జీవితంలో మొదటిసారి రామ్ గోపాల్ వర్మ భయపడినట్లు సీఐడీ అధికారులు చెప్పారు

– సీఐడీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పా
– అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు

గుంటూరు : ఉదయం 10 గంటలకు విచారణకు హాజరయ్యా. సాయంత్రం 5.30 వరకు నన్ను ప్రశ్నించారు. సీఐడీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పా. ఆర్జీవీ సినిమాలపై నాకు తీవ్ర అభ్యంతరాలున్నాయి. రెండు కులాల మధ్య సామరస్యతను చెడగొట్టేలా వ్యూహం సినిమా ఉంది. ఆవేదన వల్లే ఆర్జీవీ గురించి అలా మాట్లాడా . ఈ వివాదం తర్వాత రామ్ గోపాల్ వర్మకు ఫోన్ కాల్ చేశా . నా అభిప్రాయాన్ని ఆర్జీవీకి చెప్పాలనుకున్నా. నా ఫోన్ కాల్ ను రామ్ గోపాల్ వర్మ లిప్ట్ చేయలేదు . జీవితంలో మొదటిసారి రామ్ గోపాల్ వర్మ భయపడినట్లు సీఐడీ అధికారులు చెప్పారు. ఇప్పటికైనా ఆర్జీవీ మంచి సినిమాలు తీయాలి.. లేకపోతే ఇలాంటి పరిస్థితే ఎదురవుతుంది

Leave a Reply