రాష్ట్రంపై రూ.10లక్షలకోట్లకు పైగా అప్పుల భారం వేసిన జగన్ రెడ్డి.. తన నివాసం కోసం రూ.400కోట్ల ప్రజల సొమ్ము తగలేస్తున్నాడు
• బాత్రూమ్ నిర్మాణానికి రూ.25లక్షలు ఖర్చుపెడుతున్న జగన్ రెడ్డి పేదవాడా?
• రుషికొండను తన శాశ్వత నివాసస్థానంగా మార్చుకోవాలన్న ఆలోచనతోనే జగన్ దానిపై అంతభారీ భవనాలు నిర్మిస్తున్నాడా అనే సందేహం కలుగుతోంది.
• ప్రజలసొమ్ము కొట్టేసి, ప్రభుత్వ సంపద కాజేసి మరీ జగన్ రెడ్డి అడ్డగోలుగా నిర్మిస్తున్న నిర్మాణాలన్నీ ఏదో ఒకరోజు ప్రజల పరం కాక తప్పదు : వంగలపూడి అనిత
• తండ్రి ముఖ్యమంత్రి కాకముందు ఉండటానికి ఇల్లులేని జగన్ రెడ్డి.. నేడు నగరానికో రాజభవనం నిర్మించుకుంటున్నాడు
• నలుగురు సభ్యుల పేదకుటుంబం ఉండటానికి సెంటుస్థలం సరిపోతుందా…. నువ్వు.. నీ భార్య ఉండటానికి మాత్రం భారీ రాజభవనాలు కావాలా.. ఇదేం న్యాయం జగన్ రెడ్డి? : గుమ్మడి సంధ్యారాణి
తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత , టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి
ఉత్తరాంధ్రలోని ప్రకృతి సంపద, ప్రజల సొమ్ము, ప్రభుత్వ ఆస్తుల్ని కొట్టేయడానికే జగన్ రెడ్డికి ఉన్నపళంగా విశాఖపట్నంలో నివాసముండాలనే ఆలోచన వచ్చిందని, దానికోసం ఏకంగా సాగర నగరానికే తలమానికంగా నిలిచే రుషికొండను ముఖ్యమంత్రి బోడికొండగా మార్చేసి, ఆ కొండను తన అడ్డాగా మార్చుకుంటున్నాడని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆమె టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు వారి మాటల్లోనే మీకోసం…!
“ రుషికొండపై ఉన్న రిసార్ట్స్, ఇతర పర్యాటక నిర్మాణాల్ని తొలగించి, తన రాజప్రాసా దం నిర్మించుకుంటున్న జగన్ రెడ్డి, నిర్మాణంలో భాగంగా ఒక్కో చదరపు అడుగుకి రూ.2.14 లక్షల వ్యయంతో, మొత్తంగా రూ.164కోట్లతో అంచనాలు రూపొందించడం జరిగింది. జగన్ తన రాజభవనం నిర్మించుకోవడానికి అప్పటికే అంతకుముందు రుషి కొండపై ఉన్న దాదాపు రూ.200కోట్ల విలువైన నిర్మాణాలను నేలమట్టం చేయించాడు.
అక్కడి మట్టిని, ఇతరత్రా భవననిర్మాణ వ్యర్థాలను రూ.190కోట్లకు అమ్మేయడం జరిగింది. రూ.164కోట్ల అంచనావ్యయంతో రుషికొండపై తాను నివాసముండటానికి రాజభవనం నిర్మాణాన్ని మొదలుపెట్టి న జగన్ రెడ్డి, దాన్ని ఇప్పుడు ఆ వ్యయాన్ని ఏకంగా రూ.350 నుంచి రూ.400 కోట్లకు పెంచాడు.
రాష్ట్రంపై రూ.10లక్షలకోట్లకు పైగా అప్పులభారం మోపిన వ్యక్తి తన నివాసం కోసం రూ.400కోట్లు తగలేయడం ఎంత దారుణమో ప్రజలే ఆలోచించాలి
రాష్ట్రంపై రూ.10లక్షలకోట్లకు పైగా అప్పులభారం మోపిన అప్పుల అప్పారావు జగన్ రెడ్డి.. ప్రజలకు అరకొర సంక్షేమం అందిస్తూ, ఉద్యోగులకు సరిగా జీతాలు, పింఛన్ దారులకు నెలానెలా సక్రమంగా పింఛన్లు అందించకుండా తన ప్యాలెస్ నిర్మాణానికి మాత్రం ఏకంగా రూ.350 కోట్ల నుంచి రూ.400కోట్లు వెచ్చిస్తున్నాడు. ప్రజలు..రాష్ట్రం ఎలా పోతే నాకేంటి..నా దర్జా.. రాజభోగాలు మాత్రం తగ్గకూడదన్నదే జగన్ రెడ్డి ఆలో చన. కేవలం లక్షా40వేల చదరపు అడుగుల భవన నిర్మాణానికి రూ.400కోట్లు ఖర్చు చేయడం ఎంత దారుణమో ప్రజలు ఆలోచించాలి.
