బీసీ ద్రోహి జగన్ రెడ్డి : 56 కార్పొరేషన్లు, 10 మంత్రి పదవులు ఇచ్చామని అదే సామాజిక న్యాయమని వైసీపీ మోసపూరిత తీర్మానాలు చేస్తోంది. బీసీలకు 56 కార్పొరేషన్లు ఇచ్చి రెండో వైపు 10శాతం రిజర్వేషన్లు కోత కోసి స్థానిక ఎన్నికల్లో 16,800 రాజ్యాంగ పదవుల్ని దూరం చేయడం సామాజిక న్యాయ విద్రోహం కాదా.? బీసీ సబ్ ప్లాన్ నిధులు రూ.26వేల కోట్లు దారి మళ్లించడం సామజిక న్యాయమా.? 56 కార్పొరేషన్లకు నిధులు కేటాయించకపోవడం బీసీలను దగా చేయడం కాదా.? 10 మంత్రి పదవులిచ్చి వందలాది బీసీలను హత్య చేయడం సామాజిక న్యాయమా.?
దళితులకు నమ్మకద్రోహం : సబ్ ప్లాన్ నిధులు రూ.7,200 కోట్లు దారి మళ్లించారు. 11,500 ఎకరాల దళితుల అసైన్డ్ భూముల్ని బలవంతంగా లాక్కున్నారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, విదేశీ విద్య, కులాంతర వివాహాలకు ఆర్ధిక సాయం, పారిశ్రామిక రాయితీలు వంటి 28 ఎస్సీ పథకాలు, కేంద్ర ప్రాయోజిత పథకాలు రద్దు చేయడం దళికులకు నమ్మక ద్రోహం చేయడం కాదా.? ప్రశ్నించిన డాక్టర్ సుధాకర్ లాంటి అనేక మంది దళితుల్ని హత్య చేయడం సామాజిక న్యాయమా.?
గిరిజన వంచన : ఎస్టీ సబ్ ప్లాన్ నుండి రూ.1000 కోట్లకు పైగా నిధులు దారి మళ్లించారు. 81 గురుకుల పాఠశాలలను సాధారణ పాఠశాలలుగా మరాచేందుకు కుట్ర చేశారు. జీవో నెం.3పై కనీసం తీర్మానం చేసి కేంద్రానికి పంపలేదు. చంద్రబాబు నాయుడు మన్యంలో కాఫీ తోటలు పెంచితే.. జగన్ రెడ్డి గంజాయి తోటలు పెంచారు. పోలవరం గిరిజనుల్ని వరదల్లో ముంచారు. ముంపు గిరిజనులకు పరిహారంలో మోసం చేయడం సామాజిక న్యాయమా.?
మైనార్టీలకు ధోకా : మైనార్టీ సంక్షేమ నిధులు రూ.1,483 కోట్లు దారి మళ్లించారు. దుల్హన్, రంజాన్ తోఫా, దుకాన్ మకాన్ వంటి పథకాలు రద్దు చేశారు. ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు హామీపై మాట తప్పి మడమ తిప్పారు. బీజేపీతో అక్రమ సంసారం చేస్తూ మైనార్టీలను మోసం చేశారు. అబ్దుల్ సలాం కుటుంబాన్ని వేధించి సామూహిక ఆత్మహత్యకు కారణమయ్యారు. ఇదేనా సమాజిక న్యాయం.?
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చెందిన అసైన్డ్ భూముల్ని బలవంతంగా గుంజుకోవడం, పారిశ్రామిక రాయితీలు రద్దు చేయడం, నాణ్యమైన విద్యను దూరం చేయడం, బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయకపోవడం, వేల కోట్ల సబ్‌ప్లాన్ నిధులు దారి మళ్లించడం, వందలాది మందిని హత్య చేయడం సమాజిక న్యాయమా.? దళిత, బహుజనులకు బొరుగులు పెట్టి వారి బంగారం కొట్టేయడం సామాజిక న్యాయమా.. మోసకారి తనమా.?