-స్మార్ట్ మీటర్లు, ట్రాన్స్ ఫార్మర్ల కాంట్రాక్టులు వైఎస్ అవినాష్ రెడ్డి బినామీ కంపెనీ షిరిడీ సాయికి కట్టబెట్టడంలో రూ.29 వేలకోట్ల కుంభకోణం
-కడపలోని షిరిడీ సాయి కంపెనీ కార్యాలయంలో వైఎస్ అవినాష్ రెడ్డి, ఎస్పీడీసీఎల్ సీఎండీ సమక్షంలోనే డీల్
-దేశంలో స్మార్ట్ మీటర్ విలువ రూ.10 వేల లోపే ఉండగా ఎస్పీడీసీఎల్ పరిధిలో రూ.36,975గా నిర్ణయించడంలో మతలబు ఏమిటి?
-మీటర్ రీడింగ్ భారాన్ని కూడా నెలకు రూ.5.30పైసల నుంచి రూ.153కి పెంచేస్తున్నారు -ఈ.పీ.డీ.సీ.ఎల్ పరిధిలోనూ నామమాత్రపు పోటీతో షిరిడీ సాయికే స్మార్ట్ మీటర్ల కాంట్రాక్ట్ కట్టబెట్టారు
-సీబీఐ రంగంలోకి దిగి గూగూల్ టేకవుట్ ఆధారంగా వివరాలు సేకరిస్తే కడపలో జరిగిన సమావేశాల గుట్టు బయటపడటం ఖాయం. ఈ భారీ స్కామ్ ద్వారా వైఎస్ అవినాష్ రెడ్డి చేతికి వచ్చిన డబ్బు ఏఏ క్రిమినల్స్ చేతికి చేరిందో తేలాల్సి ఉంది
-కేంద్ర ప్రభుత్వం స్పందించి ఐదు కోట్ల ప్రజలను ఈ భారీ స్కామ్ భారం నుంచి విముక్తుల్ని చేయాలని కోరుతున్నాం
-మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
“రాష్ట్రంలో జగన్ రెడ్డి పాలన వచ్చిన తర్వాత మూడు విద్యుత్ డిస్కంల పరిధిలో ట్రాన్స్ ఫార్మర్ల కొనుగోలు, నిర్వహణ, స్మార్ట్ మీటర్ల కొనుగోలులో భారీ స్కాం జరిగింది. ఈ స్కాం కారణంగా ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లడమే గాక ప్రజలపై పెనుభారం పడుతోంది. మూడు డిస్కంలకు కలిపి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.78 వేల కోట్లు చెల్లించాలి. ఇప్పుడు అగ్రికల్చర్ అండ్ డొమస్టిక్ స్మార్ట్ మీటర్ల పేరుతో మరో రూ.29 వేల కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి వస్తోంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి బినామీ అయిన షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీకి కాంట్రాక్టులు అడ్డగోలుగా కట్టబెట్టి దోచిపెట్టడానికి హద్దులు దాటి వ్యవహరించారు.
వ్యవసాయంలో కీలకమైన ట్రాన్స్ ఫార్మర్ల సరఫరాలో ఆలస్యం జరిగితే రైతులు ఇబ్బందులు పడుతారు. ఈ క్రమంలో సరఫరాలో కాంట్రాక్టర్ ఆలస్యం చేస్తే జరిమానా విధించేవారు. గత ప్రభుత్వ హయాంలో రూ.500 కోట్ల పెనాల్టీ విధించారు. వైసీపీ అధికారంలోకి రాగానే ఒక్క షిరిడీ సాయి కంపెనీపైనే పెనాల్టీలను రద్దు చేయడంతో పాటు ట్రాన్స్ ఫార్మర్ రేట్లను అడ్డుఅదుపూ లేకుండా పెంచేశారు.
25 కేవీ ట్రాన్స్ ఫార్మర్ టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.58,569 ఉంటే రూ.1,78,800కి పెంచారు.63 కేవీని రూ.89 వేలు నుంచి రూ.2.54 లక్షలకు, 160కేవీని రూ.2 లక్షలు నుంచి రూ.5.69 లక్షలకు, 315 కేవీ ట్రాన్స్ ఫార్మర్ ను రూ. 5.71 లక్షల నుంచి రూ,16.75 లక్షలకు పెంచారు.ఇలా అడ్డగోలుగా ట్రాన్స్ ఫార్మర్ల ధరలు పెంచి సరఫరా కాంట్రాక్టును ఏకఛత్రాధిపత్యంగా షిరీడీ సాయి చేతిలో పెట్టారు. గతంలో నాలుగు కంపెనీలు ట్రాన్స్ ఫార్మర్లను సరఫరా చేయగా జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక్క షిరిడీ సాయి సంస్థకే ఆ అవకాశం ఇచ్చారు.ట్రాన్స్ ఫార్మర్ల తరహాలోనే ఇప్పుడు స్మార్ట్ మీటర్ల విషయంలోనూ భారీ స్కామ్ కు తెరలేపారు.
ఈ స్మార్ట్ మీటర్ల కాంట్రాక్టులకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని ఆర్టీఐ ద్వారా మూడు డిస్కంల సీఎండీలను కోరితే స్పందించలేదు. నేను విద్యుత్ శాఖ కార్యదర్శిని సంప్రదించించిన తర్వాత, ఒక్క ఈపీడీసీఎల్ అధికారులు కొంత సమాచారం పంపారు. బిడ్డింగ్ లో రెండు సంస్థలే పాల్గొన్నాయని, 2.58 లక్షల అగ్రికల్చర్ సర్వీసులకు పెట్టాల్సిన ఒక్కో మీటరుకు షిరిడీ సాయి సంస్థ రూ.23,647కి, అదానీ కంపెనీ రూ.24,300కి కోట్ చేశాయని పేర్కొన్నారు. అదానీ కంటే షిరిడీ సాయిసంస్థ నామమాత్రంగా రూ.600 తక్కువకు కోట్ చేయడం వెనుక భారీ స్కామ్ దాగివుంది. తిరుపతి, విజయవాడలోని సీఎండీలు ఇంకా స్పందించలేదు.
తిరుపతిలోని ఎస్పీడీసీఎల్ పరిధిలో మేం సేకరించిన సమాచారం ప్రకారం.. ఒక్కో మీటరుకు మెయింటెనెన్స్ తో కలిపి రూ.36,975గా నిర్ణయించారు. ఇంట్లో మీటర్ రీడింగ్ కు నెలకు రూ.153, ఏడాదికి రూ.1840 వినియోగదారుడు అదనంగా భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాణిజ్య, పరిశ్రమ కనెక్షన్లకు నెలకు రూ.241.90 ఏడాదికి రూ.2,903 చెల్లించాల్సిన పరిస్థితి తెచ్చారు.ప్రస్తుతం మీటర్ రీడింగ్ రూ. 5.30 పైసలు ఖర్చు అవుతుండగా దానిని రూ.153కి పెంచబోతున్నారు.
అవినాష్ రెడ్డి బినామీ కంపెనీ అయిన షిరిడీ సాయికి స్మార్ట్ మీటర్ల కాంట్రాక్టు దక్కినందుకు ప్రజలపై పడుతున్న భారమిది. తమ్ముడి కళ్లలో ఆనందం చూడటానికే ఈ భారీ స్కామ్ కు జగన్ రెడ్డి తెరలేపారు. ఆర్టీఐ ద్వారా సమాచారం పొందడం ప్రతి భారతీయ పౌరుడి హక్కు. ఈ విషయంలో ఎనర్జీ సెక్రటరీ విజయానంద్ ఆదేశాలకే దిక్కులేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి?మీటర్ల టెండర్ల విషయంలో భారీ స్కామ్ జరగబట్టే మొత్తం వివరాలను బయటపెట్టేందుకు అధికారులు జంకుతున్నారు.
ఈ కాంట్రాక్టల కేటాయింపు డీల్ మొత్తం కడపలోని షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ కార్యాలయంలోనే జరిగింది.ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎస్పీడీసీఎల్ సీఎండీ ఆధ్వర్యంలో షిరిడీ సాయి ఆఫీసులో సమీక్షలు నిర్వహించి కాంట్రాక్టును వారికి సెటిల్ చేశారు. పక్కా సమాచారంతో మేం ఈ విషయం చెబుతున్నాం. గూగూల్ టేక్ అవుట్ తీస్తే అవినాష్ రెడ్డి, ఎస్పీడీసీఎల్ సీఎండీ, అధికారులు, షిరిడీ సాయి ఎండీ విశ్వేశ్వరరెడ్డిల సమావేశాల గుట్టు మొత్తం బయటపడుతుంది.సీబీఐ విచారణ జరిగేతేనే ఈ కుంభకోణం మొత్తం వెలుగులోకి వస్తుంది.
ఈ కుంభకోణం ద్వారా చేతులు మారిన డబ్బు నేరయమమైన ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో నేరస్తులైన పొలిటికల్ లీడర్ల చేతుల్లోకి పోయిన విషయం సీబీఐ కూపీ లాగితేనే తేలుతోంది. ఈ డబ్బంతా అవినాష్ రెడ్డి చేతుల్లోకి ఎలా చేరింది..ఆయన దగ్గర నుంచి ఎవరెవరికి చెల్లించారు..ఎందుకు చెల్లించారు.. ప్రధానంగా క్రిమినల్స్ కు ఎందుకు చెల్లింపులు జరిగాయనే విషయం బయటకు రావాలంటే సీబీఐ విచారణతోనే సాధ్యం.
ఢిల్లీలో లిక్కర్ స్కామ్ పై నెలల తరబడి విచారణ సాగిస్తూ అరెస్టుల మీద అరెస్టులు చేయిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ఏపీలో రైతులు, ప్రజలను ముంచే భారీ కుంభకోణం కనిపించడం లేదా? ఇప్పటికే డిస్కమ్ లకు రూ.74 వేలు కోట్లు ఉండగా, మళ్లీ ఇప్పుడు రూ.29 వేల కోట్లు భారం వేస్తున్నారు.ఈ అప్పుల భారం ఎవరు భరించాలి?రాజస్థాన్ లో ఒక్కో మీటర్ ను మెయింటెనెన్స్ తో కలిపి రూ.7,945కి ఛండీగర్ లో రూ.9,710గా ఉంటే ఇక్కడ ఎందుకు ఇంత భారం మోపుతున్నారు. ఏపీని జగన్ రెడ్డి ప్రైవేటు లిమిటెడ్ కంపెనీగా భావిస్తున్నారా..రాష్ట్ర ప్రజందరూ మీ కింద బానిసలా..మీరు స్వార్ధంతో తీసుకునే నిర్ణయాలకు పడే భారాన్ని ప్రజలు మోయాలా?తమ్ముడి కళ్లల్లో ఆనందం చూడటానికి విద్యుత్ శాఖను తాకట్టుపెట్టేస్తారా?
ఏం చేసినా చెల్లుతుందనే భావనలో జగన్ రెడ్డి ఉన్నారు..అన్నపూర్ణలాంటి ఏపీని అప్పులకుప్పగా మార్చారు.ఎంత పెద్ద కుంభకోణం జరగకపోతే ఆర్టీఐ ద్వారా కోరినా సమాచారం ఇవ్వకుండా దాచిపెడుతున్నారు.ఇన్ని దుర్మార్గాలు జరుగుతుంటే విద్యుత్ శాఖ కార్యదర్శి విజయానంద్ ఏం చేస్తున్నారు? మేం సీఎండీల తాత సొత్తు అడగడం లేదు..వారి కుటుంబాలకు వచ్చిన కట్నాలు, చెల్లించిన కట్నాల విశేషాలు తెలుసుకోవాలనుకోవడం లేదు.ప్రజలకు సంబంధించిన సమాచారం కోరితే ఇవ్వరా…ఈ విషయంలో న్యాయపరంగా ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాం..మా శాయశక్తులా పోరాటం సాగించి తాడోపేడో తేల్చుకుంటాం.
పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ వెంటనే స్పందించి ఈ స్కామ్ విషయంలో తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నుంచి బయటపడటానికి ఈ డబ్బంతా ఎక్కడ ఎవరికి చేరిందో కూడా తేలాల్సివుంది. కేంద్ర ప్రభుత్వం చూసీచూడనట్టు వ్యవరిస్తూ పోతే అంతిమంగా బాధితులు ఏపీలోని ఐదు కోట్ల ప్రజలే. మీటర్లు, ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటుకు దేశంలో షిరిడీ సాయి సంస్థ తప్ప మరొకటి లేదావ్యవసాయానికి స్మార్ట్ పెట్టడం కచ్చితం కాదని కేంద్ర ప్రభుత్వం చెప్పినా రైతులపై భారం పడే ఈ అంశంపై జగన్ రెడ్డి ప్రభుత్వానికి అంత అత్యుత్సాహం ఎందుకో.విద్యుత్ కోతలు లేకుండా సరఫరా చేయడంపై దృష్టి పెట్టడం మాని దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ఐదు కోట్ల ఆంధ్రుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రబుత్వ విచారణ జరిపి ఈ స్కామ్ ద్వారా పడే భారం నుంచి విముక్తుల్ని చేయాలి.”