కేవలం తాను, తన భార్య ఉండటంకోసం పర్యాటక ప్రదేశాన్ని కబళించి మరీ రూ.400కోట్లతో భారీ రాజభవనం నిర్మిస్తున్న జగన్ రెడ్డి పేదవాడా? బాత్రూమ్ నిర్మాణానికి రూ.25లక్షలు వెచ్చిస్తున్నాడంటనే అర్థం చేసుకోవచ్చు.. జగన్ ఎంతగా రాజభోగాలు అనుభవిస్తున్నాడో!
గతంలో రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లోఉన్న తరుణంలో చంద్రబాబునాయుడు ముఖ్యమం త్రిగా ఉండి , రాజధాని అమరావతిలో ప్రభుత్వభవనాల నిర్మాణం చేపట్టారు. ఆనాడు సచివాలయం.. శాసనసభ…. శాసనమండలి… హైకోర్ట్ వంటి వాటి నిర్మాణానికి చదరపు అడుగుకి రూ.6వేల చొప్పున ఖర్చుపెట్టారు. దానికే చంద్రబాబు ఇష్టమొచ్చినట్టు ప్రజలసొమ్ము కాజేస్తున్నాడని వైసీపీనేతలు గగ్గోలు పెట్టారు. మరిప్పుడు అదే వ్యక్తు లు అప్పులు అప్పారావు అడ్డగోలుగా దాదాపు రూ.400కోట్ల వ్యయంతో తానొక్కడే ఉండటంకోసం రుషికొండపై నిర్మిస్తున్న రాజభవనం గురించి దానికోసం తగలేస్తున్న ప్రజలసొమ్ము గురించి ఎందుకు మాట్లాడరు?
చంద్రబాబు అమరావతిలో నిర్మించిన భవనాలు మొత్తం ప్రజలకోసం.. ప్రభుత్వం కోసమే నిర్మించారు తప్ప, ఆయనకోసం కాదు. కానీ నేడు జగన్ రెడ్డి రుషికొండపై నిర్మిస్తున్న ఏడంతస్తుల భారీ భవన సుముదాయం మొత్తంలో ఆయన, ఆయన భార్య, సెటల్మెంట్లు చేసే సజ్జల, పార్టీ వ్యవహారాలు చక్కబెట్టే విజయసాయి తప్ప ఎవరూ ఉండరు.
కేవలం నలుగురు, ఐదు గరు ఉండటానికి పర్యాటకప్రాంతాన్ని కబళించి మరీ రూ.400కోట్లతో నిర్మాణాలు చేస్తు న్న జగన్ రెడ్డి పేదవాడా? జగన్ రెడ్డి రాజభవనంలో నిర్మిస్తున్న బాత్రూమ్ నిర్మాణ ఖరీదే రూ.25లక్షలు. ప్రజలకు సంక్షేమం అందించడానికి, ప్రాజెక్టులు కట్టడానికి డబ్బులు లేవు మొత్తం రాష్ట్రం అప్పుల్లో ఉందని కూనిరాగాలు తీసే జగన్ రెడ్డి.. మంత్రులు రుషికొండ నిర్మాణానికి వందలకోట్లు దుర్వినియోగం చేయడాన్ని ఏమనాలి ?
జగన్ రెడ్డి వాలకం చూస్తే రుషికొండను శాశ్వతంగా తనపరం చేసుకోవడానికే దానిపై అంతసొమ్ముతో భవనం నిర్మిస్తున్నాడనే సందేహం కలుగుతోంది. జగన్ రెడ్డికి విలాస భవనాలపై ఉన్న వ్యామోహం దేశంలో ఎవరికీ ఉండదు. ఇప్పటికే ఊరికొక ప్యాలెస్ నిర్మించుకున్న జగన్ రెడ్డి… లండన్లోకూడా ఒక భారీ ప్యాలెస్ కొనబోతున్నాడని తెలి సింది.
