బడుగులను ఉన్నత స్థానంలో నిలబెట్టాలన్నదే ముఖ్యమంత్రి ఆకాంక్ష

– సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినేపే విశ్వరూప్
ఎస్సీ, ఎస్టీ , బీసీ విద్యార్థులను ఉన్నత స్థానంలో నిలబెట్టాలన్నదే ముఖ్యమంత్రి ఉద్దేశ్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి పినిపే విశ్వరూపు అన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక చెన్నా రెడ్డి కాలనీలో నూతనంగా రూ.2 కోట్ల తో నిర్మించిన డా.బి.ఆర్. అంబేద్కర్ ఎ.పి స్టడీ సిర్కిల్ ప్రారంభోత్సవం లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి , స్థానిక ఎం.పి. గురుమూర్తి , ఎం.ఎల్.సి. యండవల్లి శ్రీనివాసుల రెడ్డి , అధికారులు పాల్గొన్నారు.
మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం ఏడు సంవత్సరాల తరువాత ఎ.పి. స్టడీ సిర్కిల్ ఏర్పాటు చేయడం, మొదటిగా ఆంధ్రుల ఇష్ట దైవం శ్రీవారి పాదాల చెంత ప్రారంభించుకోవడం సంతోషమని అన్నారు. ఐ.ఏ.ఎస్ , ఐ.పీ.ఎస్. , గ్రూప్ – 1 స్థాయిలో ఉద్యోగాల్లో వున్న వారు 90 శాతం మంది స్టడీ సర్కిల్ లో శిక్షణ పొంది ఎంపిక కాబడిన వారేనని అన్నారు. గత ప్రభుత్వం విద్యను కార్పోరేట్ కు కట్టబెట్టి స్టడీ సర్కిల్ భోదనలను విస్మరించిందని అన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలతో ఎ.పి. స్టడీ సర్కిల్ ను మూడు ప్రాంతాలలో ఏర్పాటు చేసి తిరుపతిలో బ్యాంకు ఉద్యోగాలకు, విజయవాడలో గ్రూప్ – 1 కు , విశాఖ లో సివిల్స్ కు కోచింగ్ ఏర్పాటుకు నాంది పలికామని అన్నారు. రాష్ట్రంలో 1070 వసతి గృహాలలో మూడవ తరగతి నుండి 10 వ తరగతి వారు 1 లక్షా 16 వేల మంది, ఇంటర్ నుండి పీ.జీ వరకు 60 వేల మంది చదువుతున్నారని, 2 లక్షల 17 వేల మందికి విద్యాదీవేన కు రూ.245 కోట్లు వారి ఖాతాలాకు జమచేశామని తెలిపారు.
విదేశీ విద్య కోసం టాప్ 100 కాలేజీ లలో సీటు వస్తే ఫీజు చెల్లిస్తామని తెలిపారు. సాంఘిక సంక్షేమ హాస్టల్ లో చదివిన విద్యార్థులు 400 మంది పరీక్షలు రాస్తే 13 మంది IIT , 37 మంది NIIT, 22 మంది మెడిసిన్ సీట్లు వచ్చాయని అన్నారు. త్వరలో యువతకు ఇన్నోవాలు ఎన్.ఎఫ్.డి.సి. సహకారంతో అందించనున్నామని తెలిపారు. నేడు ఇక్కడ బ్యాంక్ పి.ఓ పరీక్షలకు అడ్మిషన్ అయిన 110 మంది 110 మందికి ఉద్యోగాలు వచ్చేలా స్టడీ సిర్కిల్ కు వెలుగులు నింపాలని సూచించారు.
తిరుపతి ఎం.పి. మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు చేసిన ఎ.పి స్టడీ సర్కిల్ లో భోదన పొందిన వారు ముఖ్యమంత్రి ఆశయం మేరకు మీ భవిష్యత్తు ఏర్పాటుతో మరొకరికి ఆదర్శం కావాలని, స్టడీ సర్కిల్ కు మంచి పేరు తేవాలని సూచించారు.
సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీత మాట్లాడుతూ ప్రభుత్వమే సొంతంగా ఎ.పి. స్టడీ సర్కిల్ నడపాలని నిర్ణయించి, మంచి ఫ్యాకల్టీ ఏర్పాటుతో శిక్షణను ఇవ్వనున్నామని , రాష్ట్ర విభజన అనంతరం ఏడు సంవత్సరాల తరువాత తిరుపతి , విజయవాడ, విశాఖ లో స్టడీ సర్కిల్ అందుబాటులోకి వచ్చాయని అన్నారు. శిక్షణ పొందిన వారు ఆదర్శంగా నిలిచి మంచి పేరు తీసుకొని రావాలని అప్పుడే మరింత మందికి తెలిసి ఉపయోగించుకోగాలుగుతారని అన్నారు. శిక్షణకు హాజరైన విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేసారు.
బ్యాంకు శిక్షణకు చేరిన విద్యార్థులు తమ అభిప్రాయాలను పాలు పంచుకోగా, అడిషినల్ డైరెక్టర్ రఘు, జే.డి.శ్రీనివాస్, డి.డి. భవాని, ఇ.ఇ. ఆనందరావు, డి.ఈ. జయకుమార్, సంఘాల నాయకులు మధు, ప్రవీణ్, రాజేంద్ర, కార్పోరేటర్ నరేంద్ర , శిక్షణ కు హాజరైన విద్యార్థులు , అధికారులు పాల్గొన్నారు.