Suryaa.co.in

Andhra Pradesh

దళితులు రాష్ట్రాన్ని విడిచి వెళ్లే విధంగా జగన్ రెడ్డి పాలన ఉంది

– రాష్ట్రంలో దళితుల మాన, ప్రాణాలకు రక్షణ లేదు
– దళితులే జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తారు
– దళిత ఉప ముఖ్యమంత్రులను యూజ్ లెస్ ఫెలో అనడం భావ్యమా?
-కావాలికి చెందిన కరుణాకర్ కుటుంబానికి న్యాయం జరుగకపోతే తాడేపల్లి ప్యాలెస్ ను ముట్టడిస్తాం
– మాజీ మంత్రి కేఎస్ జవహర్

దళితులు రాష్ట్రాన్ని విడిచి వెళ్లే విధంగా జగన్ రెడ్డి పాలన ఉందని మాజీ మంత్రి కేఎస్ జవహర్ అన్నారు. మంగళవారం మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… జగన్ రెడ్డి పాలనలో వైసీపీ నేతలు రెచ్చిపోయి దళితులను బలిగొంటున్నారు. కావలిలో కరుణాకర్ అనే వ్యక్తిని కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి, సురేష్ రెడ్డిలు తన చేపల చెరువులో చేపల్ని పట్టకోనివ్వకుండా అడ్డుకున్నారు, తన బ్రతుకుతెరువును నాశనం చేశారని సూసైడ్ నోట్ రాసి చనిపోయారు. ప్రభుత్వం ఈ సంఘటన పై నేటికీ చర్యలు తీసుకోలేదు. జగన్ రెడ్డి ప్రభుత్వానికి ధన దాహం, రక్త దాహం అధికమైంది.

వైసీపీ నేతృత్వంలో వరప్రసాద్ అనే దళితుడుకి ఇసుక అక్రమాలపై ప్రశ్నించినందుకు శిరోముండనం చేశారు. హెల్మెంట్ పెట్టుకోలేదని శ్రీకాంత్ అనే వ్యక్తిని చంపారు. ఎమ్మెల్సీ అనంతబాబు తన రహస్యాలను బయట పెడతాడని డ్రైవర్ సుబ్రమణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేశాడు. వీరి పరిపాలనలో దళితుల పరిస్థితి హీనంగా తయారైంది. ఇలాంటి పరిపాలనలో తాము బతికేది ఎలా అని ప్రతి దళితుడు ప్రశ్నిస్తున్నాడు.

కావలిలో కారుణాకర్ ఆత్మహత్యకు కారణమైన వారిని అరెస్ట్ చేయకుండా మీన మేషాలు లెక్కిస్తున్నారు. చుకుంటూ ఉంటున్న విధానం చూస్తుంటే దేవస్థానం బోర్డు సభ్యుడిగా ఉన్న కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి ప్రధాన కారకుడిగా ఉన్నట్లు తెలుస్తోంది. అతన్ని నేటికీ అరెస్ట్ చేయలేదు. ఈ వైఖరిని టీడీపీ ఖండిస్తోంది.

డాక్టర్ సుధాకర్, మహాసేన రాజేష్, హర్షకుమార్, అక్రమ ఇసుక గురించి ప్రశ్నించిన వరప్రసాద్, అనేక మంది దళితులని ఇబ్బందులపాలు చేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి. తమను ఉద్ధరిస్తాడని దళితులు కోరి జగన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా తెచ్చుకున్నందుకు కొరివి దెయ్యంలా వారిని తరుముతున్నాడు. ఇలా ఇబ్బందులకు గురి చేస్తుంటే వారు ఎక్కడికి వెళ్ళి బతకాలో జగన్ రెడ్డే సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో దళితుల మాన ప్రాణాలకు రక్షణ లేదు. ఇలాంటి పాలన పట్ల టీడీపీ వ్యతిరేకిస్తోంది.

