Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి నువ్వు సింహానివి కాదు, పులివెందుల పిల్లివి.. పిరికి సన్నాసివి

• జనమంటే భయం కాబట్టే, డేరాల్లో దాక్కుంటూ, ఏపీ డేరాబాబా అయ్యావు. గాలిని చూసి కూడా భయపడుతున్నావు కాబట్టే చెట్లను కూడా నరికిస్తున్నావు
• 70 ఏళ్లుదాటినా ఎప్పుడూ జనంలో ఉండే చంద్రబాబు ముసలాయనా? జనాన్ని చూసి భయపడే నువ్వు ముసలోడివా జగన్ రెడ్డి?
• జనం మెచ్చిన నేత చంద్రబాబు గురించి, జైలు పక్షివైన నీకెం తెలుసు జగన్ రెడ్డి?
• బాబాయ్ హత్యకేసులో తనబాగోతం బయటపడకూడదనే సింహం సింగిల్ గా ఢిల్లీ వెళ్లింది
• రాష్ట్రజనాభాలో సగమున్న బీసీల్లో లక్షమందికి రూ.10వేలిస్తే అందరినీ ఉద్ధరించినట్టు కాదు జగన్ రెడ్డి?
• జగన్ రెడ్డి దోపిడీ, అవినీతి, రాక్షసపాలనతో రాష్ట్రం నామరూపాలు లేకుండా పోతే, ప్రజలు సర్వనాశనమయ్యారు
– మాజీ మంత్రి కొల్లు రవీంద్ర

జగన్ రెడ్డి పైకి మేకపోతుగాంభీర్యం ప్రదర్శిస్తూ, తాను సింహాన్ని అని చెప్పుకుంటున్నాడని, ఈ సింహం సింగిల్ గా ఢిల్లీ ఎందుకు వెళ్లిందో, ప్రజల్ని చూసి ఎందుకు భయపడుతుందో, టీవీ5, ఏబీఎన్, ఈనాడు, ఆంధ్రజ్యోతిలను చూసి ఎందుకు వణికిపోతుందో చెప్పాలని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రి కొల్లురవీంద్ర డిమాండ్ చేశారు. చంద్రబాబుని చులకనగా మాట్లాడినా, ఆయన్ని దూషించినా జగన్ రెడ్డికి తగినవిధంగా బుద్ధి చెబుతామని తీవ్రస్వరంతో రవీంద్ర హెచ్చరించారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు క్లుప్తంగా ఆయన మాటల్లోనే …

“ఎవరు ముసలాయనో ప్రజలకు బాగా తెలుసు జగన్ రెడ్డి. చేతగాని, చేవలేని, పనికిమాలిన వాడివి నువ్వేనని జనానికి తెలుసు. సాయంత్రం 5గంటలు దాటితే బయ టకు రాని నువ్వు ముసలోడివా.. అర్థరాత్రి 2 గంటలకు కూడా జనంలో ఉండే చంద్రబాబు ముసలోడా? వరదలొస్తే మోకాల్లోతు బురదలో జనంతో కలిసి తిరిగిన చంద్ర బాబు ముసలాయనా? హెలికాఫ్టర్లో చక్కర్లు కొట్టి, ఇంట్లో తొంగునే నువ్వా? 70ఏళ్లు పైబడినా నిత్యం జనంలో ఉండే టీడీపీ అధినేత ముసలోడా? 40ఏళ్లకే జనంలోకి రావడానికి భయపడి, నక్కినక్కి తిరిగే నువ్వా జగన్ రెడ్డి. తాడేపల్లి ప్యాలెస్ వదిలి బయటకురాని జగన్ రెడ్డి, చంద్రబాబుని, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఏబీఎన్ సంస్థ లని సిగ్గులేకుండా విమర్శిస్తున్నాడు.
నువ్వు అంత గొప్పనాయకుడివే అయితే, మీడియాసంస్థల్ని, ప్రజల్ని చూసి ఎందుకు జంకుతున్నావు జగన్ రెడ్డి? మీడియా స్వేఛ్ఛను హరించడానికి, ప్రజల వ్యక్తిగతస్వేచ్ఛని కాలరాయడానికి చీకటి జీవోలు ఎందుకు తీసుకొచ్చావు? నీ అరాచకాలు, దోపిడీ, దుర్మార్గపు పాలనతో ప్రజలు సర్వనాశనమయ్యారు, రాష్ట్రం నామరూపాలు లేకుండా పోయింది. అయినా సిగ్గు లేకుండా చంద్రబాబుని, మీడియా సంస్థల్ని ఆడిపోసుకుంటున్నావు. ప్రజల సొమ్ము ని సాక్షిమీడియాలో పనిచేసేవారికి జీతాలగా ఇస్తూ, అవినీతిపత్రికలో నీతిమాలిన వార్తలు రాయిస్తున్నావు.

వివేకా హత్యకేసులో తన బాగోతం బయటపడకూడదనే మూడురోజులు పడిగాపులు పడిమరీ సింహం సింగిల్ గా ఢిల్లీ వెళ్లింది
జగన్ సింగిల్ గా ఢిల్లీ వెళ్లేది కేసులు మాఫీ చేసుకోవడానికే. వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో సీబీఐ అవినాశ్ రెడ్డికి నోటీస్ ఇవ్వగానే జగన్ రెడ్డి ఢిల్లీ అపాయింట్ మెంట్ కోసం పడిగాపులు పడ్డాడు. అవినాశ్ రెడ్డి మీ తల్లి విజయమ్మను ఎందుకు కలిశాడు జగన్ రెడ్డి? వివేకా హత్యకేసులో అందరూ సూత్రధారులు, పాత్రధారులు కాబట్టే, హత్యకేసు విచారణలో ఒకేమాట చెప్పాలని ముందే అనుకుంటున్నారా? తన అవినీతితో రాష్ట్రాన్ని ప్రపంచపటంలో లేకుండా చేసిన జగన్ రెడ్డి, 11.43శాతం జీఎస్ డీపీ అని దొంగమాటలు చెబుతున్నాడు.

చంద్రబాబు బీసీల్లోని చేతి, కులవృత్తులవారికి లక్షలాదిరూపాయల వ్యక్తిగత రుణా లిస్తే, జగన్ రూ.10వేలిచ్చి ఉద్ధరించినట్టు మాట్లాడుతున్నాడు
చేదోడు కింద ఎందరు దర్జీలు, నాయీబ్రాహ్మణులు, రజకులకు ఆర్థికసాయం చేస్తు న్నాడో జగన్ చెప్పాలి. జగన్ పుణ్యమా అని ఆయావర్గాలతో పాటు, ప్రజలందరూ ఉపాధి కోల్పోయింది నిజంకాదా? జగన్ రెడ్డి చేదోడు కింద రూ.10వేలిస్తూ, విద్యుత్ బిల్లులు, ఇతరత్రా పన్నులపేరుతో చేతి, కులవృత్తుల వారి నుంచి రెండింతలు వసూ లుచేస్తున్నాడు. చేదోడు, చేయూత, అమ్మ ఒడి అంటూ పథకాలపేరుతో సాక్షి పత్రికకు ప్రజలసొమ్ము దోచిపెడుతున్నాడు. చంద్రబాబు బీసీలను ఆదుకోవడానికి, అన్నికులాలకు కార్పొరేషన్లు, ఫెడరేషన్లు ఏర్పాటుచేసి, సరిపడా నిధులు కేటాయించారు. బీసీలు వారికాళ్లపై వారు నిలబడేం దుకు రూ.2లక్షల వ్యక్తిగత రుణం, ప్రతి గ్రూపుకు రూ.30లక్షల రుణం అందించారు. ఆదరణ పథకంకింద 10శాతం సొమ్ము లబ్ధిదారులు చెల్లిస్తే, టీడీపీప్రభుత్వం 90శాతం చెల్లించి, బీసీలకు ఆధునిక పరికరాలు, పనిముట్లు అందించింది. జగన్ రెడ్డేమో తూతూమంత్రంగా 56 కార్పొరేషన్లు పెట్టి, వాటిని బోర్డులకే పరిమితం చేశాడు. జేబ్రాం డ్ మద్యం అమ్మకాలతో నాసిరకం మద్యం అమ్ముతూ, చేతివృత్తులు చేసుకునేవారి రక్తం తాగుతున్నాడు. రాష్ట్ర జనాభాలో 50శాతం బీసీలుంటే జగన్ రెడ్డి అమలుచేసే పథకాలు కేవలం లక్షమందికి మాత్రమే అందుతున్నాయి.

