– రాష్ట్ర టిడిపి ఎస్టీ సెల్ అధ్యక్షుడు ఎం. ధారు నాయక్
సి.ఎం గా జగన్‌రెడ్డి పదవి చేపట్టి 52 నెలలు గడుస్తున్న ఆయన గిరిజనులకు చేసింది సున్నా అంటూ.. గిరిజన సంక్షేమంపై జగన్‌రెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ధిలేదని రాష్ట్ర టీడీపీ ఎస్టీ సెల్ అధ్యక్షులు ఎం. ధారు నాయక్ వైకాపా ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. విశాఖ రాజధాని పేరుతో ఉత్తరాంధ్ర గిరిజన సంపదను దోచుకోవాలని వైకాపా అధినాయకత్వం చూస్తున్నారంటూ ధారు నాయక్ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
రాజధాని విశాఖకు తరలించి ఉత్తరాంధ్రలో ఉన్న గిరిజన సంపదను జగన్ రెడ్డి తన బినామీలు ద్వారా కొల్లగొట్టాలని చూస్తున్నారు. అందుకే రాజధానిని విశాఖకు తరలించాలని జగన్ రెడ్డి ఉర్రూతలూగుతున్నాడు. ఇప్పటి వరకు మైదాన ప్రాంతాన్ని కొల్లగొట్టిన జగన్ రెడ్డి ఇకపై ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన సంపదను దోచుకోవాలని ప్రణాళిక సిద్దం చేశారు. అందుకే లక్షలాధి గిరిజన భూములను పంప్డ్ హైడ్రో పవర్ ప్రాజెక్టుల పేరుతో ఇప్పటికే తన బినామీలకు పంచిపెట్టాడు.
ఏజెన్సీ కొండప్రాంతాల కోసం 108 అంబులెన్సుల పేరుతో లక్షలాధి రూపాయలు దోచుకున్నారు. ఏజెన్సీ ప్రాంత గ్రామాలకు రోడ్లు వేయకపోవడంతో నిండు గర్బిణీలు ఫీడర్ అంబులెన్సులు ఉన్నా డోలీలలో దవాఖానలకు తీసుకెళ్లే పరిస్థితి వైకాపా ప్రభుత్వంలో ఎక్కువైంది. ఏజెన్సీ ప్రాంతాలను గంజాయి హబ్‌గా మార్చి గిరిజన యువత భవితను దెబ్బతీస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా జగన్‌రెడ్డి ప్రభుత్వం గిరిజనుల అస్థిత్వంపైనే దెబ్బగొడుతున్నారు.
ఏజెన్సీ ప్రాంతాల పరిధిని తగ్గించే కుట్ర రాష్ట్రంలో జరుగుతున్నది. గిరిజన ప్రాంతాలను ఎందుకు తగ్గించారని ఇటీవల హైకోర్టు సైతం జగన్ రెడ్డి ప్రభుత్వానికి మొటిక్కాయలు వేయడం జరిగింది. 1/70 లాంటి చట్టాలను జగన్ రెడ్డి ప్రభుత్వం తుంగలో తొక్కుతోంది.