– యనమల రామకృష్ణుడు
రాష్ట్రంలో కొంతమంది పోలీసులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతూ మానవ హక్కులను హరిస్తున్నారు. రాజకీయ కక్షలో భాగంగా మాజీ మంత్రి జవహర్ ను, ఆయన సతీమణి, పిల్లలను పరుష పదజాలంతో దూషించడం పోలీసుల దుశ్చర్యలకు తార్కాణం. కనీసం ఓ మాజీ మంత్రి అనికూడా చూడకుండా సిఐ శ్రీనివాస్, డీఎస్పీ భక్తవల్సం అమానుషంగా ప్రవర్తించడం దారుణం. అన్ని రోజులు ఒకలా ఉంటాయని పోలీసులు భ్రమపడుతున్నట్లు ఉన్నారు. ఈరోజు రేపులా ఉండదు అనే సత్యాన్ని గుర్తించండి. అధికారం శాశ్వతం కాదు. కుల దురహంకారంతో అధికారాన్ని అడ్డదిడ్డంగా వాడుతున్న జగన్ రెడ్డి, ఆయన వందిమాగాదులను చూసుకుని పోలీసులు రెచ్చిపోతే ఇబ్బందులు పాలవుతారు. జవహర్ గారిని నేలపై కూర్చోబెట్టి అవమానించిన జగన్ రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలి. పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలి.