Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి.. 6093 ఖైదీ డ్రెస్ ఉతికించి పెట్టుకో

-తాడేప‌ల్లి ప్యాలెస్‌లో ముసుగు త‌న్ని తొంగునే 50 ఏళ్ల ముసలి మూర్ఖుడు జగన్ రెడ్డి
– డెవలప్మెంట్ అంటే డ్రగ్స్, జె బ్రాండ్స్ అమ్మడమా?
– ప్రజా సేవ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుపేదల్ని దోచుకోవ‌డ‌మా ఏ1 రెడ్డీ?
– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 

తాడేప‌ల్లి ప్యాలెస్‌లో ముసుగు త‌న్ని తొంగునే 50 ఏళ్ల ముసలి మూర్ఖుడు జగన్ రెడ్డి ప‌ర‌దాల మ‌ధ్య ప‌గ‌టిక‌ల‌ల నుంచి బ‌య‌టికి రావాలి. ఆయనకి తెలిసినవి మూడే విద్యలు దోచుకోవ‌డం,దాచుకోవ‌డం, ప్ర‌శ్నిస్తే ప్రాణాలు తీయ‌డం. బారికేడ్లు అడ్డంపెట్టినా జ‌నాలు స‌భ‌ల నుంచి పారిపోతుంటే, కంద‌కాలు త‌వ్విన దుర్మార్గ పాల‌కుడు. సీఎం సీటు కోసం తండ్రి శ‌వం పక్కనే సంత‌కాలు సేక‌రించాడు. ఓట్లు కోసం బాబాయ్‌పై గొడ్డ‌లివేటు వేసి గుండెపోటని ప్ర‌చారం చేసిన శ‌వ రాజ‌కీయాల‌ బ్రాండ్ అంబాసిడ‌ర్‌. నీ ఓదార్పు, పాద‌యాత్ర‌ల‌కి చేసింది ప్రీ వెడ్డింగ్ షూట్లా? మూడుత‌రాల మీ కుటుంబ‌ అధికార, ధ‌న‌దాహానికి నెత్తుటి సాక్ష్యాలు ఇంకా ప‌చ్చిగానే ఉన్నాయి. రాజకీయం అంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమా?

డెవలప్మెంట్ అంటే డ్రగ్స్, జె బ్రాండ్స్ అమ్మడమా? ప్రజా సేవ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుపేదల్ని దోచుకోవ‌డ‌మా ఏ1 రెడ్డీ? పాల‌న‌ని ఫ్యాక్ష‌న్ చేశావు. సంక్షేమాన్ని సంక్షోభంలోకి నెట్టావు. అభివృద్ధిలో రాష్ట్రాన్ని అథఃపాతాళంలోకి నెట్టావు. బాబాయ్ హ‌త్య నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ప్ర‌త్యేక‌హోదాని, ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ నుంచి త‌ప్పించాల‌ని రైల్వేజోన్‌ని, 38 క్రిమిన‌ల్ కేసుల్నించి గ‌ట్టెక్కేందుకు రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను తాక‌ట్టు పెట్టిన నీచుడివి. నువ్వా చంద్ర‌బాబు గారి గురించి మాట్లాడేది? లండ‌న్ మందులు డోస్ పెరిగిందో! డోస్ అంద‌లేదో కానీ..పెళ్లిళ్లు, పిల్ల‌లు అంటూ వాగుతున్నావు. కోడి కత్తి నుంచి నేటివరకూ నీ మాయమాటలు, నాటకాలు జనానికి తెలిసిపోయాయి. పాపాలు పండాయి. 6093 ఖైదీ డ్రెస్ ఉతికించి పెట్టుకో.

LEAVE A RESPONSE