Suryaa.co.in

Andhra Pradesh

బీసీల నోరునొక్కడమే జగన్ రెడ్డి లక్ష్యమా?

-మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులుపై వరుస కేసులు బనాయించిన బీసీల ద్రోహి జగన్ రెడ్డి
-టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు

బడుగు బలహీన వర్గాలపై అరాచకాన్ని సృష్టిస్తున్న జగన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నందుకు మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులుపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. వరుస కేసులు నమోదు చేస్తూ వేదింపులకు గురి చేస్తూ జగన్మోహన్ రెడ్డి పెత్తందారి తనం మరొక సారి రుజువు చేసుకున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై నిరసన తెలిపినందుకు అక్రమ కేసు పెట్టడం హేయం. అన్ని కేసుల్లోనూ కాలవనే మొదటి ముద్దాయిగా చేర్చిన పోలీసులు. శాంతియుత నిరసనలపై పోలీసులు కావాలనే కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారు.

రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలను రెండు గంటలపాటు ట్రాఫిక్ జామ్ చేసి మరీ చిందులేసిన వైసీపీపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చట్టం అందరికీ సమానమైనప్పుడు కేవలం ప్రతిపక్ష నాయకులపై కేసులెందుకు పెడుతున్నారు. ఆదివారం అర్ధరాత్రి రాయదుర్గం ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఉన్న టీడీపీ దీక్షా శిబిరాన్ని బలవంతంగా ఖాళీ చేయించారు. ప్రతిపక్ష పార్టీలు ఎటువంటి కార్యక్రమానికి పిలుపునిచ్చినా వెంటనే ముందస్తు అరెస్ట్ లు ఇవ్వడం పోలీసులకు పరిపాటిగా మారింది.

చట్టాన్ని జగన్ రెడ్డి చుట్టంలా వాడుకుంటూ కొంత మంది పోలీసులను వైసీపీ ప్రైవేటు సైన్యంలా మార్చుకొని అరాచకానికి నాంది పలుకుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా ప్రతిపక్ష నాయకులకు మాట్లాడే స్వేచ్ఛ లేదు. ఆఖరికి బీసీలు గాలి పీల్చాలన్నా జగన్ రెడ్డి పర్మిషన్ కావాలంటారేమో? ఇంతటి నిరంకుశత్వ పాలనకు చరమ గీతం పాడే తరుణం ఆసన్నమైంది. జగన్ రెడ్డి అరాచకాన్ని బడుగు బలహీన వర్గాలు బరించలేకపోతున్నారు.

ఏపీ నీడ్స్ జగన్ కాదు ఏపీ హేట్స్ జగన్ అని ప్రజలు పిలుపునిస్తున్నారు. జగన్ రెడ్డికి జనానికి జరగబోవు ఎన్నికల కురుక్షేత్రంలో వైసీపీ పాలన అంతం ప్రజల పంతంగా సాగనుంది. ఈ ఐదేళ్లు రాష్ట్రంలో ఒక చీకటి అధ్యాయంలా ముగిసోనుంది.

LEAVE A RESPONSE