జే టాక్స్ తో జగన్ రెడ్డి వ్యాపారుల్ని వేధిస్తున్నారు

Spread the love
  • ఓ వైపు పన్నులు మరో వైపు జే టాక్స్ తో జగన్ రెడ్డి వ్యాపారుల్ని వేధిస్తున్నారు
  • సెబ్ అధికారులు నాటు సారా మాఫియాను వదిలేసి బెల్లం వ్యాపారుల్ని వేధిస్తున్నారు
  • వ్యాపారస్తులపై జగన్ రెడ్డి వేధింపులకు నిరసనగా ఈనెల 17న విజయవాడలో సమరభేరీ
    – డూండి రాకేష్

వైసీపీ ప్రభుత్వం గత 3 ఏళ్ల నుంచి వ్యాపారస్తుల్ని వేధిస్తూ ఇబ్బందులకు గురి చేస్తోందని టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షులు డూండి రాకేష్ మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…..

సామాజిక స్పృహతో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకి నిరంతరం అందుబాటులో ఉండే వ్యాపారస్తులపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఏమాత్రం జాలి, దయ లేకుండా చిరు వ్యాపారుల నుంచి పెద్ద వ్యాపారుల వరకు ఓ వైపు పన్నుల భారం మోపి మరో వైపు రక రకరకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అధికారికంగా పన్నులు వేయటమే కాక, అనధికారికంగా వ్యాపారుల నుంచి జే ట్యాక్స్ వసూలు చేయటం దుర్మార్గం. టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు వ్యాపారుల సంక్షేమానికి పాటుపడితే జగన్ రెడ్డి మాత్రం పన్నుల మీద పన్నులు వేసి వ్యాపారస్తులను పీల్చుకుతింటున్నారు. జగన్ పాలనలో వ్యాపారుల స్ధితి దయనీయంగా మారింది. రోడ్లపై చిరు వ్యాపారం చేసుకొనే వారు జగన్ రెడ్డి జే ట్యాక్స్ లు ఎదుర్కోలేక కుమిలిపోతున్నారు.

జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే కొన్ని వ్యాపారాలను నిలిపివేయించారు. సినిమా టిక్కెట్ల అంశంలో ప్రభుత్వ జోక్యం ఏంటి? గతంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఉచిత ఇసుకను జగన్ రెడ్డి రద్దు చేసి 32 రకాల వ్యాపారాల్ని దెబ్బకొట్టారు. ఇసుక రద్దు వల్ల ఐరన్ వ్యాపారులు, బిల్డింగ్ మెటీరియల్ వ్యాపారులు,ఇటుకల వ్యాపారులు,ఇలా అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జగన్ రెడ్డి తీరుతో ఏపీలో వ్యాపారాలు చేయలేక ఇప్పిటికే అనేకమంది వ్యాపారాలు మానేసి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి కళ్లు చల్లబడలేదు. రాష్ట్రంలో తన మనుషులు తప్ప ఇంకెవరూ వ్యాపారం చేయకూడదన్న దురుద్దేశ్యంతో జగన్ రెడ్డి ట్యాక్స్ లతో వ్యాపారులని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కరోనా విపత్కర సమయంలో ఏ వ్యాపారికైనా ముఖ్యమంత్రి అండగా నిలబడ్డారా? వ్యాపారులకు ముఖ్యమంత్రి అండగా నిలబడక పోయినా తమంతట తాము బాధలు పడుతూ వ్యాపారాలని అభివృద్ధి చేసుకుంటుంటే జగన్ రెడ్డి ఇష్టానుసారంగా షాప్ బోర్డులకు, చెత్తకు, లెట్రిన్ లకు ట్యాక్స్ లంటూ, కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచి అడిషినల్ లోడ్ ఛార్జీస్, ఏసిడి ఛార్జెస్ అని రెండు రకాలుగా ఒక మీటరుకు కరెంటు బిల్లు రూ. 5వేల రూపాయలు వస్తే రూ. 10వేల రూపాయలకి పైగా వసూలు చేస్తున్నారు. ట్యాక్స్ లు, ఇన్ స్టాల్ మెంట్లు కట్టడం ఆలస్యమయితే చెత్త తీసుకొచ్చి అధికారులు షాపులు ముందు వేస్తున్నారు.

