యువత భవిత నిర్వీర్యం చేయడమే గాక, చంద్రబాబు ఇమేజ్ డ్యామేజ్ చేయాలన్నదే జగన్ రెడ్డి దురాలోచన
• పిచ్చి ఆలోచనలతో ముందుకెళ్తున్న జగన్ రెడ్డి నిర్ణయాలతో అంతిమంగా దెబ్బతినేది రాష్ట్రాభివృద్ధి, యువత భవిష్యత్తే
• డబ్బు నిజంగా దుర్వినియోగమైతే స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ ద్వారా 2,13,000 మంది యువత శిక్షణ ఎలా పొందారు.. 70 వేలమందికి ఉపాధి ఎలా లభించింది?
• స్వయంగా వైసీపీ ప్రభుత్వంలో మంత్రి అయిన మేకపాటి గౌతమ్ రెడ్డి అసెంబ్లీలో టీడీపీ ప్రభుత్వంలో 5లక్షల యువతకు ఉద్యోగాలు వచ్చాయని ఎలా చెప్పాడు?
• జగన్ రెడ్డి నియంత్రత్వ విధానం భవిష్యత్ లో రాష్ట్ర యువతకు పెద్ద గొడ్డలి పెట్టుగా మారనుంది
టీడీపీ హెచ్.ఆర్.డీ విభాగం ఛైర్మన్ బీ.రామాంజనేయులు
చంద్రబాబుని అక్రమంగా నిర్బంధించడంపై యావత్ రాష్ట్రం దిగ్భ్రాంతి చెందుతోందని, యువత జగన్ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉందని, యువత మేలుకోసం తీసుకొచ్చిన గొప్ప స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ ను జగన్ రెడ్డి, అతని ప్రభుత్వం కక్షసాధింపులకు వినియోగించుకోవడం దురదృష్టకరమని టీడీపీ హెచ్.ఆర్.డీ ఛైర్మన్ బీ.రామాంజనే యలు తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…
“ రాష్ట్రంలోని యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలకు ఉపయోగపడే నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసమే టీడీపీప్రభుత్వం స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ తీసుకొచ్చింది. 2013 నుంచి గుజరాత్ లో అమల్లో ఉన్న ప్రాజెక్ట్ పరిశీలించడానికి ప్రత్యేకంగా రాష్ట్రం నుంచి అధికారుల్ని పంపిన చంద్రబాబు, 2015లో దాన్ని ఏపీలో ప్రారంభించారు. ప్రాజెక్ట్ కోసం సీమెన్స్ సంస్థ, డిజైన్ టెక్ సంస్థలతో నాటి టీడీపీప్రభుత్వం ఒప్పందం చేసుకుం ది. పేద, బడుగు బలహీన వర్గాల యువతనుంచి రూపాయి తీసుకోకుండా, వారికి మంచి శిక్షణ అందించాలన్న సదుద్దేశంతో ఏర్పాటైన స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ ద్వారా 2019 మేనాటికి రాష్ట్రంలో 5,13,000ఉద్యోగాలు కల్పించబడ్డాయని, 39వేల పరిశ్రమల్లో రాష్ట్రయువతకు ఉపాధి లభించిందని నాటి పరిశ్రమల శాఖా మంత్రి మేక పాటి గౌతమ్ రెడ్డే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు.
నాడు ఆయన చెప్పిన దాన్ని బట్టి, చంద్రబాబు అనుకున్నట్టే యువతకు ఉద్యోగాలు లభించాయికదా! అలా యువత భవి తకోసం సదుద్దేశంతో ఏర్పాటుచేసిన ప్రాజెక్ట్ లో అవినీతి జరిగిందని, తమ చెప్పుచేత ల్లోని సీఐడీ సంస్థను ఉపయోగించి చంద్రబాబుని కుట్రతో అరెస్ట్ చేయడం జరిగింది. చంద్రబాబుని అరెస్ట్ చేశాకే ఎఫ్.ఐ.ఆర్ లో ఆయన పేరు 37 నిందితుడిగా చేర్చారు. మరలా వెంటనే మొదటిముద్దాయిగా మార్చారు.
20నెలలుగా స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ పై విచారిస్తున్నదర్యాప్తుసంస్థ సీఐడీ అంతకుముందు ఆయన పేరు ఎఫ్.ఐ.ఆర్ లో చేర్చలేదు. దేశం గర్వించే నాయకుడైన చంద్రబాబుని ఇబ్బంది పెట్టాలన్న లక్ష్యం తప్ప, రాష్ట్రయువతకు జరిగే నష్టం, రాష్ట్ర పరువుప్రతిష్టల గురించి ఈ ప్రభుత్వం ఆలో చించలేదు. చంద్రబాబు ఇమేజ్ దెబ్బతీస్తే రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయి.. యువతకు ఉపాధి, ఉద్యోగాలు ఎలా లభిస్తాయనే ఆలోచన ఈ ప్రభుత్వం చేయలేదు.
స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ పరిధిలోని శిక్షణా కేంద్రాలు తనిఖీచేయకుండా, వాటిలో అన్నిరకాల పరికరాలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉందో లేదో పరిశీలించకుం డా అవినీతి జరిగిందని సీఐడీ ఎలా చెబుతుంది? ఏం ఆధారాలున్నాయని చంద్రబాబు ని ఈ కేసులో ముద్దాయిగా చేర్చారు? సీఐడీ అధికారులు పద్ధతి ప్రకారం వ్యవహరించ లేదు. ప్రాజెక్ట్ కు సంబంధించిన ఫైళ్లే లేకుండా సీఐడీ ఏకపక్షంగా చంద్రబాబుపై తప్పు డు కేసు పెట్టడం ముమ్మాటికీ ప్రభుత్వ, పాలకుల కక్షసాధింపేనని స్పష్టమవుతోంది.
స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ అమలుకు సంబంధించిన వ్వవహారంలో ఎక్కడా చంద్రబా బు సంతకం లేదు. ఏ ఫైల్ పై ఆయన సంతకం పెట్టలేదు. మొత్తం ప్రాజెక్ట్ అమలు.. పరిశీలన అంతా అధికారులే చేశారు. సీమెన్స్ సంస్థ సాఫ్ట్ వేర్ అందిస్తే, డిజైట్ టెక్ క్షేత్ర స్థాయిలో దాన్ని సమర్థవంతంగా అమలుచేసింది. డిజైన్ టెక్ సంస్థ ఎండీ వికాస్ కన్విల్కరే స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లోఎలాంటి అవినీతి జరగలేదని స్పష్టంగా చె బుతున్నారు. మా దగ్గర పొరపాట్లు జరగలేదని జీఎస్టీ వాళ్లు పొరపాటు జరిగిందని చెబుతున్నారు కాబట్టి.. ఆ అంశాన్ని తాముకోర్టులో తేల్చుకుంటామని డిజైన్ టెక్ ఎండీ చెబుతుంటే, సదరు వ్యవహారాన్ని చంద్రబాబుకి అంటగట్టడం ఎంతవరకు సమం జసం?
ప్రభుత్వంలో వివిధ వ్యవహారాలకు సంబంధించి వేలకోట్ల రూపాయాల ట్రాన్సా క్షన్స్ జరుగుతుంటాయి. అవన్నీ ముఖ్యమంత్రులే స్వయంగా చేస్తారనుకోవడం తప్పు. ఒక ఒప్పందం ద్వారా అమల్లోకి వచ్చిన ప్రాజెక్ట్ కు అధికారులు డబ్బులిస్తే, దానికి చంద్రబాబు ఎలా బాధ్యుడవుతారు? డబ్బు నిజంగా దుర్వినియోగమైతే ప్రాజెక్ట్ కింద 2,13,000 మంది యువత శిక్షణ ఎలా పొందారు… 70 వేలమంది యువత ఉపాధి ఎలా పొందారు. జగన్ రెడ్డి ప్రస్తుతం చేసిన పని భవిష్యత్ లో రాష్ట్రయువతకు పెద్ద గొడ్డలిపెట్టుగా మారనుంది.
డిజైన్ టెక్ సంస్థ ఎండీ వికాస్ కన్విల్కర్ వ్యాఖ్యల్ని ప్రామాణికంగా తీసుకోవడమో, ఆడిట్ సంస్థల నివేదికల్ని పరిగణనలోకి తీసుకోవడం కాకుండా కేవలం చంద్రబాబు ఇమేజ్ డ్యామేజ్ చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్న జగన్ ప్రభుత్వ అహంకారపూరిత విధానం భవిష్యత్ యువత జీవితాలను దారుణంగా దెబ్బతీస్తుంది అని చెప్పక తప్పదు.
రాజకీయ కక్షకోసం అనవసర రాద్దాంతాలను తెరపైకి తేవడం వల్ల అంతిమంగా నష్టపోయేది రాష్ట్రమేనని ప్రభుత్వం గ్రహించాలి. బాబు ష్యూరిటీ – భవిష్యత్ కు గ్యారెంటీ అనే చంద్రబాబు కార్యక్రమం ప్రజల్లోకి వెళితే కచ్చితంగా తమప్రభుత్వం నామరూపాల్లేకుండా పోతుందన్న భయం తోనే, జగన్ రెడ్డి ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు” అని రామాంజనేయులు స్పష్టంచేశారు.