స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు బీసీలకు స్థానికసంస్థల్లో 34శాతం రిజర్వేషన్లుఇస్తే, జగన్ వాటిని 24శాతానికి తగ్గించాడు. రిజర్వేషన్లు తగ్గించి, బీసీలకు 16,800 స్థానిక పదవు లు దక్కకుండా చేశాడు. అధికారంలోకి వచ్చాక జగన్ రెడ్డి, 2,500 బీసీలపై దాడులు చేయించాడు. టీడీపీకి చెందిన ముఖ్యమైన బీసీనేతల్ని అతిదారుణంగా హత్య చేయిం చాడు. చంద్రబాబు 16లక్షలమంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ అందిస్తే, జగన్ రెడ్డి 10లక్షల మందికే ఇస్తున్నాడు. విద్యుత్ బిల్లు ఎక్కువని, స్థలం, సొంతిల్లు ఉందని 6లక్షల మంది విద్యార్థుల నోట్లో మట్టికొట్టాడు. టీడీపీ ప్రభుత్వం విదేశీ విద్యాదీవెన పథకం కింద వందలమంది బీసీ విద్యార్థుల్ని విదేశాలకు పంపింది. జగన్ హయాంలో ఒక్క బీసీ యువకుడు అయినా ప్రభుత్వప్రోత్సాహంతో విదేశాలకు వెళ్లాడా? టీడీపీప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో గతంలో చేనేత కార్మికులు రూ.లక్షనుంచి రూ.2లక్షలవరకు అర్జించారు. జగన్ దెబ్బతో ఇప్పుడు నేతకార్మికులకు పూట గడవ డమే కష్టంగా మారింది. ఆప్కోను జగన్ రెడ్డి సర్వనాశనం చేశాడు. మత్స్యకారులకు టీడీపీప్రభుత్వం 50ఏళ్లకే పింఛన్ ఇచ్చింది. వేట నిషేధసమయంలో వారికి నెలవారీ భత్యం అందించింది. వేటకు అవసరమైన వలలు, బోట్లు, ఇతరసామగ్రిని 100శాతం సబ్సిడీపై అందించింది. జగన్ వచ్చాక మత్స్యకారుల పరిస్థితి అధ్వాన్నంగా తయా రైంది. ఎన్.హెచ్.డీ.బీ, ఎన్.ఎఫ్.డీ.బీ వంటి కేంద్రప్రభుత్వ పథకాల సాయం కూడా మత్స్యకారులకు అందకుండా చేశాడు. జీవోనెం 217 తో చెరువులపై మత్స్యకారులకు ఉన్న హక్కుల్ని కాలరాశాడు. ఇలా బీసీల్లోని ప్రతి వర్గాన్ని జగన్ రెడ్డి దారుణంగా వంచించాడు.. ఇప్పటికీ కల్లబొల్లి మాటలతో వంచిస్తున్నాడు.

డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ ఫర్ (డీబీటీ) ద్వారా బీసీలను ఉద్ధరిస్తున్నానని జగన్ రెడ్డి చెప్పడం సిగ్గుచేటు. డీబీటీ విధానానికి శ్రీకారం చుట్టిందే చంద్రబాబు. రైతుభరోసా, పసుపు-కుంకుమ, యువతకు అందించిన నిరుద్యోగభృతి, కార్పొరేషన్ల ద్వారా ఇచ్చి న రుణాలన్నీ టీడీపీప్రభుత్వం డీబీటీ విధానంలోనే అందించింది. తన దోపిడీని, అవినీతిని, రాక్షసపాలనను కప్పిపుచ్చుకోవడానికే జగన్ రెడ్డి బటన్ నొక్కుతు న్నానంటూ ప్రజల్ని వంచిస్తున్నాడు. వ్యక్తిస్వేఛ్చ లేని రాష్రం్క దేశంలో ఏపీ ఒక్కటే. ప్రజాస్వామ్యం అంటేనే వ్యక్తిగత స్వేచ్ఛ, సమానత్వం. కానీ జగన్ పాలనలో ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి ఉందా?

జగన్ రెడ్డి డేరాబాబా, పిరికిసన్నాసి, అందుకు ప్రజల్లోకి రావడానికి భయపడుతు న్నాడు. లోకేశ్ జనమే అండగా పాదయాత్రలో దూసుకెళ్తున్నాడు
జగన్ రెడ్డి ఏపీ డేరా బాబా. డేరాల్లో, పరదాల చాటున దాక్కుంటూ, సిగ్గులేకుండా సింహాన్ని అంటున్నాడు. చంద్రబాబు స్థాయిఏమిటో.. నీ బతుకేంటో తెలుసుకో జగన్ రెడ్డి. జైలుపక్షులకు జనం మెచ్చిన నేతల గురించి తెలియదని జగన్ వ్యాఖ్యలతో అర్థ మైంది. టీవీ5, ఏబీఎన్, ఈనాడు, ఆంధ్రజ్యోతిలను చూసి సింహం ఎందుకు వణుకుతోంది? జగన్ రెడ్డి సింహంకాదు.. పులివెందుల పిల్లి. అందుకే గాలికే భయపడి చెట్లు కూడా లేకుండా చేస్తున్నాడు. పిరికిసన్నాసి కాబట్టే జనంలోకి రావడానికి జంకు తున్నాడు. టీడీపీ యువకెరటం కుప్పం నుంచి మొదలెట్టిన యువగళం యాత్ర ప్రభంజనం ధాటికి జగన్ రెడ్డి అతని అవినీతి సర్కార్ కొట్టుకుపోవడం ఖాయం. ప్రజలే అండగా లోకేశ్ నడుస్తుంటే, సింహాన్ననే జగన్ రెడ్డి పోలీసులు, ప్రైవేట్ సెక్యూరిటీ, పరదాల మధ్య నక్కినక్కి దాక్కుంటున్నాడు. లోకేశ్ పాదయాత్రలో ఏపీ పోలీసులు ఎలా వ్యవహరిస్తున్నారో వారే తెలుసుకోవాలి. కర్ణాటక పోలీసుల్ని చూసి అయినా సిగ్గుతెచ్చుకోండి. పోలీసులంటే పబ్లిక్ సర్వెంట్స్.. పొలిటికల్ సర్వెంట్స్ కాదని గుర్తిం చండి. ప్రజాస్యామ్య రక్షణకోసం పోలీసులు కృషిచేస్తే చరిత్రలో హీరోలుగా నిలిచి పోతారు. వైసీపీ కనుసన్నల్లో, జగన్ రెడ్డి ఆదేశాలతో పనిచేస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారు. దుర్మార్గులు, దౌర్జన్యకారులకు ఊడిగం చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తే మాత్రం అందుకు తగిన మూల్యం చెల్లించుకుంటారు” అని రవీంద్ర హెచ్చరించారు.

LEAVE A RESPONSE