Suryaa.co.in

Andhra Pradesh

బ్లూ మీడియా చెరిపేస్తే చెరగని చరిత్ర టీడీపీది

-జగన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకొని అమాయకులను బలిచేస్తున్నాడు
-తండ్రి అధికారాన్నిఅడ్డుపెట్టుకొని 42వేల కోట్లు దండుకున్న వ్యక్తి పేదల పక్షం ఎలా అవుతాడు
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

జగన్మోహన్ రెడ్డి పంచనచేరి, ఆయన విసిరే ఎంగిలిమెతుకులకోసం ముసలావిడతో చంద్రబాబు జాతకంగురించి మాట్లాడించిన చెత్తమీడియా, బుద్ధిలేని బ్లూమీడియా ఇప్పటికైనా ఇలాంటివి మానేస్తే మంచిది. గంగవ్వనుచూపిన చెత్తమీడియా గానీ, సాక్షిమీడియాగానీ, ఇంకా రెండుఛానెళ్లు కలిసి మొత్తం బ్లూమీడియా. చంద్రబాబుగారిపై పడి ఏడవడంగా మారింది.

జగన్మోహన్ రెడ్డి పదేపదే కొన్నిఛానెళ్లకు, పత్రికలకు కులం అంటగట్టిమాట్లాడుతుంటారు. మరిప్పుడు గంగవ్వను అడ్డంపెట్టుకొని చంద్రబాబు భవిష్యత్తుపై అవహేళనగా మాట్లాడిన మీడియాది ఏకులం? ముఖ్యమంత్రిగారు, మీరుస్పాన్సర్డ్ చేసిన బ్లూ మీడియానే కదా చంద్రబాబు గారిని ఇలా మాట్లాడించింది తప్పుకదా? మీతరుపున వకాల్తా తీసుకొని ఈ మీడియా ఎగిరిపడుతోంది అని జనం అంటున్నారు. నిజమేనా ముఖ్యమంత్రి గారు… చేతనైతే నిజాలు పలకండి, వాస్తవాలు ప్రజలకుచెప్పండి అంతేగానీ సీఎం మిలాఖత్ అయ్యి, గంగవ్వలాంటి అమాయకులను అడ్డంపెట్టుకొని చెత్తపనులుచేయవద్దని, చెత్త బ్లూ మీడియాకు తెలుయజేస్తున్నాం. భారతదేశంలోనే అత్యంతధనవంతుడైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదలపక్షం ఎలాఅవుతాడు? ధనికులపక్షాన నాయకత్వం వహించే శక్తిమంతుడు ముఖ్యమంత్రి పేదల్నితన్ని, పేదల్ని కాలరాసి, పేదల్ని అణగదొక్కి, వారి ఆశయాలపై బంగ్లాలుకట్టిన చరిత్రమీది. మన సీఎం వేసుకునే చెప్పులజత ఖరీదు రూ.1,34,000లు. అట .

సీఎం త్రాగే నీళ్లబాటిల్ ఖరీదు లీటర్ రూ.4,500లు అట అంతఖరీదైన జీవితం గడిపే జగన్మోహన్ రెడ్డి పేదలపక్షం ఏలా అవుతాడు? బెంగుళూరు ఎలహంకలోని జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ ని ఎప్పుడైనా పేదలుచూశారా? తాడేపల్లి భవనాన్ని ముఖ్యమంత్రి ఎప్పుడైన కనీసం తనమంత్రులకు చూపించాడా? మంత్రులు, అధికారులతో పనిలేకుండా అంతా ఏకపాత్రాభినయం చేయడం జగన్మోహన్ రెడ్డిగారికి బాగా అలవాటైంది. తండ్రి అధికారంతో జగన్మోహన్ రెడ్డి కొట్టేశాడని సీబీఐ, ఈడీ తేల్చిన రూ.43వేలకోట్లసొమ్ము పేదలది. అందులో చెప్పులుకుట్టుకునేవాడు, రిక్షాతొక్కేవాళ్ల కాయకష్టం చేసేవాళ్లు, బడుగు బలహీనవర్గాల సొమ్ముంది.

అలాంటివాళ్ల సొమ్ము కాజేసిన మీరు పేదలపక్షమా? మీతండ్రి అధికారంలోఉన్నప్పుడు మీరుకొట్టేసిన రూ.43వేలకోట్లు, ఖజానాలోఉంటే అది పేదలకుఉపయోగపడేది గదా? ఎలా మీరుపేదలపక్షమో బహిరంగచర్చకు రండి. దళితులకుచెందిన అసైన్డ్ భూముల్ని మీరు, మీతాత, తండ్రిగారు కొట్టేశారు. అలాంటి కుటుంబానికిచెందిన మీరు పేదలపక్షపాతా?

తప్పకుండా మీరు ధనిక పక్షమే రాబోయే రోజుల్లో, మన ముఖ్యమంత్రి గారు దేశంలోనే అత్యంత ధనవంతుడుగా మారి అంబానీ, ఆదానీలను టాటా లను వెనక్కి నెడతారు. ఆయన ఎలా అవుతాడు. పేదలపక్షం? పేదల వారికి కూడు, గుడ్డ, నీరు ఇవ్వాలన్న ఆశయాలతో పనిచేసే టీడీపీ పార్టీ పేదల పక్షం నూటికి నూరుపాళ్లు జగన్ ధనవంతుల పక్షం.

LEAVE A RESPONSE