Suryaa.co.in

Andhra Pradesh

మద్యం దుకాణాల్లో వేలకోట్ల సొమ్ముని జగన్ ప్రభుత్వ ఖజానాకు చేరకుండా కొల్లగొడుతున్నాడు

– కేవలం మూడేళ్లలోనే రూ.90వేలకోట్లు ప్రజలనుంచి దండుకున్నాడు. సారా, కల్తీమద్యంతో బలైనవారి కుటుంబాలకు ఎల్జీపాలిమర్స్ దుర్ఘటనలో ఇచ్చినట్లే, ముఖ్యమంత్రి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి.
• ప్రజలసొమ్ము పక్కదారిపట్టకుండా అంతా ప్రభుత్వఖజానాకే చేరుతుందని ముఖ్యమంత్రి చెప్పగలడా?
• మద్యందుకాణాల్లో డిజిటల్ చెల్లింపులకు ఈప్రభుత్వం, ముఖ్యమంత్రి ఎందుకు అనుమతివ్వడం లేదు?
• నాసిరకం మద్యం అమ్ముతోందికాక, ప్రజలనుంచి దోచుకుంటున్న సొమ్ముని ప్రభుత్వపరం కాకుండా ముఖ్యమంత్రి మింగేస్తేఎలా?
• ప్రజలకు అమ్ముతున్న కల్తీ మద్యాన్ని వైసీపీఎమ్మెల్యేలు, మంత్రులు, ఆ పార్టీ నేతలు తాగుతారా?
• జేబ్రాండ్స్ పేరుతో విక్రయిస్తున్న నాసిరకం మద్యంతయారీ, అమ్మకాలపై శ్వేతపత్రం విడుదలచేయగల దమ్ము ముఖ్యమంత్రికి ఉందా?
– టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీ.వీ.రెడ్డి

రాష్ట్రవ్యాప్తంగా జేబ్రాండ్స్ పేరుతో సాగుతున్న కల్తీమద్యం అమ్మకాలు నాటుసారాతయారీ, అమ్మకాలు, వాటిపై వస్తున్న ఆదాయవివరాలకు సంబంధించిన పూర్తివాస్తవాలతో శ్వేతపత్రం విడుదలచేయగల దమ్ము, ధైర్యం ముఖ్యమంత్రికి ఉన్నాయా అని టీడీపీ జాతీయఅధికారప్రతినిధి జీ.వీ.రెడ్డి పత్రికాముఖంగా నిగ్గదీశారు.శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

కల్తీమద్యానికిబలైనవారి కుటుంబాలకు ఎల్జీపాలిమర్స్ దుర్ఘటనలోఇచ్చినట్టే ప్రభుత్వంతరుపున కోటిరూపాయల పరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం. తనకు చెడ్డపేరురాకూడదన్న దురుద్దేశంతోనే నాటుసారా మరణాలను సహజమరణాలంటున్నాడు. నాటుసారామరణాలు సహజమరణా లే అయితే ముఖ్యమంత్రిసభలో టీడీపీసభ్యులప్రశ్నలకు ఎందుకు సమాధానంచెప్పలేకపోయాడు?
సభలో నాటుసారా, మద్యం అం శాలుచర్చకేరాకుండా టీడీపీసభ్యులను ఎందుకు బయటకు పం పించాడు? రాష్ట్రంలోని మద్యందుకాణాల్లో డబ్బే ఎందుకుతీసుకుంటున్నారో, క్యాష్ లెస్ చెల్లింపులకు ఎందుకు అనుమతిఇవ్వడంలేదోకూడా ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి.