జగన్ రెడ్డి ప్రజలసొమ్ముతో నిర్మించే భవనాలు కొట్టేసే సంపదంతా ఏదో ఒకనాడు ప్రజల పరం కాక తప్పదు
జగన్ రెడ్డి రుషికొండపై తాను ఉండటానికి నిర్మిస్తున్న భవనానికి వెచ్చిస్తున్న రూ.400కోట్ల సొమ్ముతో కొన్నేళ్లపాటు పేదలకు అన్నాక్యాంటీన్ల ద్వారా కడుపు నింప వచ్చు. అదే సొమ్ముతో ఎన్నో గ్రామాల్లో కనీస మౌలిక వసతులు కల్పించవచ్చు. వృద్ధులు, వికలాంగులకు కొన్నేళ్లు పింఛన్లు ఇవ్వవచ్చు. కానీ ఇలాంటి మంచిపనులు చేయడానికి జగన్ రెడ్డికి మనసురాదు. జగన్ రెడ్డి ఈ విధంగా ప్రజలసొమ్ముతో కట్టే భవనాలు.. ఆక్రమించే ఆస్తులు అన్నీ ఏదో ఒకనాడు ప్రజలపరం కాక తప్పదు.” అని అనిత హెచ్చరించారు.
పేదకుటుంబం ఉండటానికి సెంటుస్థలం సరిపోతుందా…. నువ్వు.. నీ భార్య ఉండటానికి మాత్రం భారీ రాజభవనాలు కావాలా.. ఇదేం న్యాయం జగన్ రెడ్డి? : గుమ్మడి సంధ్యారాణి
వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు.. చంద్రబాబునాయుడు ముఖ్యమం త్రిగా ఉన్నప్పుడు వై.ఎస్ కుటుంబానికి ఉండటానికి ఇల్లులేదని…హైదరాబాద్ లో ఉన్న చిన్న ఇంటిని కూడా అర్థిక సమస్యల వల్ల అమ్ముకోవాల్సి వచ్చిందని… అలాంటి కుటుంబం నుంచి వచ్చిన జగన్ రెడ్డి అతి తక్కువ సమయంలో ప్రతి నగరం లో విలాసవంతమైన రాజభవనాలు నిర్మించే స్థితికి ఎలా వచ్చాడో ప్రజలే గ్రహించాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి సూచించారు.
“ ఇడుపులపాయలో పెద్ద రాజభవనం.. పులివెందులలో ఒక రాజభవనం.. బెంగుళూ రులో అమెరికా శ్వేతసౌధాన్ని తలిపించే భారీ రాజప్రాసాదం.. హైదరాబాద్ లో మరో రాజభవనం.. తాడేపల్లిలో తాను ఉంటున్న భారీ నివాససముదాయం ఇవీ జగన్ రెడ్డి నివాసమందిరాలు. వీటిని ఇళ్లు అనడం అంటే వాటి హంగుని… నిర్మాణ కౌశలాన్ని కించపరచడమే అవుతుంది.
చంద్రబాబు ఆనాడు రాజధానిలో కేవలం రూ.560కోట్లతో ప్రభుత్వ మరియు, ఇతర అవసరాలకోసం అనేక నిర్మాణాలు చేపడితే, నేడు జగన్ రెడ్డి కేవలం తాను, తన శ్రీమతి ఉండటంకోసం రూ.400కోట్లతో రుషికొండపై భారీ భవనం నిర్మించుకుంటున్నా డు. ఇంత తక్కువ సొమ్ముతో భారీ రాజ భవనం నిర్మించుకుంటున్న జగన్ రెడ్డి నిజం గా పేదవాడే. తాను పేదవాడినని చెబుతున్న జగన్ రెడ్డి నిజంగా సైకోనే.
ఎందుకంటే ముఖ్యమంత్రిగా నాలుగున్నరేళ్లు పూర్తిచేసుకున్నా కూడా ఇప్పటికీ ఆయన చెప్పే అబద్ధాలు.. అసత్యాలు వింటే అదే నిజమనిపిస్తోంది. జగన్ రెడ్డిని విశాఖపట్నానికి రమ్మని ఎవరు అడిగారు.. అక్కడి ప్రజలే ఈ సైకో ముఖ్యమంత్రి వస్తే తమ పరిస్థితి ఏమిటా అని భీతిల్లిపోతున్నారు. ఇప్పటికే విజయసా యిరెడ్డి సహా జగన్ రెడ్డి.. అతని పార్టీవాళ్లంతా కలిసి విశాఖనగరాన్నికబ్జాలకు, సెటిల్మెంట్లకు, దోపిడీలకు కేరాఫ్ గా మార్చారు.
నలుగురు సభ్యులుండే పేదకుటుంబం ఉండటానికి సెంటుస్థలం సరిపోతుందా.. జగన్ ఆయన భార్య ఉండటానికి మాత్రం లక్షా40వేల చదరపు అడుగుల భారీ రాజభవనం కావాలా?
నలుగురు సభ్యులుండే పేద కుటుంబం నివాసముండటానికి సెంటు స్థలం సరిపోతుం దని చెబుతున్న జగన్ రెడ్డి, తాను.. తనభార్య ఉండటానికి మాత్రం లక్షా40వేల చదరపు అడుగుల్లో భారీభవనం ఎందుకు నిర్మించుకుంటున్నాడు? బాత్రూమ్ నిర్మా ణానికి రూ.25లక్షలు ఎందుకు వెచ్చిస్తున్నాడు. నిజంగా పేదలపై.. అక్కచెల్లెమ్మలపై జగన్ రెడ్డికి అంత ప్రేమే ఉంటే, వారికి ఇళ్ల నిర్మాణానికి ఇంటికి రూ.20లక్షలు ఎందుకు ఇవ్వడు?
రాత్రికి రాత్రి ప్రజలసొమ్ము గజదొంగలా దోచేస్తున్న జగన్ రెడ్డి పైకి మాత్రం బీదఅరుపులు అరుస్తున్నాడు. జగన్ రెడ్డి పాదప్రభావం వల్లే నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇలాంటి దౌర్భాగ్యపు పరిస్థితి వచ్చింది. 150 స్థానాలు గెలిచానని విర్రవీగడం తప్ప.. ప్రజలకు మంచిచేయడం.. సుపరిపాలన అందిచడం మాత్రం చేతకాదు. నాలుగున్నరేళ్లపాటు కబుర్లు, కట్టుకథలతో కాలక్షేపం చేసిన జగన్ రెడ్డి.. బటన్ నొక్కు డుతో ప్రజల్ని ఉద్ధరిస్తున్నానని దీర్ఘాలు తీసి మరీ చెబుతున్నాడు.
జగన్ రెడ్డి తమకు ఇచ్చిన హమీలు ఏవీ నెరవేర్చకుండా తన సుఖంకోసం అన్నీ చేసుకుంటున్నాడని ప్రజలకు అర్థమైంది. రెండు కిలోమీటర్ల దూరానికే రెండుసార్లు హెలికాప్టర్ వినియోగించినప్పుడే జగన్ రెడ్డి ఎంత పేదవాడో ప్రజలు గ్రహించారు. కరో నా సమయంలో వేలాది ప్రజలు చనిపోయినా ఏనాడూ ఒక్క ఇంటి ముఖం కూడా చూడని జగన్ రెడ్డి.. నేడు పేదలకోసం తాను ఉన్నానని చెప్పడం నిజంగా సిగ్గుచేటు.
ప్రజల్లో తన బాగోతాలు బయటపెడుతున్నాడన్న అక్కసుతోనే జగన్ రెడ్డి.. కక్షకట్టి చంద్రబాబుని జైలుకు పంపాడు
40 రోజులుగా ఏ తప్పూ చేయని చంద్రబాబుని జైల్లో పెట్టిన జగన్ రెడ్డి.. తాను మాత్రం ఏ తప్పూ చేయనివాడిలా నీతివాక్యాలు ఉపదేశిస్తున్నాడు. నిజంగా చంద్రబాబు తప్పు చేసుంటే జగన్ రెడ్డి నాలుగున్నరేళ్లు ఆగేవాడు కాదు. ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే ఆయన్ని జైలుకు పంపేవాడు. కేవలం చంద్రబాబు ప్రజల్లోకి వెళ్తూ.. తన అవినీతిని, దోపిడీని, దుర్మార్గాలను ప్రజలకు తెలియచేస్తున్నాడనే ఆయనపై కక్ష కట్టి అన్యాయంగా జైలుకు పంపాడు. జగన్ రెడ్డి ఎన్ని కుట్రలు పన్నినా… కుటిల రాజకీ యాలు చేసినా.. ప్రజలు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేసి.. జగన్ రెడ్డిని శాశ్వతంగా రాష్ట్రం నుంచి తరిమికొట్టడం ఖాయం.” అని గుమ్మడి సంధ్యారాణి హెచ్చరించారు.