-జగన్ రెడ్డి పతనం ఆరంభమైంది
-మేం ప్రతిచర్యలకు దిగితే తట్టుకోలేరు
-టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు
అమరావతి ,నవంబర్ 4: టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్షోరలో వైసీపీ రౌడీమూకలు రాళ్లు రువ్వడాన్ని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. నియంత పోకడలతో రౌడీపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పతనం ప్రారంభమైంది. ఆయన ఇదే పోకడ కొనసాగిస్తే ప్రజలనుంచి తిరుగుబాటు ఖాయం.
పులివెందుల రాజకీయాలు రాష్ట్రమంతా కొనసాగిస్తామంటే కుదరదు. వైసీపీ ప్రభుత్వంలో దౌర్జన్యం, రౌడీయిజం, అఘాయిత్యాలు, దురాగతాలు పరాకాష్టకు చేరాయి, ఫాసిజం రాజ్యామేలుతుంది. జగన్ రెడ్డి రాక్షస పాలనకు ప్రజలు బుద్దిచెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. చంద్రబాబునాయుడు సభలో రాళ్లు రువ్విన వైసిపి గూండాలను తక్షణమే అరెస్టు చేసి ఆ సంఘటనపై సమగ్ర విచారణ జరిపించాలి. దోషులెంతటివారైనా కఠినంగా శిక్షించాలి. వైసిపి చర్యల కారణంగా మేం ప్రతిచర్యలకు దిగితే తట్టుకోలేరు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తితే అందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే బాధ్యత వహించాల్సి ఉంటుందని బోండా ఉమామహేశ్వరరావు హెచ్చరించారు.
రాష్ట్రంలో ఫాసిజం రాజ్యమేలుతోంది
చంద్రబాబు నాయుడు కాన్వాయ్ పై రాళ్ల దాడి వైసీపీ రౌడీ రాజకీయానికి పరాకాష్ట: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు
చంద్రబాబు నాయుడు కాన్వాయ్ పై రాళ్ల దాడి వైసీపీ రౌడీ రాజకీయానికి పరాకాష్ట.చంద్రబాబు సభలకు వస్తున్న ప్రజా స్పందన చూసి ఏసీలో ఉండి కూడా జగన్ రెడ్డి కి చెమటలు పడుతున్నాయి.ఒక పార్టీ జాతీయ అధ్యక్షునిపై దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు ? జగన్ రెడ్డి నీ రౌడీ రాజకీయాలతో మమ్మల్ని భయపెట్టాలనుకోవడం పగటి కల.చంద్రబాబు నాయుడు కనుసైగ చేస్తే మా కార్యకర్తల చేతిలో వైసీపీ గుండాల పరిస్థితి ఏంటి? అధికారం ఉంది కదా అని బరి తెగిస్తే బడితే పూజ తప్పదు.దాడి చేసిన వారిని, దాడి చేయించిన వారిని వెంటనే అరెస్టు చేయాలి.
బాంబులకే భయపడని వ్యక్తి నీ గులక రాళ్ళకు భయపడతారా జగన్ రెడ్డి ?: – యనమల రామకృష్ణుడు
చంద్రబాబు నాయుడు కాన్వాయ్ పై రాళ్ల దాడి పిరికిపంద చర్య. జగన్ రెడ్డి నాగరిక సమాజంలో అనాగరిక చర్యల్నిప్రోత్సహిస్తున్నారు. జగన్ రెడ్డి పట్టపగలే ప్రజాస్వామ్యన్ని హత్య చేస్తున్నారు. తమ కార్యకర్తలకి ఎదుటివారిపై దాడులు చేయమని లైసెన్సులు ఇచ్చి జగన్ రెడ్డిరోడ్ల మీదకి వదిలినట్టున్నారు.బాంబులకే భయపడని వ్యక్తి నీ గులక రాళ్ళకు భయపడతారా జగన్ రెడ్డి ?ప్రజల నుంచే తిరుగుబాటు వచ్చే రోజు దగ్గరలోనే ఉంది. జగన్మోహన్రెడ్డి పతనం మొదలైంది పులివెందుల రౌడీయిజం తో రాజకీయాలు చేద్దాం అంటే కుదరదు. పార్టీ జాతీయ అధ్యక్షునిపై దాడి జరుగుతుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారా? ఈ ఘటనకు ముఖ్యమంత్రి, డీజీపీ వహించాలి.