మేనమామనంటూ బైబిల్ పట్టుకొని ప్రజల్ని మోసం చేశాడు. అన్ని మోసాలు పూర్తి అయి దళితుల మాన ప్రాణాల మీద దృష్టి పెట్టాడు. వైసీపీ నాయకుల అరాచకాలు రాష్ట్రంలోని 13 జిల్లాలలో మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతున్నాయి. దళితులపై అనేక దాడులు, వేధింపులు, మరణాలు జరుగుతున్నా జగన్ కు చీమ కుట్టినట్లు కూడా లేదు. దళితులను కొందరిని పోలీసులో, వైసీపీ నాయకులో చంపుతుంటే కొందరు వైసీపీ నాయకుల వేధింపులు తాళలేక వారే ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. కావాలికి చెందిన కరుణాకర్ కుటుంబానికి న్యాయం జరుగకపోతే తాడేపల్లి ప్యాలెస్ ను ముట్టడిస్తాం . నెత్తిపై పెట్టుకోవడం, కాలి కింద వేసి తొక్కడం దళితులకి అన్నీ తెలుసు.

అమరావతిలో దళితుల మీదే ఎట్రాసిటి కేసులు పెట్టారు. మాస్కులు అడిగారని డాక్టర్ సుధాకర్ ను మరణించే వరకు వేధించారు. టాయిలెట్ కు కూడ వెళ్లనివ్వకుండా అనిత రాణిని వేధించారు. దళితుల మాన ప్రాణాలను బలి గొనడం వైసీపీకి పరిపాటి అయింది. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు దళితులు అందరు ఏకమై ఎదుర్కోవాలి. కరుణాకర్ అనే దళితుడి మరణానికి కారణమైన వారిని పోలీసులు ఎందుకు అరెస్టు చేయరు? తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చే సూచనల ప్రకారం ఇంకా ఎంతమందిని బలిగొంటారు?

మద్యం గురించి ప్రశ్నిస్తే మరణం, అక్రమ ఇసుకని ప్రశ్నిస్తే అరణ్యవాసం, మాస్కుల గురించి అడిగితే చావడానికి కారణం అవుతోంది. దళితులను చంపడం వల్ల జగన్ రెడ్డికి ఒనగూరే ఉపయోగం ఏంటి? దళితుల సంక్షేమానికి ఉపయోగపడే అనేక పథకాలను రద్దు చేశారు. జగన్ రెడ్డి దళితుల విద్యను, సంక్షేమాన్ని, ప్రాణాల్ని దూరం చేస్తున్నాడు.

కరుణాకర్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు తెలుగుదేశం పార్టీ వారికి అండగా ఉంటుంది. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం. ఇలానే జగన్ రెడ్డి పరిపాలన కొనసాగితే జగన్ రెడ్డి ఇంటిని ముట్టిడిస్తాం. జడ్జిలన్నా,పోలిసులు అన్నా ప్రభుత్వానికి చులకనభావం ఉంది.

జడ్జి రామకృష్ణ, అతని సోదరుడి విషయంలో రామచంద్రారెడ్డి ఏ విధంగా వ్యవహరిస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు. దళిత ఉప ముఖ్యమంత్రులను నిలబెట్టి యూజ్ లెస్ ఫెలో అని మాట్లాడటం భావ్యమా? ఇంతటి అవమానకర పరిస్ధితులు రాష్ట్రంలో ఎన్నడు లేవు.

దళితుల పై దాడులు సరి కాదు, సప్రెషన్ నుండి అనేక విప్లవాలు పుట్టాయి, ఆ విప్లవాలకి కారణం జగన్ లాంటి నాయకులే. కరుణాకర్ మరణానికి కారణమైన కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, సురేష్ రెడ్డిలను వెంటనే అరెస్ట్ చేయాలి. హత్యలు, అత్యాచారాలు చేసే వారే వైసీపీకి క్వాలిఫికేషన్ గా ఉంది. ఎవరికో అన్యాయం జరిగిందని దళితులు ఊరుకుంటే రేపు వారికి అదే పరిస్దితి వచ్చే అవకాశం ఉంది కనుక దళితులు బయటికొచ్చి ప్రశ్నించాలి.

పెద్ద పెద్ద మాటలు చెప్పే జూపూడి ప్రభాకర్, హోం మంత్రి తానేటి వనిత దళిత నాయకులైనా దళితులకు ఉపయోగంలేదు. ఆదిమూలపు సురేష్ బడుగు, బలహీన వర్గాలకు ప్రమాదకారిగా మారారు. అబేంద్కర్ రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని పదవులు వచ్చాక నేడు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ వైఖరిని నిలదీసే స్థితిలో అనేక మంది దళితులు ఉన్నారు. దళితులే జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తారని మాజీ మంత్రి కేఎస్ జవహర్ హెచ్చరించారు.

LEAVE A RESPONSE