Suryaa.co.in

Andhra Pradesh

ఎంత మంది వృద్ధులను బలి తీసుకుంటారు జగన్ రెడ్డి.?

– పెన్షన్ దారుల మరణాలకు జగన్ రెడ్డే కారణం
– తొలగించిన 3 లక్షల పెన్షన్లను పునరుద్ధరించాలి
– లేదంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి మరోసారి శ్రీకారం
– టీడీపీ శాసన సభ్యులు బెందాళం అశోక్
అర్హులైన వయోవృద్ధులకు పెన్షన్ దూరం చేయడమే రెండేళ్లలో జగన్ రెడ్డి సాధించిన ప్రగతి. కుంటి సాకులు చెప్తూ వృద్ధులకు, వితంతువులకు పెన్షన్ ఇవ్వడానికి చేతకాక జగన్ రెడ్డి చేతులెత్తేశారు. రాష్ట్రలో ఈ నెల 3 లక్షల పెన్షన్లను తొలగించారు. వచ్చే నెల మరో 4 లక్షల పెన్షన్లు తొలగించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అవసరాల రిత్యా పక్క రాష్ట్రాలకు వెళ్లిన వారికి పెన్షన్ ఎందుకు ఇవ్వాలని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం దుర్మార్గం.
వివిధ అవసరాల రిత్యా పక్క ప్రాంతాలకు వెళ్లడం సహజం. పక్క రాష్ట్రాలకు చెందిన వారిని సలహాదారులగా తీసుకొచ్చి లక్షల కొద్ది జీతాలు ఇస్తున్నప్పుడు ఏపీకి చెందిన వారు అత్యవసర పనుల కోసం వెళ్లిన వారికి పెన్షన్ ఎందుకు ఇవ్వరు.? పక్కరాష్ట్రాల్లో ఉన్నవారిని ఎన్నికలప్పుడు బస్సుల్లో తీసుకొచ్చి ఓట్లేయించినప్పుడు తెలియదా.? 28 నెలలుగా గుర్తురాని అనర్హత ఇప్పుడే గుర్తొచ్చిందా.? పెన్షన్ రాదన్న ఆవేదనతో 12 మంది మృతి చెందారు. ఇవి ప్రభుత్వ హత్యలుగానే భావించాలి. జీవిత షర్మాంకంలో ఉన్న వృద్ధులను ప్రభుత్వం వేధిస్తోంది.
మందులు, ఆరోగ్య అవసరాలకు ఉపయోగించుకునే పెన్షన్ ను తీసేయడం జగన్ రెడ్డికే చెల్లింది. మందులకు డబ్బులు లేక ఇప్పుడు నానా ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధుల, వితంతువుల ఉసురు కొట్టుకుపోతారు. చంద్రబాబు అందించిన రూ.5ల అన్నం తిని కుటుంబాలను నడుపుకున్నారు. ఇప్పుడు అన్న క్యాంటీన్లు కూడా లేకుండా చేశారు. పెంచుకుంటూ పోతానని చెప్పి.. అర్హుల తొలగింపును పెంచుకుంటూ పోతున్నారు. ఏడాదికి ఒకసారి పెంచుతానన్న పెన్షన్ పెంచకపోవడం వల్ల ఒక్కో పెన్షన్ దారుడు రూ.3,250 నష్టపోయారు. పెన్షన్ల మీద ఆధారపడే వారిని ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోంది. మీ మోసకారి సంక్షేమానికి రాష్ట్ర ప్రజలు బలైపోయారు. గాలి కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజల్ని నయవంచనకు గురి చేస్తున్నారు. తొలగించిన పెన్షన్లు పునరుద్ధరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి ఆందోళనలు నిర్వహించి మీ చేతకాని తనాన్ని నడివీధుల్లో ఎండగడతాం.

LEAVE A RESPONSE