Suryaa.co.in

Andhra Pradesh

ఇక జగన్ రెడ్డి హాలిడే తీసుకోవడం మాత్రమే మిగిలివుంది

– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

పవర్ హాలిడే, క్రాప్ హాలిడే, ఇప్పుడు ఆక్వా హాలిడే… ఇక జగన్ రెడ్డి హాలిడే తీసుకోవడం మాత్రమే మిగిలివుంది. ఆక్వా రంగాన్ని ఉద్ధరిస్తానని నమ్మించి దగా చేసారు జగన్ రెడ్డి. వైసిపి ప్రభుత్వ అసమర్ధతతో ఆక్వా రంగం సంక్షోభంలో పడింది. పెరిగిన విద్యుత్ ఛార్జీలు, దాణా ఖర్చులు, నిర్వహణ ఖర్చులతో ఆక్వా రైతులు కుదేలయ్యారు. వంద కౌంట్ కిలో రొయ్య ఉత్పత్తి కి రూ.270 ఖర్చవుతుంటే కనీసం రూ.200 కూడా రాక రైతులు ఆక్వా హాలిడే ప్రకటిస్తున్నారు. కొత్త చట్టాల పేరుతో ఆక్వా రైతులను, ప్రాసెసింగ్ ప్లాంట్స్ నిర్వహిస్తున్న వారిని వేధిస్తూ వైసిపి నేతలు కోట్లు దండుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి ఆక్వా రైతులను ఆదుకోవాలి. జోన్ తో సంబంధం లేకుండా ఆక్వా రైతులందరికి యూనిట్ విద్యుత్ ని రూ. 1.50 కే అందించాలి. దాణా, ఇతర సామాగ్రిని రాయితీకి ఇవ్వాలి. మద్దతు ధర ప్రకటించాలి.

LEAVE A RESPONSE