Suryaa.co.in

Andhra Pradesh

గిరిజనులకు సౌకర్యాలు లేకుండా వైసీపీ కుట్ర

– బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి

అరకు : రెండు రోజుల పర్యటన విజయవంతం అయింది. ఎన్నికల కమిషన్ ని బిజెపి ప్రతినిధులు కలిసి ఫిర్యాదు చేశాం. వైసీపీ నకిలీ ఎపిక్ కార్డు లు పై చేసిన ఫిర్యాదుపై ఎన్నికల కమిషన్ చర్యలు చేపడతామని బిజెపి కి ఎన్నికల కమిషన్ వివరణ ఇచ్చింది.బిజెపి బలీయమైన శక్తిగా ఎదిగింది. బిజెపి విజయం సాధించడానికి అవసరమైన కసరత్తు ప్రారంభించాం.

గ్రామాల్లో పర్యటించాను. కేంద్రం ఇళ్ళు నిర్మాణానికి నిధులు ఇస్తే, ఇళ్ళు నిర్మాణం చేయలేదు. జలజీవన్ మిషన్ నిధులు వినియోగించలేదు. ఈకారణంగా గిరిజనుల కు సౌకర్యాలు లేకుండా వైసీపీ కుట్ర చేసింది. రోడ్లు అధ్వాన్నంగా తయారైంది. వైద్యం సౌకర్యం లేదు.

6000వేలు కోట్లు కేంద్ర ప్రభుత్వం రోడ్లు కు నిధులు ఇస్తే ఇక్కడ రోడ్లు మరమ్మతులు కూడా చేయలేదు. పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు బిజెపి కృషి చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లు ఇవ్వడం లేదు. గిరిజన తెగలకు ఇళ్ళు ఇస్తే ఇళ్ళు కట్టలేదు. సంస్థాగతంగా బిజెపి పటిష్టం. ద్రౌపది ముర్ము ను రాష్ట్ర పతి ని బిజెపి చేసింది. బిజెపి ని ప్రజలు ఆశీర్వదించాలి కోరుతున్నాం. ఓట్లు లిస్ట్ లో ఓట్లు గల్లంతు. నకిలీ ఎపెక్స్ కార్డు లు వైసీపీ తయారు చేశారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం లో 61వేల ఓట్లు గల్లంతు. చీఫ్ ఎలక్షన్ కమిషన్ కలిశాం. పాత్రికేయుల సమావేశంలో మాజీ ఎంపీ కొత్తపల్లి గీత, జిల్లా అధ్యక్షుడు పాంగి రాజారావు తదితరులు పాల్గొన్నారు

LEAVE A RESPONSE