ఇవన్నీ సకాలంలో కట్టినా జగన్ మోహన్ రెడ్డి పర్యటనల సంధర్బంగా ఏ కారణం లేకుండా షాపులు మూయించి వేసి పరదాలు కట్టిస్తున్నారు. ప.గో జిల్లా జంగారెడ్డి గూడెం లో కల్తీ సారా తాగడం వల్లే బాధితులు చనిపోయారని డాక్టర్ల రిపోర్టులలో వెల్లడయింది. ఈ విషయాన్ని మా నాయకులు, పోలిసులు కూడా వెల్లడించారు. కానీ నాటు సారా మాఫియాని వదిలేసి ఎక్సైజ్ అధికారులు మాత్రం బెల్లం వ్యాపారుల మీద యుద్ధం ప్రకటించారు. సెబ్ అధికారులని అడ్డం పెట్టుకొని కేజీ బెల్లం దొరికిన కూడ వాళ్లని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి చిత్రహింసలు గురిచేశారు. ఆ చిత్రహింసలు భరించలేని కొంత మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. జంగారెడ్డి గూడెం కొల్లూరులో దుర్గా రావు అనే బెల్లం వ్యాపారిని సెబ్ అధికారులు మూడు రోజులు బంధించి చిత్రహింసలకు గురి చేశారు. తరువాత రైలుపట్టాలపై అతని శవం దొరికింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేయలేదు.

తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం పోరాటం చేయటం వల్లే తప్పని పరిస్థితులలో శవాన్ని పోస్టు మార్టం చేశారు, అతని కుటుంబం సభ్యులంతా ఆసుపత్రి దగ్గరే ఉంటే దొంగ చాటుగా శవాన్ని తీసుకెళ్లి అతని ఇంటి వద్ద అర్ధరాత్రి 3గంటలకు వదిలేసి వెళ్ళిపోయారు. రీపోస్టుమార్టం చేయాలని మేం డిమాండ్ చేసినా ఎందుకు చేయలేదు? ఈ ఘటపై ముగ్గురు పోలిసు అధికారులని ఎస్పీ సస్పెండ్ చేయడం వాస్తవం కాదా? పోలీసుల తప్పులేకపోతే ఎందుకు సస్పెన్షన్ వేటు వేశారో చెప్పాలి? చనిపోయిన వ్యాపారి కుటుంబానికి ఎవరు అండగా నిలబడతారు? బెల్లం అమ్మడం తప్పా? అదేమైనా విషమా? ఎందుకు వ్యాపారస్థులని జగన్ రెడ్డి ఇబ్బందులకు గురి చేస్తున్నారు? మేం ఎన్నిసార్లు హెచ్చరించినా జగన్ రెడ్డి తన వైఖరి మాత్రం మార్చుకోవడం లేదు. వ్యాపారస్థుల పై వైసీపీ ప్రభుత్వ వేధింపులకు నిరసనగా తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 17న విజయవాడలో నారా లోకేష్ సమక్షంలో వ్యాపారస్ధుల ఆత్మీయ సమావేశం నిర్వహించబోతున్నాం.

ఆ సమావేశంలో జగన్ రెడ్డి వ్యాపారస్థులని ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నాడో ప్రజల కళ్ళకు కట్టినట్టు చూపిస్తాం. వ్యాపారులు అనే వారు ట్యాక్స్ పేయర్స్ . వాళ్లు ట్యాక్స్ లు కడితేనే జగన్ రెడ్డి బటన్ నొక్కడానికి నిధులు వస్తున్నాయని గుర్తుంచుకోవాలి. ఇప్పటి వరకు వ్యాపారుల దగ్గర నుంచి అక్రమంగా జే ట్యాక్స్ లు వసూలు చేసినవారు మీడియా ముందుకు వచ్చి క్షమాపణ చెప్పాలి. లేకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. వైసీపీ నాయకులు పొద్దున లేస్తే లోకేష్ ని విమర్శిస్తున్నారు. లోకేష్ పేరు పలకనిదే వాళ్లకు నిద్ర పట్టడం లేదు.టీడీపీ, చంద్రబాబు నాయుడు, లోకేష్ కి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి తాడేపల్లి ప్యాలెస్ లోని నాయకులు భయంతో వణికపోతున్నారని డూండి రాకేష్ అన్నారు.

Leave a Reply