మద్యంవిక్రయాలతో వేలకోట్లుటర్నోవర్ చేస్తూ క్యాష్ లెస్ లావాదేవీలు జరపకపోవడం వెనుక ప్రజలనుంచి ఈ ప్రభుత్వం దోచుకుంటున్న వేలకోట్లసొమ్ము నేరుగా అధికారపార్టీనేతల జేబుల్లోకి వెళుతోంది.
ఒక్కమాటలో చెప్పాలంటే ముఖ్యమంత్రికే చేరుతోందన్నది ప్రజలకుఉన్నఅనుమానం. ప్రభుత్వఖజానాకు చేరాల్సిన సొమ్మంతా ముఖ్యమంత్రి ఖజానాకు చేరుతోందనే వాస్తవాన్ని ప్రజలంతాకూడా అంగీకరిస్తున్నారు. మరి మద్యందుకాణాల్లో నగదుచెల్లింపులకే ఎందుకుప్రాధాన్యత ఇస్తున్నారన్న సందేహాలపై ముఖ్యమంత్రి తక్షణమే స్పందించాలి.

ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి బుద్ధిలేకనే మద్యం అమ్మకాలతో ప్రభుత్వాన్నినడిపిస్తున్నాడా?ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బుద్దిఉన్నవాడెవడైనా మద్యపాననిషేధం చేస్తాడని చెప్పినజగన్ రెడ్డి, ఇప్పుడు ఎందుకు బుద్ధిలేని పనులు చేస్తున్నాడు? నాసిరకంమద్యాన్ని కల్తీసారాని అధికధరకువిక్రయిస్తూ ఎందుకు ప్రజలప్రాణాలు తీస్తున్నాడు? ఆడవారి తాళిబొట్లు తెగుతున్నాయని గతంలో గగ్గోలుపెట్టిన జగన్ రెడ్డి, ఇప్పుడు అవేతాళిబొట్లుతెంపుతూ, తనఖజానా ఎందుకు నింపుకుంటున్నాడో ఆయనే సమాధానం చెప్పాలి.

యథేచ్ఛగా రాష్ట్రంలో నాసిరకంమద్యం అమ్ముతున్న ముఖ్యమంత్రి అట్టహాసంగా ప్రచారంచేసుకొని మరీ మద్యపానవిమోచనకమిటీని ఎందుకు తీసుకొచ్చాడు? తమప్రభుత్వం విక్రయిస్తున్న మద్యాన్ని తాగవద్దని దానివల్ల ప్రాణాలుపోతాయని ప్రజలకుచెప్పలేని కమిటీతో ఎవరికి ఎలాంటిప్రయోజనం కలుగుతుందో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి?

ఏనాడైనా జగన్ రెడ్డి తన సాక్షిపత్రిక ద్వారా గానీ, తనకు తానుగా గానీ మద్యంతాగవద్దని ప్రజలకు చెప్పాడా? కనీసం పత్రికలు, ప్రసారమాధ్యమాల్లో ఒకచిన్నప్రకటన అయినా ఇచ్చాడా? టీడీపీప్రభుత్వంలో ఐదేళ్లలో మద్యంఅమ్మకాలపై రూ.40వేలకోట్లువస్తే, జగన్మోహన్ రెడ్డికేవలం మూడేళ్లల్లోనే రూ.90 వేల కోట్లు కొల్లగొట్టాడు.

రాష్ట్రంలో పేదలను బలితీసుకుంటున్న నాసిరకం మద్యాన్ని వైసీపీఎమ్మెల్యేలు, మంత్రులు పొరపాటునకూడా తాగరు. వారేకాదు వారి బంధువులు, అనుచరులు ఎవరూతాగరు. ఎందుకంటే అదీకల్తీమద్యమని ప్రాణాలుహరిస్తుందని వారికి తెలుసు కాబట్టి.

ప్రజలు ఛస్తే చచ్చారు..మాకేంటి..మా ఖజానా నిండితే చాలన్నట్టు ముఖ్యమంత్రి, వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న మద్యంఅమ్మకాలు, మద్యంతయారీవివరాలపై శ్వేతపత్రం విడుదలచేయగల దమ్ము ముఖ్యమంత్రికి ఉంటే తక్షణమే విడుదలచేయాలని డిమాండ్ చేస్తున్నాం.

LEAVE A RESPONSE