Suryaa.co.in

Andhra Pradesh

బీసీ జనగణనపైనా జగన్ రెడ్డి రాజకీయం

-కీలకమైన జనగణనపై చిత్తశుద్ధి ఏది జగన్ రెడ్డీ?
-పదే పదే వాయిదాలు వేయడం ఎవరి ప్రయోజనాల కోసం?
– శాసన మండలి సభ్యులు పంచుమర్తి అనురాధ

బీసీ జనగణన విషయంలో జగన్ రెడ్డి రాజకీయం చేయడం తప్ప కించిత్తు చిత్తశుద్ధి చూపడం లేదు. నాలుగున్నర సంవత్సరాలుగా జనగణన బిల్లును గాలికొదిలేసిన జగన్ రెడ్డి, ఇప్పుడు తానే చేయిస్తానంటూ ఎన్నికల ముందు హడావుడి చేయడం సిగ్గుచేటు. ఎన్నికలకు ఆరు నెలల ముందు శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాలు దుర్మార్గం అన్న జగన్ రెడ్డి.. ఇప్పుడు జనగణన విషయంలో ఏం సమాధానం చెబుతారు?

తొలుత నవంబరులో ప్రారంభమవుతుందని చెప్పిన జగన్ ముఠా ఇప్పటికే మూడు సార్లు వాయిదా వేసింది. ఇప్పుడు వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ఇతర కార్యక్రమాల్లో ఉన్నందున వాయిదా వేస్తున్నామని ప్రకటించడం నీచ రాజకీయానికి నిదర్శనం. అసలు జనగణన చేసేందుకు వాలంటీర్లకు ఏం హక్కులున్నాయి? వాలంటీర్లు ప్రభుత్వ సిబ్బంది కాదు అని ముఖ్యమంత్రే స్వయంగా చెప్పినపుడు.. వారికి జనగణన బాధ్యతలు ఏ విధంగా అప్పగిస్తారు? వారు చేసే జనగణనకు ఏం చట్టబద్దత ఉంటుంది? జన గణనపై జగన్ రెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి చట్టబద్దంగా చేయాల్సిందే. అలా కాకుండా ఎన్ని రకాలుగా మభ్యబెట్టే ప్రయత్నం చేసినా.. రాష్ట్రంలోని బీసీలు క్షమించరని గుర్తుంచుకో.

LEAVE A RESPONSE