మాజీ మంత్రి జవహర్ ని పోలీసులు నేలపై కూర్చోబెడతారా?

– జగన్ కి దళితులంటే ఎందుకంత చులకన భావం?
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు

వైసీపీ పాలనలో దళితులకు అడుగడుగునా, అన్యాయం, అవమానం జరుగుతోంది. టీడీపీ నేత, మాజీమంత్రి కె.యస్ జవహర్ పట్ల అనపర్తి పోలీసులు దురుసుగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అరెస్ట్ చేసి ఆయన ఫోన్, పర్సు లాక్కుని నేలపై కూర్చోబెట్టారు. మాజీ మంత్రిని పోలీస్ స్టేషన్లో నేలపై కూర్చోబెట్టి అవమానిస్తారా? దళితులంటే జగన్ కి ఎందుకంత చిన్నచూపు ? మీ పాలనలో దళితులు కనీసం కుర్చీపై కూర్చోవడానికి కూడా అర్హులు కాదా ? జగన్ వైసీపీ దళిత నేతల్ని తన ఇంటి గుమ్మం బయట నిల బెడుతున్నారు, టీడీపీ దళిత నేతల్ని పోలీసు స్టేషన్లలో నేలపై కూర్చోబెడుతున్నారు. ఇది యావత్ దళిత జాతికి అవమానం. జవహర్ ను అవమానించిన పోలీస్ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి. ముఖ్యమంత్రి దళితులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి.