Suryaa.co.in

Andhra Pradesh

ఒంగోలులో తిరిగి అవే అబద్ధాలు చెప్పిన జగన్‌రెడ్డి

– చంద్రబాబు 2 సెంట్లు ఇంటి పట్టా ఇస్తే… దాన్ని సెంటకు కుదించిన జగన్‌రెడ్డి
– గృహనిర్మాణానికి కేంద్ర నిధులకు తోడు రాష్ట్ర నిధుల నుంచి లక్ష రూపాయలు ఇచ్చిన చంద్రన్న
-గృహ నిర్మాణానికి కేంద్ర నిధులతోనే సరిపెట్టి రాష్ట్ర నిధుల నుంచి ఒక్క రూపాయి ఇవ్వకుండా పేదలను అప్పులపాలు చేసిన జగన్‌రెడ్డి
– టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి

57 నెలల పాలనలో 14 లక్షల ఎకరాల అసైన్‌మెంట్‌ భూములు కబ్జా చేసిన జగన్‌రెడ్డి ముఠా పేదల ద్రోహులు కాదా? దళిత, బడుగు వర్గాల కోసం చంద్రబాబు భూమి కొనుగోలు పథకం పెట్టి 5 వేల ఎకరాలు పేదలకు ఇస్తే, జగన్‌ ఈ పథకాన్ని రద్దు చేశారు. గృహ నిర్మాణానికి చంద్రబాబు 2 సెంట్లు ఇస్తే, దాన్ని జగన్‌ సెంటుకు కుదించారు.

సెంటు పట్టా పేరుతో రూ.7 వేల కోట్లు అవినీతి చేశారు. చంద్రబాబు విలువైన 2.60 లక్షల టిడ్కో ఇళ్లు నిర్మిస్తే, వాటిని లబ్దిదారులకు ఇవ్వకుండా ఎన్నికలు వచ్చేసరికి పేదల్ని మోసం చేయడానికి ఇళ్ల పట్టాల పేరుతో మోసం చేస్తున్నారు.
రాబోయే చంద్రబాబు ప్రభుత్వం ప్రతి పేదవారికి 2 సెంట్ల ఇంటి పట్టా ఇస్తారు. టీడీపీ 5 ఏళ్ల పాలనలో 12 లక్షల ఇళ్లు నిర్మించి పేదలకు ఇచ్చి జగన్‌రెడ్డి 25 లక్షల ఇళ్లు నిర్మించి పేదలకు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పారు.

కేవలం 5 లక్షల ఇళ్లే నిర్మించారు. గృహనిర్మాణం పేఉతో పేదల్ని అప్పులపాలు చేశారు. గృహ నిర్మాణానికి చంద్రన్న కేంద్రం ఇచ్చే దానికి అదనంగా రాష్ట్ర నిధుల నుండి అదనంగా లక్ష రూపాయలు ఇచ్చారు. జగన్‌ కేంద్రం ఇచ్చే రూ.1.80 లక్షలు మాత్రమే ఇచ్చి, రాష్ట్ర నిధుల నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. దీనివల్ల పేదలు అప్పులపాలయ్యారు. ఇంతేకాకుండా ఎన్టీఆర్‌, చంద్రబాబు ఎన్నో ఏళ్ల క్రింద ఉచితంగా ఇచ్చిన ఇళ్లకు ఓటీయస్‌ పేరుతో బలవంతంగా రూ.10 వేల నుండి రూ.30 వేలు వసూలు చేశారు.

ప్రజా రాజధాని అమరావతి 29 గ్రామాల్లో దళితులు, బీసీలు, మైనారిటీలు 80 శాతంపైగా ఉన్నారు. వీరి భూముల్లో బయటి గ్రామాల వారిని తెచ్చి అమరావతి స్థానిక పేదలకు బయటి వారికి మధ్య రచ్చ పెట్టిన పేదల ద్రోహి జగన్‌. చంద్రబాబు పాలనలోనే పేదలకు ఇళ్ళ స్థలాలు, సాగు భూములు, పక్కా ఇళ్ల నిర్మాణం అధికంగా జరిగిందనేది నిజం. ఓంగోలులో నేడు జగన్‌ చెప్పినవన్నీ పాత అబద్ధాలే.

LEAVE A RESPONSE