Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రంలో జగన్ రెడ్డి సైకో పాలన మితిమీరుతోంది

-యుగానికో రాక్షసుడు పుడతాడనేది.. జగన్ రెడ్డిని చూస్తే నిజమనిపిస్తోంది
-43వేల కోట్ల స్కాములు చేసిన జగన్ రెడ్డి.. నేడు బీద అరుపులు అరుస్తున్నాడు
-మంత్రులు అలీబాబా 40 దొంగల్లా రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారు
-అవసరమైతే పస్తులుంటాం గానీ.. జగన్ రెడ్డికి బీసీలు తలొంచరని నిరూపిద్దాం
-బీసీల దమ్మేంటో.. బీసీల దెబ్బ ఎలా ఉంటుందో వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డికి చూపిద్దాం
-దూదేకుల-నూర్‌బాషా, వాల్మీకి బోయ, అరికటిక, ఎంబీసీ నేతల శిక్షణా కార్యక్రమంలో కొల్లు రవీంద్ర

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఒక విప్లవమైతే.. బీసీలకు రాజ్యాధికారం కల్పించడం, సామాజికంగా, ఆర్ధికంగా వృద్ధిలోకి తెచ్చేందుకు తీసుకున్న నిర్ణయాలు చారిత్రాత్మకం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీసీల చరిత్ర రాయాలనుకుంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు ఆ తర్వాత అనేంతలా బీసీలను అక్కున చేర్చుకున్న పార్టీ తెలుగుదేశం అని తెలుగుదేశం పార్టీ బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు, పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో బీసీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వీరంకి వెంకట గురుమూర్తి అధ్యక్షతన దూదేకుల-నూర్‌బాషా, బోయ వాల్మీకి, అరికటిక, ఎంబీసీ నేతల శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.

కొల్లు రవీంద్ర మాట్లాడుతూ… గతంలో రాజకీయంగా ఆర్ధికంగా సామాజికంగా వెనుకబడిన బీసీలకు ఎన్టీఆర్ చొరవ తీసుకుని రాజకీయ అవకాశాలు కల్పించారు. స్థానిక సంస్థల్లో 20శాతం రిజర్వేషన్లు కల్పించారు. అదే స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు రిజర్వేషన్లను 34 శాతానికి పెంచి గ్రామస్థాయిలో రాజకీయ అవకాశాలు కల్పించారు. ఇప్పుడు కూడా తక్కువ జనాభా కలిగిన కులాలకు సైతం రాజకీయ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో సాధికార సమితులను ఏర్పాటు చేశారు.

గ్రామస్థాయిలో బీసీలు రాజకీయాల్లోకి రావాలని, తాము అభివృద్ధి చెందడమే కాకుండా సమాజాభివృద్ధిలోనూ బీసీలు భాగస్వాములుగా ఉండాలని భావిస్తున్నారని తెలిపారు. ప్రతి సాధికార సభ్యుడూ గ్రామస్థాయిలో సమస్యల్ని గుర్తించాలి. జగన్ రెడ్డి చేస్తున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించాలి. సాధికార సభ్యులు ఇచ్చే సమాచారంతోనే జిల్లా స్థాయిలో మేనిఫెస్టో రూపొందించి, సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధికి మార్గదర్శకాలు రూపొందించేలా చంద్రబాబు గారిని ఒప్పిస్తాను. పదవులు తీసుకున్న వారంతా ప్రజల్లోకి వెళ్లినపుడు ఎవరూ సిఫార్సు చేయాల్సిన అవసరం లేకుండానే భవిష్యత్తులో మెరుగైన అవకాశాలు వస్తాయని తెలిపారు.

రాష్ట్రంలో సైకోని మించిన పాలన జగన్ రెడ్డి చేస్తున్నాడు. యుగానికో రాక్షసుడు వస్తాడంటే ఏమో అనుకున్నాం. జగన్ రెడ్డిని చూశాక నిజమే అనిపిస్తోంది. అధికారం కోసం సొంత బాబాయిని చంపేశారు. తొలుత చంద్రబాబు చేయించారన్నారు. తర్వాత అక్రమ సంబంధం అన్నారు. కూతురు చంపిందన్నారు. ఆస్తుల కారణంగానే అన్నారు. వివేకా హత్యపై జగన్ రెడ్డి చేసిన అరాచకాలతో సీరియల్ తీస్తే పదేళ్లైనా నడుస్తూనే ఉంటుందని చమత్కరించారు. ధర్మానికి విరుద్ధంగా నడిచేవారిని ప్రకృతి క్షమించదని వివేకా హత్య, కోడికత్తి లాంటి కేసుల్లో జగన్ రెడ్డి అవస్థలు చూస్తే ఎవరికైనా అర్ధమవుతుంది. 43వేల కోట్ల కుంభకోణం కేసులో బెయిల్‌పై ఉన్న వ్యక్తికి రాష్ట్రాన్ని అప్పగించి దాని దుష్ఫలితాలు అనుభవిస్తున్నాం.

