Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డికి పింఛన్ దారుల ఉసురు తగులుతుంది

– ఒక్కొక్కరికి రూ.750లు మాత్రమే పింఛన్ పెంచిన జగన్ రెడ్డి, సాక్షి పత్రికలో ప్రకటనలకు రూ.100కోట్లు ఖర్చు చేశాడు
• నేటికి పింఛన్లు అందించలేని తన అసమర్థతను, సాక్షిపత్రికలో అబద్ధపు ప్రకటనలతో జగన్ రెడ్డి కప్పిపుచ్చుకుంటున్నాడు
• రూ. 12లక్షల కోట్ల బడ్జెట్ ఖర్చుచేశానంటున్న జగన్ రెడ్డి తన హాయాంలో పింఛన్లసొమ్ము కేవలం రూ.750 మాత్రమే పెంచడం సిగ్గుచేటు.
• చంద్రబాబు ఐదేళ్లలో పింఛన్ల సొమ్ముని రూ.1800లు పెంచాడు.
• 2014కి ముందు రూ.400కోట్లుగా ఉన్న పింఛన్ల చెల్లింపు సొమ్ముని చంద్రబాబు రూ.1350 కోట్లకు పెంచాడు
• టీడీపీప్రభుత్వంలో కొత్త పింఛన్ దారుల సంఖ్య 20లక్షలు పెరిగితే, జగన్ రెడ్డి హాయాంలో లబ్ధిదారులు 10లక్షలే పెరిగారు.
• జగన్ హాయాంలో పింఛన్ల సొమ్ము పెరిగినా, ఆ స్థాయిలో లబ్ధిదారులు పెరగలేదు.
• వయోపరిమితి తగ్గించినా లబ్ధిదారులు ఎందుకు పెరగలేదో, జరుగుతున్న మోసం ఏమిటో ముఖ్యమంత్రే చెప్పాలి
– టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేమూరి ఆనంద్ సూర్య

సామాజిక పింఛన్ల పెంపుపై జగన్ రెడ్డి మడమతిప్పాడని, అధికారంలోకి వచ్చిన వెంటనే హామీ ఇచ్చినట్టుగా ఒక్కో పింఛన్ దారుడికి రూ.3వేలు ఇవ్వని ఈ ముఖ్యమంత్రి నిర్వాకంతో ప్రతి ఒక్కరూ సగటున 57 నెలల్లో రూ.30,750 వరకు నష్టపోయారని, 2019లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిఉంటే, పింఛన్ దారులు పైసా కూడా నష్టపోయేవారు కాదని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేమూరి ఆనంద్ సూర్య స్పష్టం చేశారు.

మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …!
పింఛన్ల చెల్లింపును రాజకీయప్రయోజనాలకోసం వాడుకుంటున్న జగన్ రెడ్డికి పింఛన్ దారుల ఉసురు తగులుతుంది

“ ప్రతినెలా రూ.3వేల పింఛన్ ఇస్తానన్న మాటను నిలబెట్టుకోలేని తన అసమర్థ తను కప్పిపుచ్చుకోవడానికి పింఛన్ల పెంపుపై జగన్ రెడ్డి తన అవినీతిపత్రిక సాక్షికి భారీప్రకటనలు ఇస్తున్నాడు. ఈ నెలలో ఇంకా పింఛన్లు అందలేదు. పింఛన్ల చెల్లింపును కూడా తన రాజకీయ ప్రయోజనాలకు ముడిపెట్టిన అసమర్థ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. తనపార్టీ..తన స్వప్రయోజనాలకోసం వృద్ధులు, వికలాం గులు, వితంతువుల జీవితాల్ని ఇబ్బందిపెట్టడం జగన్ రెడ్డికి మంచిదికాదు. వారి ఉసురు కచ్చితంగా ఈ ముఖ్యమంత్రికి తగులుతుంది. జగన్ రెడ్డి ఇప్పటికై నా తన పంథా మార్చుకొని పేదలకు ఇచ్చిన అన్ని హామీలు తప్పకుండా నెరవేర్చాల్సిందే.

చంద్రబాబు ఐదేళ్లలో ఒక్కో పింఛన్ దారుడికి రూ.1800లు అందిస్తే, జగన్ రెడ్డి నాలుగున్నరేళ్లలో కేవలం రూ.750మాత్రమే ఇచ్చాడు చంద్రబాబు 20లక్షల పింఛన్లు పెంచితే, జగన్ రెడ్డి కేవలం 10లక్షల పింఛన్లే పెంచాడు
చంద్రబాబు నాయుడు రూ.200లు ఉన్న సామాజిక పింఛన్ ను ఐదేళ్లలో రూ.2వేలకు పెంచారు. రూ.1800 పింఛన్ సొమ్ము పెంచిన ఘనత దేశంలో చంద్ర బాబుకి తప్ప మరెవరికీ లేదు. కానీ జగన్ రెడ్డి ఐదేళ్లలో ఒక్కో పింఛన్ దారుడికి పెంచింది కేవలం రూ.750లు మాత్రమే. ఇంత తక్కువ పింఛన్ పెంచిన జగన్ రెడ్డి సిగ్గులేకుండా ఏదో గొప్ప ఘనత సాధించినట్టు ప్రచారం చేసుకుంటూ, పింఛన్ల పెంపు తాలూకా ప్రచార పిచ్చికే రూ.1000కోట్ల ప్రజలసొమ్ము దుర్విని యోగం చేశాడు.

అలానే పింఛన్ దారుల వయోపరిమితి తగ్గించినా లబ్ధిదారుల సంఖ్యను పెంచలేదు. టీడీపీప్రభుత్వంతో పోలిస్తే, తన పాలనలో జగన్ రెడ్డి కేవలం 10 లక్షల పింఛన్లు మాత్రమే పెంచాడు. కానీ చంద్రబాబునాయుడి హాయాంలో 34లక్షల ఉన్న పింఛన్ల సంఖ్యను 54లక్షలకు పెంచి, ఏకంగా ఒకేసారి రూ.20లక్షల పింఛన్లు పెంచాడు.

రాష్ట్ర బడ్జెట్ రూ.12లక్షల కోట్లకు పెరిగినా పింఛన్ల రూ.750 మాత్రమే పెంచడం పేదల్ని వంచించడం కాదా?
సంక్షేమం ముసుగులో పేదలకు ఎంతగానో ఉపయోగపడే సామాజిక పింఛన్లను కూడా జగన్ రెడ్డి పక్కదారి పట్టించాడు. రాష్ట్ర బడ్జెట్ ను రూ.12లక్షల కోట్లకు పెంచిన జగన్ రెడ్డి.. 4ఏళ్ల 8 నెలల పాలనలో పింఛన్ల పెంపుని మాత్రం రూ.750తోనే సరిపెట్టాడు. టీడీపీప్రభుత్వంలో పింఛన్ దారులు ఎక్కడున్నా బయోమెట్రిక్ ద్వారా వారికి సకాలంలో సొమ్ము అందించడం జరిగింది. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక బయోమెట్రిక్ విధానం ఎత్తేసి, వాలంటీర్ల విధానంతో పింఛ న్ దారుల్ని తీవ్రంగా ఇబ్బందులకు గురిచేశాడు.

చంద్రబాబు హయాంలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులతో పాటు మత్స్యకారులు, డప్పు కళాకా రులు, హిజ్రాలు, ఒంటరి మహిళలకు కూడా పింఛన్లు అందించారు. చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చేనాటికి పింఛన్ల చెల్లింపులకు రూ.400కోట్లు ఖర్చుచేస్తుండగా.. ఆ మొత్తాన్ని ఆయన రూ.1380 కోట్లకు పెంచారు. జగన్ రెడ్డి హాయాంలో పింఛన్ల సొమ్ము రూ.1785 కోట్లకు పెరిగినా లబ్ధిదారుల సంఖ్య తగ్గిపోయింది.

పింఛన్ల చెల్లింపుల్లో దాగి ఉన్న మోసం ఏమిటో ముఖ్యమంత్రే చెప్పాలి. ఐదేళ్లలో ఒక్కో పింఛన్ దారుడికి కేవలం రూ.750లు మాత్రమే పెంచిన జగన్ రెడ్డి… ప్రజలకు ఇచ్చేదానికంటే అదనంగా పన్నులు, ఛార్జీలు, ఇతరత్రా రూపాల్లో వసూలు చేస్తున్నదే ఎక్కువ.” అని ఆనంద్ సూర్య పేర్కొన్నారు.

LEAVE A RESPONSE