Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం

జగన్ రెడ్డి పాలనంతా కక్ష తీర్చుకోవడం, దాడులు చేయడం మాత్రమేనని రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నేతలు హోరెత్తారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో పైసా అవినీతి నిరూపించకుండా చంద్రబాబుపై కక్ష సాధింపులో భాగంగానే అరెస్టు చేశారు. రెండేళ్లుగా విచారణ సాగిస్తూ కూడా ఇప్పటికీ రూపాయి చంద్రబాబుకు చేరిందనడానికి ఆధారాలు చూపలేకపోతున్నారు. ఇంతకన్నా దిక్కుమాలిన పాలన ఇంకెక్కడైనా ఉంటుందని నేతలు ప్రశ్నించారు.

చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ ‘బాబుతో నేను’ కార్యక్రమాన్ని 27వ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు రావడం తధ్యమని నేతలు పేర్కొన్నారు. శింగనమల నియోజకవర్గం బుక్కరాయ సముద్రంలో ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ఎస్.రాజు ఆమరణ నిరాహార దీక్ష 2వ రోజు కొనసాగుతుంది. పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు కాలవ శ్రీనివాసులు ఆమరణ నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపారు.

యన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం చందర్లపాడు మండలంలోని నాడు కోనాయపాలెంలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ధ్వర్యంలో సర్వమత ప్రార్థనలు చేపట్టారు. గుడిమెట్ల గ్రామంలో ద్వారక వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొత్తపేట నియోజకవర్గంలో బండారు సత్యానందరావు వినూత్న పద్దతిలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

కడప ఎన్టీఆర్ సర్కిల్ వద్ద బెస్త సాధికార కమిటీ కన్వీనర్ రాంప్రసాద్ ఆధ్వర్యంలో ఒంటిమిట్ట రామాలయం వరకు పాదయాత్ర చేపట్టారు. కార్యక్రమంలో పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్. శ్రీనివాసులు రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, హరిప్రసాద్ పాల్గొన్నారు. చీరాలలో యాదవ సామాజికవర్గం నాయకులు మేడలకు ఉరితాళ్ళు బిగించుకొని వినూత్నంగా నిరసన తెలిపారు.

నెల్లూరులో కోటంరెడ్డి శ్రీ‌నివాసులురెడ్డి ఆధ్వర్యంలో మేము సైతం… దీక్ష కొనసాగించారు. గేదె మెడ‌లో పోస్టర్ వేసి పాలిచ్చే గేదెల్లారా.. మీర‌న్నా ప‌రిపాలించ‌డం నేర్పండి ఈ మూర్ఖపు దున్నపోతు జ‌గ‌న్ రెడ్డికి అంటూ వాల్ పోస్టర్ వేశారు.బత్తలపల్లిలో శివాలయం నుంచి పోట్లమరీ గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయం వరకు తెలుగుయువత, TNSF, ITDP నేతలు పాదయాత్రగా వెళ్లారు.

కళ్యాణదుర్గం నియోజకవర్గం బ్రహ్మసముద్రం మండలం గుడిపల్లిలో మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు చౌదరి ఆధ్వర్యంలో చిత్రలింగేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం చేతులకు సంకెళ్లు వేసుకుని వినూత్న నిరసన తెలిపారు.పెనుకొండ నియోజకవర్గం పెద్ద చెరువు కట్ట (గేట్) శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం గేట్ శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం నుండి పెనుకొండ పట్టణ కేంద్రంలో కాశీ విశ్వేశ్వవర స్వామి దేవాలయం వరకు 7 కిలోమీటర్ల మేర పెనుకొండ నియోజకవర్గ ఇంఛార్జ్ బి కె పార్థసారథి, మడకశిర నియోజకవర్గ ఇంఛార్జ్ గుండుమల తిప్పేస్వామి పాదయాత్ర చేపట్టి సంఘీభావం తెలిపారు.

ఒంగోలు నియోజకవర్గంలో హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు.సిపిఐ రాష్ట్ర కమిటీ కార్యదర్శి రామకృష్ణ సంఘీభావం తెలియజేశారు. యలమంచిలి నియోజకవర్గం వాడ్రపల్లి గ్రామంలో వినూత్న రీతిలో అవలో పడవలపై జెండాలు, ప్లకార్డులతో పట్టుకొని చెవిలో పువ్వులతో నిరసన తెలిపారు. మాజీ ఎంపీ పప్పల చలపతిరావు, పార్లమెంట్ అధ్యక్షులు బుద్ధ నాగ జగదీశ్వరరావు, యలమంచిలి నియోజకవర్గ ఇంఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావులు పాల్గొన్నారు.

ఈ నిరసన కార్యక్రమాలలో పోలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు, బొండా ఉమామహేశ్వరరావు, రెడ్డెప్పగారి శ్రీనివాసులరెడ్డి, వంగళపూడి అనిత, కాలువ శ్రీనివాసులు, పార్లమెంట్ అధ్యక్షులు కూన రవికుమార్, జ్యోతుల నవీన్, గన్నీ వీరాంజనేయులు, కనకళ్ళ నారాయణ, నెట్టెం రాఘురాం, తెనాలి శ్రావణ్ కుమార్, ఏలూరి సాంబశివరావు, పల్లా శ్రీనివాసరావు, మల్లెల రాజశేఖర్ గౌడ్, బి.కె పార్థసారథి, ఎమ్మెల్యేలు బెందాళం అశోక్, వెలగపూడి రామకృష్ణబాబు, పి. జి. వి. ఆర్ నాయుడు(గణబాబు), నిమ్మకాయల చినరాజప్ప, వేగుళ్ళ జోగేశ్వరరావు, గోరంట్ల బుచ్చియ్యచౌదరి, నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, గద్దె రామ్మోహన్ రావు, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయస్వామి, పయ్యావుల కేశవ్, మాజీ మంత్రులు దేవినేని ఉమా, ప్రత్తిపాటి పుల్లారావు, కిడారి శ్రావణ్ కుమార్, కిమిడి కళా వెంకట్రావు, గొల్లపల్లి సూర్యరావు, పితాని సత్యనారాయణ, కొల్లు రవీంద్ర, కన్నా లక్ష్మినారాయణ, భూమ అఖిలప్రియ, పరిటాల సునీత, నియోజకవర్గ ఇంఛార్జులు, రాష్ట్ర, మండల నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE