– వైద్య విద్య సీట్ల వేలంపాటతో దళిత, బీసీ, మైనారిటీ విద్యార్థుల జీవితాల్ని చిద్రం చేస్తున్నాడు
• లాభం, అవినీతికోసం దళిత, బీసీ, మైనారిటీ విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆశల్ని చిదిమేస్తున్నాడు
• ఎన్.ఆర్.ఐ, మేనేజ్ మెంట్ కోటా పరిధిలోని సీట్లధరను రూ.12, రూ.20లక్షలుగా నిర్ణయించి వేలంపాట పెట్టాడు
• ప్రజలపై వేలకోట్లభారంవేస్తూ, లక్షలకోట్ల అప్పులు తెస్తున్న జగన్ రెడ్డి, పేద, మధ్యతరగతివర్గాలకోసం రూ.7వేలకోట్లు పెట్టలేడా?
• వైద్యవిద్య సీట్లను అంగడిసరుకుగా మార్చిన జగన్ రెడ్డిని మించిన పెత్తందారు ఎవరూ ఉండరు
• సీట్ల అమ్మకంద్వారా జగన్ రెడ్డి సాగిస్తున్న నయాదోపిడీ కుహన మేథావులు, జాతిరక్షకులు, ప్రజాసంఘాలకు కనిపించడంలేదా?
– మాజీ శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్
ప్రభుత్వ వైద్యకళాశాలల్లో సీట్ల అమ్మకానికి తెరలేపిన జగన్ రెడ్డి, నయా దోపిడీకి శ్రీకారం చుట్టాడని, రాష్ట్రంలో కొత్త మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమం త్రి చెప్పడం వెనకున్న దాగిన అసలు వ్యవహారం చూస్తే ఎవరైనా నోళ్లు వెళ్లబెట్టాల్సిందేనని టీడీపీ సీనియర్ నేత, మాజీ శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్రకుమార్ తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
“ దేశంలో వెలుగుచూసిన 2 జీస్కామ్, గడ్డికుంభకోణం వాటిని తలదన్నేలా జగన్ కుంభకోణాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. తన లాభం, అవినీతికోసం పేద, మధ్యతరగతి విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆశల్ని జగన్ శాశ్వతంగా నీరుగార్చేందు కు సిద్ధమయ్యాడు. పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన బడుగు, బలహీన విద్యార్థు లకు దక్కాల్సిన మెడికల్ సీట్లను అంగడిసరుకుగా మార్చిన జగన్ రెడ్డిని ఏమనాలో, ఏం చేయాలో ప్రజలే నిర్ణయించుకోవాలి.
నా ఎస్సీలు, నాఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలనే జగన్ నిస్సిగ్గుగా మెడికల్ సీట్ల వేలంతో, ఆయా వర్గాలనే ముంచేస్తున్నాడు
కష్టపడి, అప్పులుచేసి తమపిల్లల్ని డాక్టర్లను, ఇంజనీర్లను చేయాలని కలలుగనే తల్లి దండ్రుల ఆశల్ని జగన్ సజీవంగా పాతిపెడుతున్నాడు. పేదలకు ఉచితంగా వైద్యం అందించాల్సిన ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లోని వైద్యవిద్య సీట్లను జగన్ అమ్మకానికి పెట్టాడు. ప్రైవేట్ కాలేజీల తరహాలోనే ప్రభుత్వ కాలేజీల్లోని బీ కేటగిరీ సీట్లను ఎన్.ఆర్ .ఐ కోటా, మేనేజ్ మెంట్ కోటా పేరుతో 50శాతం సీట్లను జగన్ రెడ్డి అమ్మకానికి పెట్టాడు.
ఈ నిర్ణయం ముమ్మాటికీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలతోపాటు అగ్రవర్ణాల్లోని పేదవిద్యార్థుల పాలిట గొడ్డలిపెట్టు అనే చెప్పాలి. ప్రతిసభలో తాను పేదవాడినని, పేదలపక్షమని, నా ఎస్సీలు, నాఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అనిచెప్పుకునే జగన్మోహన్ రెడ్డి నిస్సిగ్గుగా ఆయవర్గాలకు తీరని అన్యాయం చేస్తున్నా డు. జగన్ రెడ్డి నిర్ణయంతో ప్రతిభ, రిజర్వేషన్ల ఆధారంగా గతంలో లభించే వైద్యవిద్య సీట్లు ఇకపై లభించవు. జగన్మోహన్ రెడ్డి అత్యాశ, దోపిడీ ఆలోచనతో తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వేలాదిమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు 50శాతం సీట్లు కోల్పోయి, తీవ్రంగా నష్టపోనున్నారు.
