జగన్ రెడ్డి రూ.8,600 కోట్లు దొంగలించాడు

– ఉపాధి హామీ నిధులను ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు
– దాదాపు రూ.24,000 కోట్ల ఉపాధి హామీ నిధులను దొంగలించాడు
-రావాల్సిన బిల్లులు రాక సర్పంచ్‌లు ఆత్మహత్య చేసుకుంటున్నారు
-సర్పంచులను డమ్మీలను చేశాడు
-వాలంటీర్లను పెట్టుకొని చేయించుకుంటున్నాడు
-చంద్రబాబు రథచక్రాలు వస్తున్నాయి వస్తున్నాయి.. ఎవ్వరు భయపడకండి
-పంచాయతీ రాజ్ ఛాంబర్ గౌరవ అధ్యక్షుడు యలమంచిలి రాజేంద్రప్రసాద్

రాష్ట్రం ప్రభుత్వం ఇవ్వాల్సిన అన్ని రకాల నిధులను గత మూడు సంవత్సారలుగా ఇవ్వటం లేదు. అమ్మ పెట్టదు, అడుక్కోనివ్వదనే చందంగా ఉంది జగన్ రెడ్డి తీరు. రూ.8,600 కోట్లు జగన్ రెడ్డి దొంగలించాడు. ఉపాధి హామీ నిధులను ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా, నారా లోకేష్ మంత్రిగా ఉన్నప్పుడు మాకు రావాల్సిన అన్ని రకాల నిధులను ఇచ్చి గ్రామాల అభివృద్ధికి సహకరించారు.

రాష్ట్రంలో కూలి పనిచేసుకొని బ్రతకటానికి కూడా పనులు లేవు. దాదాపు రూ.24,000 కోట్ల ఉపాధి హామీ నిధులను దొంగలించాడు. రావాల్సిన బిల్లులు రాక సర్పంచ్‌లు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అధికార పార్టీనే దానికి ప్రేరేపిస్తుంది. రాజ్యాంగం ప్రకారం ఏ సంక్షేమమైనా గ్రామ సర్పంచుల ఆధ్వర్యంలో జరగాలి, కానీ జగన్ రెడ్డి జెట్‌పీటీసీలకు, ఎంపీటిసిలకు, సర్పంచులకు సంబంధం లేకుండా వాలంటీర్లను పెట్టుకొని చేయించుకుంటున్నాడు. పంచాయితీరాజ్ వ్యవస్థ నిర్వీర్యమైపోయింది. సర్పంచులను డమ్మీలను చేశాడు.

సర్పంచులకు చంద్రబాబు న్యాయం చేశాడు. సర్పంచులకు చంద్రబాబు అధికారాలిచ్చారు. ఏ రోజు ఎప్పుడు ఏమడిగినా సరే చంద్రబాబు గారు చేశారు. వేతనాలు పెంచింది చంద్రబాబు. వాలంటీర్ల కంటే మా వేతనాలు తక్కువ. వర్షంలో అర్థరాత్రి ఓ సమస్యపై చంద్రబాబు ఇంటికి 500మంది సర్పంచులతో వెలితే ఆయన బయటికి వచ్చి సమస్య పరిష్కారం చేశారు.

అమెరికా అధ్యక్షుడు గేటు పట్టుకొని ఫొటో దిగాను కానీ జగన్ రెడ్డి ఇంటి రోడ్డులో కూడా వెళ్ళకూడదని కండీషన్ పెట్టాడు. అధికారమున్న లేకున్న చంద్రబాబుతోనే ఉన్నాం. ఏ పార్టీ చేయనన్ని పనులు చంద్రబాబు సర్పంచులకు చేశారు. కట్టకట్టుకొని చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేయటానికి అహర్నిసలు కష్టపడదాము. చంద్రబాబు రథచక్రాలు వస్తున్నాయి వస్తున్నాయి. ఎవ్వరు భయపడకండి.

Leave a Reply