అలాంటి వ్యక్తి ఇప్పుడు నాకు పేపర్లు లేవు, ఛానళ్లు లేవు, నేను బీదవాడిని అంటూ బీద అరుపులు అరుస్తున్నాడు. సాక్షి పేపర్, ఛానల్, సండూర్ పవర్, భారతి సిమెంట్స్ ఎవరివో జగన్ రెడ్డే సమాధానం చెప్పాలి. దేశంలోనే రిచ్ఛెస్ట్ సీఎం ఉన్న రాష్ట్రం.. ప్రతి రోజూ అప్పులు చేస్తేనే జీతాలివ్వలేని దుస్థితి హాస్యాస్పదంగా ఉందన్నారు. జగన్ రెడ్డి హోల్ సేల్ గా దోచుకుంటుంటే.. వారి మంత్రులు ఆలీబాబా 40 దొంగల మాదిరిగా.. రాష్ట్రాన్ని పీక్కుతింటున్నారు. కేబినెట్లోని బీసీ మంత్రులు తమ పదవులు, తమ దోపిడీ కోసం జగన్ రెడ్డికి ఊడిగం చేస్తున్నారు.

బీసీలు ఆత్మాభిమానం కలిగిన వారు. అవసరమైతే పస్తులుంటారే తప్ప.. తలవంచరు. బీసీలు ఆది నుండి తెలుగుదేశం పార్టీతోనే ఉంటున్నారు. ఆ విషయం తెలిసే.. బీసీలను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నాడు. చదువుకుంటే అభివృద్ధి చెందుతారనే భయంతో.. బీసీలకు చదువులు దూరం చేస్తున్నాడు. విదేశాల్లో చదువుకునే అవకాశాల్ని నాశనం చేశాడు. అసెంబ్లీలో ప్రశ్నిస్తున్నారన్న కక్షతో అచ్చెన్నాయుడిపై, మండలిలో ప్రశ్నిస్తున్నారనే కక్షతో యనమల రామకృష్ణుడిపై తప్పుడు కేసులు పెట్టారు.

గౌరవంగా బ్రతికే నాపై కూడా తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టారు. ప్రజాక్షేత్రంలో జగన్ రెడ్డిని చీల్చి చెండాడుతున్నాడన్న కక్షతో 68 సంవత్సరాలున్న అయ్యన్నపై రేప్ కేసు పెట్టారు. 26 మందిని హత్య చేశారు. 650 మందిపై తప్పుడు కేసులు పెట్టారు. 2500 మందిపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడ్డారన్నారు.

బీసీల్లోని అన్ని కులాలను ఏకం చేసేందుకే సాధికార కమిటీలను ఏర్పాటు చేసుకున్నాం. అన్ని కులాల స్థితిగతుల్ని తెలుసుకుందాం. అధికారంలోకి వచ్చాక ఆయా కులాలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చే బాధ్యత నేను తీసుకుంటాను. ప్రజాక్షేత్రంలో పని చేసి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేద్దాం. బీసీలకు అండగా నిలిచే తెలుగుదేశం పార్టీని గెలిపించుకుని, రాజకీయంగా సామాజికంగా ఆర్ధికంగా పురోగతి సాధిద్దాం. బాబుని గెలిపించుకుందాం.. బంగారు భవిష్యత్తును సాధించుకుందాం. కష్టబడేవారికి న్యాయం చేసే బాధ్యత తాను తీసుకుంటా అన్నారు.