మెడికల్ సీట్ల అమ్మకంకోసమే జగన్ ప్రత్యేకంగా ఏపీమెర్క్ కార్పొరేషన్ పెట్టాడు
మెడికల్ సీట్ల అమ్మకానికే వైసీపీప్రభుత్వం ప్రత్యేకంగా ఏపీ మెర్క్ అనే కార్పొరేషన్ ఏర్పాటు చేయడం దారుణాతి దారుణం. పేదలకు, పెత్తందారులకు యుద్ధం జరుగుతోం దని చెబుతున్న జగన్ రెడ్డి బీసీలు, మైనారిటీలు, దళిత విద్యార్థులకు దక్కాల్సిన వైద్యవిద్య సీట్లు అమ్ముకోవడం ఏ కోవకు వస్తుందో సమాధానం చెప్పాలి. జగన్ నిర్ణ యం పూర్తిపెత్తందారీ పోకడలకు నిలువెత్తు నిదర్శనంకాదా? ప్రభుత్వ కళాశాలల్లో మేనేజ్ మెంట్ కోటా కింద ఉండే బీ కేటగిరీ వైద్యవిద్య సీట్ల ధరను ఈ ప్రభుత్వం రూ.12 లక్షలుగా, ఎన్.ఆర్.ఐకోటా కింద సీట్లను రూ.20లక్షలుగా నిర్ణయించింది.
12, 20 లక్షలు కట్టి సీట్లు కొని, నాలుగేళ్లపాటు ఇతరఖర్చులన్నీ భరించి వైద్యవిద్య పూర్తి చేసే స్తోమత పేద, మధ్యతరగతి వర్గాలకు ఉంటుందా అని జగన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాం. పేదలపక్షపాతి అనే వాడు ఎవడైనా పేదలకు అన్యాయం చేసేలా ఇలాంటి నిర్ణయం తీ సుకుంటాడా? దేశంలో ఎక్కడాలేని విధంగా జగన్ ఒక్కడే ప్రభుత్వ మెడికల్ కళాశాల ల్లోని వైద్యవిద్య సీట్లను అమ్మకానికి పెట్టాడు. గతంలో 100శాతం సీట్లను నామమాత్రపు ధరలతో భర్తీచేసేవారు. కానీ ఇప్పుడు జగన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో అధికారి కంగానే ప్రభుత్వ కళాశాలల్లోని మెడికల్ సీట్లను గంపగుత్తగా అమ్మేస్తారు.
750 సీట్లలో దళిత, బీసీ, మైనారిటీలకు అంతిమంగా దక్కేది 125 మాత్రమే
ప్రభుత్వ నివేదికల ప్రకారం, నేషనల్ మెడికల్ కమిషన్ రాష్ట్రంలో ప్రారంభమైన 5 మెడికల్ కళాశాలలకు కలిపి 750 సీట్లు కేటాయించింది. ఈ మొత్తం సీట్లలో 375 సీట్లు బీకేటగిరీ, ఎన్.ఆర్.ఐ కోటా కిందకు వెళ్తే, ఆలిండియా కోటా కిందకొన్ని సీట్లు పోతే, అంతిమంగా దళిత, బీసీ, మైనారిటీ వర్గాలకు దక్కే సీట్లు అరకొరే. 325 దక్కా ల్సిన చోట, కేవలం 125మాత్రమే దక్కే పరిస్థితి. ఆ 125 సీట్లను దక్కించుకోవడానికే ఆయావర్గాల్లోని విద్యార్థినీ విద్యార్థులందరూ పోటీపడాలి. వారిమధ్య ఏర్పడే పోటీని మరింత పెంచి, సొమ్ముచేసుకోవాలనే ఎత్తుగడ కూడా ఈ ప్రభుత్వం చేస్తోంది. వారితో పాటు మెరిట్ విద్యార్థులు కూడా సీట్లు నష్టపోనున్నారు.
మెడికల్ సీట్ల అమ్మకంతో అన్ని వర్గాలకు జగన్ చేస్తున్న ద్రోహం కుహన మేథావులు, జాతి రక్షకులమని చెప్పుకున్న వాళ్లకు కనిపించడంలేదా?
గతంలో చంద్రబాబు నిర్ణయాలను విమర్శించిన కొందరు కుహానా మేథావులకు ఇప్పుడు జగన్ తీసుకున్న నిర్ణయం కనిపించడంలేదా? వారంతా కళ్లకు గంతలు కట్టుకొని జగన్ విసిరిన పదవుల్ని అనుభవిస్తున్నారు. మేథావివర్గం ముసుగులో టీడీపీ ప్రభుత్వం తీసుకున్న ప్రజాహిత నిర్ణయాలను తప్పుపట్టిన జస్టిస్ ఈశ్వరయ్య, అజయ్ కల్లం, జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి, రిటైర్డ్ ఐ.ఏ.ఎస్ శామ్యూల్, విజయ్ బాబులాంటి వాళ్లు ఎక్కడున్నారు? కావాలనే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంపై విమర్శలుచేసి, జాతికోసం పనిచేస్తున్నామని చెప్పుకున్నవారికి, నేడు జగన్ తమజాతులకు చేస్తు న్న ద్రోహం కనిపించడంలేదా?
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇంత అన్యాయం జరుగుతుంటే, ఈ మేథావులు ఇప్పుడెందుకు నోరెత్తడంలేదు? ఎక్కడో తెలంగాణలో ఉండే ఆర్.కృష్ణయ్య జగన్ పంచనచేరి, ఆయనకు వత్తాసుపలికి, తాను బీసీల నాయకుడినని తనజాతిని నమ్మించి, రాజ్యస భ పదవి పొంది కనిపించకుండా పోయాడు. అదే వ్యక్తికి ఇప్పుడు జగన్ రెడ్డి బీసీ విద్యార్థులకు చేస్తున్న తీరని ద్రోహం కనిపించడంలేదా? బలహీనవర్గాల ప్రతినిధులమ మని, వారిని ఉద్ధరిస్తున్నామని చెప్పుకునేవాళ్ల నోళ్లు ఇప్పుడెందుకు మూతపడ్డా యి?
ఐ.ఏ.ఎస్ అధికారులుగా ఉన్నవారు తమవర్గాలకు జరిగే అన్యాయంపై ఎందుకు పెదవి విప్పడంలేదు? అలానే మంత్రులు, ఉపముఖ్యమంత్రులుగా ఉన్న దళిత నేత లు తమజాతికి జరిగే అన్యాయంపై జగన్ ను ఎందుకు నిలదీయలేకపోతున్నారు? దళిత, బీసీ, మైనారిటీ ప్రజాసంఘాలు తమవర్గాల విద్యార్థులకు జరిగే అన్యాయంపై ఎందుకు స్పందించడంలేదు? ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ సృష్టించి మరీ జగన్ రెడ్డి, మెడికల్ సీట్లు అమ్ముకుంటుంటే జాతిరక్షకులు, కుహనా మేథావులు, ప్రజాసంఘనేత లు నిద్రపోతున్నారా?
వైద్యవిద్య సీట్ల అమ్మకానికి సంబంధించిన జీవోలను తక్షణమే రద్దుచేయాలి
750 మెడికల్ సీట్లలో అన్నికోటాలు పోగా, ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో మిగిలే అరకొర సీట్లను తనప్రభుత్వంలోని వారు, తాము నియమించిన వారే బహిరంగంగా వాటిని అమ్మకానికి పెడతారు. అందుకోసమే ప్రభుత్వం వైద్యవిద్య సీట్ల అమ్మకానికి జీవో తీసుకొచ్చినట్టు అర్థమవుతోంది. గతంలో 1983లో ఎన్టీఆర్ పేద, మధ్యతరగతి వర్గాలకు అండగా నిలవడంకోసం క్యాపిటేషన్ ఫీజును రద్దుచేశారు. ఇప్పుడు జగన్ రెడ్డి ఏకంగా ఫీజులతో పనిలేకుండా మెడికల్ సీట్లనే అమ్మకానికి పెట్టాడు.
దళిత, బీసీ, మైనారిటీ వర్గాల్లోని ప్రతిభావంతులైన విద్యార్థుల జీవితాల్ని నిప్పుల్లోకి నెట్టేస్తున్నా డు. వైద్యవిద్య సీట్ల అమ్మకానికి సంబంధించి ఇచ్చిన జీవోలను తక్షణమే ఉపసంహా రించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రతిభ, రిజర్వేషన్ ప్రాతిపదికన అర్హులై న వారికి మెడికల్ సీట్లు లభించేలా, ప్రవేశాలు జరిగేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్య త జగన్ రెడ్డిపైనే ఉంది.
విలేకరులు ప్రశ్నలకు ధూళిపాళ్ల స్పందన..
ఏపీ మెర్క్ అనే కార్పొరేషన్ సృష్టించి దానిద్వారా మెడికల్ సీట్ల ఫీజులు, ఇతరసొమ్ము దానికి వచ్చేలా ఏర్పాటుచేశారు. విద్య, వైద్యం అనేవి ప్రజలకు అందించే తాహతు ప్రభుత్వానికి లేదా? వేలకోట్ల ఆదాయం వస్తోంది…లక్షలకోట్ల అప్పులు తెస్తున్నారు. మెడికల్ కళాశాలల నిర్మాణానికి రూ.7వేలకోట్లు ఖర్చయితే, ఆ సొమ్ముని ఇలా రాబ ట్టుకోవాలని చూస్తారా?
బీసీ, దళిత, మైనారిటీ వర్గాలకోసం జగన్ రెడ్డి రూ.7వేలకోట్లు ఖర్చుపెట్టలేడా? 17 వైద్యకళాశాలలు ఏర్పాటుచేస్తే, వాటిలో 5 కళాశాలలకే 750 సీట్లు వస్తే, భవిష్యత్ లో వచ్చే సీట్లు ఎన్ని? అన్నీ అమ్మేయడమే ధ్యేయంగా పెట్టుకు న్నారా? లక్షలకు లక్షలు పోసి వైద్యవిద్య సీట్లుకొని, చదువు పూర్తిచేసేవారు, భవిష్యత్ లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు నాణ్యమైన, మెరుగైన వైద్యసేవలు అందిస్తారా?” అని నరేంద్ర ప్రశ్నించారు.