహాలులాగా జగన్ రెడ్డి మార్చాడు.

కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.1400 కోట్లు గజ దొంగ కన్నా దారుణంగా దోచుకున్నాడు. 100 రోజుల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారు. వైసీపీ సర్పంచులారా! తెలుగుదేశం పిలుస్తుంది! రండి! కదలిరండి! మనందరం చేతులు కలిపి మన అధికారాన్న గంగలో కలిపిన జగన్ రెడ్డికి కర్ర కాల్చి వాతపెడదాం. మిగిలిన 2 సంవత్సరాలు మీకు అధికారమిస్తారు. నిధులు విడుదల చేస్తారు. గర్వంగా మీ గ్రామాల్లో తిరగండి. ఓట్లు, రాజకీయాల గురించి మేము చెప్పటం లేదు.. చేసి చూపిస్తాం. వేదిక మీద మాట్లాడారని మీ మీద కేసులు పెట్టవేచ్చు. ఎవ్వరు భయపడకండి. చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ మీకు తోడుగా ఉంటుంది.

LEAVE A RESPONSE