పోలీస్ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ ఛైర్మన్ నాగుల్ మీరా మాట్లాడుతూ.. బీసీలు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారు. బీసీలకు అండగా ఉండేది కూడా తెలుగుదేశం పార్టీ మాత్రమే. జగన్ రెడ్డి వచ్చాక బీసీలను అణగదొక్కడం తప్ప చేసిందేమీ లేదు. నిధుల్లేవు. విధుల్లేవు. రాజకీయ అవకాశాలూ లేవు. అన్నింటినీ సొంత వారికి కట్టబెట్టి బీసీలను ఉద్దరించాను అంటూ దగాతో కూడిన రాజకీయం చేస్తున్న జగన్ రెడ్డికి బీసీలంతా ఏకమై బుద్ధి చెప్పాలన్నారు.

కోనేరు సురేష్ మాట్లాడుతూ.. ఎన్నికలు అంటే ప్రజాస్వామ్య స్ఫూర్తి అనే విధానం ప్రస్తుతం జగన్ రెడ్డి నాశనం చేశాడు. ఎన్నికలు అంటే నెంబర్ గేమ్. గెలిచిన వాడిదే రాజ్యం. జగన్ రెడ్డి చేసే అరాచకాలు వచ్చే ఎన్నికల్లో మరింత ఎక్కువగా ఉండబోతున్నాయి. ఓటర్ జాబితాలను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి. లేకుంటే ఈ రోజు ఉన్న ఓటు రేపు ఉంటుందో లేదో కూడా తెలియని పరిస్థితులు నెలకొంటున్నాయన్నారు.

తెలుగుదేశం పార్టీ బీసీ ఫెడరేషన్ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ గంజాం రాఘవేంద్ర మాట్లాడుతూ.. సోషల్ మీడియా వేధికగా ప్రస్తుతం రాజకీయ ప్రచారం మొత్తం నడుస్తోంది. గతంలో మీడియా ప్రతినిధులు రావడం, జరిగినది ఎప్పటికో పేపర్లోనో, ఛానళ్లోనో ప్రచురించేవారు. అది ప్రజల్లోకి కూడా అంతగా చేరేది కాదు. కానీ ప్రస్తుతం మనం ఏం చేస్తున్నామో మనమే చెప్పుకునే అవకాశం వచ్చింది.

అరచేతిలో ఉన్న సెల్ ఫోన్ అతిపెద్ద సాధనం. దాన్ని సక్రమంగా వినియోగించుకుంటే మనమే కింగ్స్. జగన్ రెడ్డి చేసిన అన్యాయాన్ని, అరాచకాన్ని, ద్రోహాన్ని ప్రజలకు ఎప్పటికప్పుడు వివరిద్దాం. సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా సమాజాన్ని చైతన్యపరుద్దాం అన్నారు.

హెచ్.ఆర్.డి. సభ్యుడు ఎస్.పి.సాహెబ్ మాట్లాడుతూ..సంక్షేమం పేరుతో జగన్ రెడ్డి అంకెల గారడీ చేయడం తప్ప.. సంక్షేమం రాష్ట్రంలో ఎక్కడుంది? ఒక కుటుంబానికి సంవత్సరానికి రూ.10 వేలు చేతిలో పెట్టి నిత్యావసర వస్తువుల దరలు పెంచి, పన్నులు పెంచి ఏటా లక్షకు పైగా లాగేస్తున్నాడు. ఇదేనా సంక్షేమం? పనిముట్లు అందించి, సబ్సిడీలు అందించి, స్వయం ఉపాధి కల్పించి సొంత కాళ్లపై నిలబడేలా చేస్తేనే వారు, వారి పిల్లలు భవిష్యత్తులో మెరుగైన జీవనం సాగిస్తారు. అలా కాకుండా డబ్బులు పంచాను అదే సంక్షేమం అనడం ఏ విధమైన సంక్షేమం అవుతుందో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.

కార్యక్రమంలో నూర్ భాషా సాధికార సమితి కన్వీనర్ సుభాన్ సాహెబ్, వాల్మీకి బోయ సాధికార సమితి కన్వీనర్ పూల నాగరాజు, ఎంబిసి సాధికార సమితి కన్వీనర్ పెండ్ర రమేష్, అరికటిక సాధికార సమితి కన్వీనర్ నరీష్ కుమార్, నాలుగు సాధికార సమితుల కో-ఆర్దినేటర్ దేవళ్ల మళ్లికార్జున, మాజీ ఐపీఎస్ షేక్ షా వలి, అనంతపురం మాజీ ఎంపీపీ రజియ బీ సహా పలువురు బీసీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE