• ముఖ్యమంత్రి తీరుపై, వైసీపీవ్యవహారశైలిపై ముస్లిం సమాజం తీవ్రఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తోంది.
• పవిత్రమైన మతాన్ని అగౌరవపరిచిన వారు ముమ్మాటికీ క్షమార్హులుకారు.
• అధికారబలం, రౌడీయిజం, పోలీసులతో ఏమైనా చేయవచ్చనుకుంటున్న వారి ఆటలుఎల్లకాలం సాగవు.
– మాజీ శాసనసభ్యులు జలీల్ ఖాన్
మంగళగిరిసమీపంలోని నంబూరులో మదర్సాకమిటీ హజ్ యాత్రకు వెళ్లేవారికి ఏర్పాట్లు చేసిందని, కమిటీవారి ఆహ్వానంతో టీడీపీ అధినేత చంద్రబాబు అక్కడికి వెళ్లి, హజ్ యాత్రకువెళ్లేవారికి శుభాకాంక్షలుచెప్పారని, కానీ అక్కడి మసీదుని, ఆ వాతావరణాన్ని వైసీపీవారు తమపార్టీ కార్యక్రమంగా మార్చేశారని, ఆఖరికి మసీదు మీనార్ కు వైసీపీ బెలూన్లుకట్టి ఇస్లాంను అగౌరవపరిచారని టీడీపీనేత, మాజీఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో శనివారం ఆయన టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే ..
చంద్రబాబు నంబూరులో ముస్లింమతపెద్దల ఆశీస్సులుతీసుకొని, హజ్ యాత్రికులతో ప్రేమగా మాట్లాడి, వారికి స్వీట్ ప్యాకెట్లు పంచారు. కానీ జగన్ మొక్కుబడిగా వచ్చి, దూరంనుంచే హాజీలకు చేతులూపి 2నిమిషాలు మాత్రమే అక్కడుండి వెళ్లిపోయారు.
“ నంబూరులో మసీదుని వైసీపీనేతలు తమపార్టీకార్యాలయంగా మారిస్తే, అక్కడికి వెళ్లిన టీడీపీనేతల్ని, ఇతర ముస్లింపెద్దల్ని లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. హజ్ కమిటీ ఆహ్వానంపై అక్కడికెళ్లిన టీడీపీఅధినేత గౌరవమర్యాదలతో వ్యవహరించి, ముస్లింమతపెద్దల ఆశీస్సులుతీసుకొని, కమిటీసభ్యుల్ని, హజ్ యాత్రకువెళ్లేవారిని ప్రేమతో పలకరించి, వారికి శుభాకాంక్షలుచెప్పి, యాత్రకువెళ్లేవారికి స్వీట్ ప్యాకెట్లుఇచ్చి తిరిగొచ్చారు.
ఆయన వెళ్లిపోయాక టీడీపీతరుపున మేంకూడా హజ్ యాత్రకు వెళ్లేవారికి అవసరమైన వస్తువులతోకూడిన కిట్లుపంపిణీచేశాం. చంద్రబాబు అక్కడికి వెళ్లేసమయానికి హజ్ యాత్రికులు అక్కడ ఉండకూడదని వారిని అటురండి …ఇటురండి అని మైకుల్లో చెప్పించారు.
కానీ జగన్మోహన్ రెడ్డి దూరంనుంచే హాజీలకు చేతులూపి వెళ్లిపోయారు. ముఖ్యమంత్రిగాఉన్నవ్యక్తి హజ్ యాత్రకువెళ్లేవారికి అరలీటర్ మంచినీళ్ల బాటిల్ కూడా ఇవ్వలేదు. కేవలం 2 నుంచి 3నిమిషాలు మాత్రమే అక్కడున్నజగన్, ఏదోమొక్కుబడిగా వచ్చాననిపించి, వెళ్లిపోయాడు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ జగన్ ముస్లింలపై వివక్షచూపుతున్నాడు. చంద్రబాబు ముస్లిం మైనారి టీలకోసం ప్రకటించిన అనేకపథకాల్ని నిర్దాక్షణ్యంగా రద్దుచేశాడు.
చంద్రబాబు కడపలో, హైదరాబాద్ లో హజ్ హౌస్ లు నిర్మించారు. విజయవాడలో రూ.140కోట్లతో హజ్ హౌస్ నిర్మాణం ప్రారంభించారు. రాజధానిలో ఇస్లామిక్ సెంటర్ నిర్మాణానికి 20ఎకరాలు కేటాయించారు
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయవాడలో 5ఎకరాల్లో హజ్ హౌస్ నిర్మాణాన్ని ప్రారంభించారు. రూ.140కోట్లు కేటాయించి, పనులుకూడా ప్రారంభిం చారు. హజ్ హౌస్ తో పాటు మస్క్ నిర్మాణానికి కూడా శంఖుస్థాపనచేశారు. ఉమ్మడిరాష్ట్రంలో చంద్రబాబుహాయాంలోనే హైదరాబాద్ లో హజ్ హౌస్ నిర్మాణం చేపట్టారు. విభజనానంతరం ఏపీకి ముఖ్యమంత్రి అయ్యాక కడపలో హజ్ హౌస్ నిర్మించారు. రాజధాని అమరావతిలో హజ్ హౌస్ నిర్మించాలని 5ఎకరాల్లో పను లు ప్రారంభించారు.
అమరావతిలో ఇస్లామిక్ సెంటర్ నిర్మాణానికి 20ఎకరాలు కేటాయించారు. దానినమూనాగా చైనాలో అత్యాధునికహంగులతో నిర్మించిన ఇస్లామిక్ సెంటర్ ను ఎంపికచేశారు. ఇమామ్, మౌజమ్ లకు చంద్రబాబు నెలనెలా ఆర్థికసహా యం చేశారు. చంద్రబాబుపుణ్యమా అని రాష్ట్రంలోని చాలా ఖబరిస్తాన్ లు ఉద్యాన వనాలుగా మారిపోయాయి. చుట్టూప్రహరీలుకట్టి, ఖబరిస్తాన్ లను కబ్జాల నుంచి కాపాడారు. హజ్ యాత్రికులకు సబ్సిడీ ఇచ్చారు. రంజాన్ తోఫాపేరుతో రంజాన్ పండుగకి ముస్లింలకు పండుగసరుకులు అందించారు.
ముస్లిం యువతీయువకులు విదేశాలకు వెళ్లిచదువుకోవడానికి ఒక్కొక్కరికి రూ.10లక్షలసాయం చేశారు. దుల్హన్పథకం కింద ముస్లిం ఆడబిడ్డలకు పెళ్లిసమయంలో రూ.50వేలు అందించారు. దుకాన్-మకాన్ పథకంకింద ముస్లింయువత ఆర్థికంగా నిలదొక్కుకొని వారికాళ్లపై వారు నిలబడేలా ఆర్థికసాయం చేశారు. వేలాదిమంది యువతకు స్వయంఉపాధి రుణాలు అందించారు. ఇలాచంద్రబాబు ముస్లిం మైనారిటీలకు చేసినసంక్షేమం చాలానేఉంది. చంద్రబాబు ఉమ్మడిరాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ లో జరిగే మతకలహాలను అరికట్టి, భాగ్యనగరాన్ని బ్రహ్మండంగా అభివృద్ధి చేశారు.
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రయ్యాక ఒక్కరోజైనా ముస్లింసంక్షేమంపై, చంద్రబాబు హాయాంలో వారికిఅందినపథకాలు, అభివృద్ధిపై సమీక్షచేశాడా?
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబుహాయాంలో ప్రారంభమైన హజ్ హౌస్ నిర్మాణపనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. 4ఏళ్లలో ఒక్కరోజు కూడా జగన్, ముస్లింల పథకాలపై, చంద్రబాబు హయాంలో నిర్మించిన షాదీఖా నాలు, ఖబరిస్తాన్ లు, హజ్ హౌస్ నిర్మాణాలపై సమీక్షచేయలేదు. ఆఖరికి సిగ్గు లేకుండా మసీదులపై వైసీపీజెండాలు, బెలూన్లుకట్టే దుస్థితికివచ్చారు. నంబూరు లోని మసీదు మీనార్ కి వైసీపీబెలూన్లు కట్టడాన్ని ముస్లింసమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఉమ్మడికడపజిల్లాలోని ముస్లింలను ఆర్థికంగా, సామాజికంగా ఎదగనీయకుండా చేసిన జగన్, వారిని తనగులాములుగా మార్చుకున్నాడు. 4ఏళ్లలో జగన్ ఒక్క ముస్లింయువకుడికైనా స్వయంఉపాధి రుణం ఇచ్చాడా?
మసీదుమీనార్ కు వైసీపీబెలూన్లుకట్టి, ముస్లిం మతాన్ని అగౌరపరిచినందుకు ముస్లింలకు ముఖ్యమంత్రి బహిరంగక్షమాపణలు చెప్పాలి. సభ్యత, సంస్కారం, సిగ్గు, లజ్జ ఉంటే ఇస్లాంను అవమానించేలా ఇలాంటివి చేస్తారా?
వైనాట్ 175 అంటున్న జగన్ కు వచ్చేఎన్నికల్లో 17స్థానాలుమాత్రమే వస్తాయి. వైసీపీఓడిపోయే అసెంబ్లీల్లో మొట్టమొదటిటి విజయవాడ పశ్చిమస్థానమే. జగన్ ఏంచేసినా, ఆఖరికి తలకిందులుగా తపస్సుచేసినా ప్రజలుఆయనకు ఓట్లేసే పరిస్థితిలేదు. మసీదుమీనార్ పై వైసీపీబెలూన్లు కట్టినందుకు తప్పుఒప్పుకొని జగన్మోహన్ రెడ్డి ముస్లింసమాజానికి క్షమాపణచెప్పాలి. ముఖ్యమంత్రికి ఏమాత్రం ఇస్లాంపై గౌరవం, ప్రేమఉన్నా వెంటనే ఆయన ముస్లిం సమాజానికి క్షమాపణ చెప్పాల్సిందే.
సభ్యత, సంస్కారం, సిగ్గు, లజ్జఉంటే ఇలాంటిపనిచేస్తారా? ముస్లిం లకు మంచిచేయకపోయినా వారుసహిస్తారుగానీ, ఇలాంటి వెధవపనులు చేస్తేమాత్రం క్షమించరు. పవిత్రమైన మతాన్ని అగౌరవపరిచిన మీరు ముమ్మా టికీ క్షమార్హులుకారు. రౌడీయిజంతో, పోలీస్ బలంతో ఏమైనాచేయవచ్చు అను కుంటే, మీఆటలు సాగవని, ఎన్నాళ్లు, ఎంతమందిపై తప్పుడుకేసులు పెడతారో చూ స్తాం.” అని జలీల్ ఖాన్ హెచ్చరించారు.