చాలామంది తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తుంటారు.. రూమ్ తీసుకోవటం..దర్శనం చేసుకోవడం.. ప్రసాదాలు తీసుకోవడం.. మొక్కులు తీర్చుకోవడం తిరుగు ప్రయాణం అంతే..
కానీ తిరుమల కొండమీద నంది సర్కిల్ దగ్గర లేపాక్షి ఎంపోరియం పక్కనే, టిటిడి వారి వెంకటేశ్వర ఆయుర్వేద వైద్య ఆసుపత్రి ఉంటుంది ఇక్కడ చాలా రకాలైన ధీర్ఘకాలిక రోగాలకు చక్కని ఆయుర్వేద మందులు ఉచితంగా లభిస్తాయి..ఇదే పేరుమీద బయట కూడా దొరుకుతాయి కానీ. ఈ టిటీడి ఆయుర్వేద మందుల క్వాలిటీ రాదు. ఎందుకంటే వీరి మందులు తయారు చేసే ఫార్మసీ సొంతంగా ఉంది శ్రీనివాస మంగాపురం వెళ్లేదారిలో..అడవిలో మూలికలు సేకరించి ఇవి తయారు చేస్తారు.
అలిపిరి దగ్గర ఆయుర్వేద హాస్పిటల్ కూడా ఉన్నది.. ఇక్కడ రకరకాల దీర్ఘకాలిక రోగాలకు ఉచితంగా వైద్యం, మందులు కూడా ఉచితమే.. గతంలో నాకు శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు ఉండేవి వర్షం వచ్చేముందు, ఎవరైనా సిగరెట్ తాగిన.. అగర్బత్తి, సాంబ్రాణి పొగాకు విపరీతమైన తుమ్ములు ఊపిరి పీల్చటం కష్టంగా ఉండేది.. నేను గత 15 సంవత్సరాల నుండి ఈ ఆయుర్వేద ఫార్మసీలు తయారుచేసిన మందులు వాడుతూనే ఉంటాం..కొన్ని మందుల తయారీ చాలా ఖర్చుతో కూడినది అవ్వడం వల్ల తయారీ ఆపేశారు..నాకు మాత్రం స్వామి దయతో…
ఈసారి మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పనిసరిగా ఈ వైద్యశాల సంప్రదించండి..బ్రహ్మోత్సవాల సమయంలో పాపనాశం వెళ్ళేదారిలో,మరి కొన్నిచోట్ల ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు..
ఉదాహరణకు జీవన్ ధారా అనే మందు టీటీడీ వారిది…బయట దొరికే మందుకు అస్సలు సంబంధం ఉండదు..అలాగే రూమా బామ్ అని మందు తయారీ దేవస్థానం వారు ఆపేశారు.దాని ఖర్చు భరించలేక.. నాకు మాత్రం….నా దగ్గర ఉన్న మందుల ఫోటోలు పెట్టలేని పరిస్థితి..
దయచేసి మీ ఇంట్లో పెద్దవారు ఉంటే ఈసారి కొండ మీద హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళి అప్పుడు చెప్పండి.
1. కొండ మీద లేపాక్షి ప్రక్కనే ATM ప్రక్కనే..arrow mark చేశాను.
2. అలిపిరి దగ్గర ఆసుపత్రి ఇక్కడ out patient మరియు in patient ద్వారా వైద్యం అందిస్తారు.
3. శ్రీనివాసమంగాపురం రోడ్డులో తయారీ కేంద్రం.
సేకరణ