Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి పాలనంతా అప్పులు, తప్పులు, విధ్వంసాలు, అరాచకాలే

– వైసీపీ అసమర్ధ, చేతకాని పాలనతో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం
– టీడీపీ పాలనకు వైసీపీ పాలనకు ప్రజలు బేరీజు వేసుకోవాలి
– రాష్ట్రానికి జగన్ వైరస్ పట్టింది దాన్ని నిర్మూలించే భాధ్యత టీడీపీదే
– నారా చంద్రబాబు నాయుడు

వైసీపీ ప్రభుత్వ చేతకాని పాలన, జగన్ రెడ్డి అసమర్ధతతో రాష్ట్రాన్ని నాశనం చేశారని, ప్రభుత్వ వైఫల్యాలు, తప్పుల్ని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక దాడులు, బూతులతో ఎదురు దాడి చేస్తున్నారని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ద్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో 175 నియోజకవర్గాల ఇన్ చార్జులు, 25 పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్ చార్జులు, పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ…….

జగన్ రెడ్డి తన విధ్వంస, అరాచక పాలనతో రాష్ట్రాన్ని అన్ని విధాల నాశనం చేశారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు, తప్పుల్ని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక ఎదురు దాడి చేస్తున్నారు. ప్రజా వేదిక ఎందుకు కూల్చారు? ఇది విద్వంసం కాదా? ఇప్పటికీ ఆ శిధిలాలు తీయలేదంటే ఇది మీ పైశాచికత్వం కాదా? ‎ నాడు అధికారంలోకి వచ్చేనాటికి పోలవరంకు సంబందించి అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి.

వాటన్నింటిని పరిష్కరిచాం, ‎పోలవరం 7 ముంపు మండలాలు ‎ఏపీలో కలిపితేనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని కేంద్రానికి చెప్పిన తర్వాతే ‎ పార్లమెంట్ లో ఆర్దినెన్స్ తెచ్చి ముంపు మండలాలు ఏపీలో కలిపారు. ప్రతి సోమవారం పోలవరంగా మార్చుకుని 70 శాతం పనులు పూర్తిచేశాం. కానీ జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చి పోలవరాన్ని నాశనం చేశారు. వైసీపీ నేతలకు అభివృద్ది చేయటం చేతకాదు. సబ్జెక్టు

తెలీదు.‎ వైసీపీ ప్రభుత్వ చేతకానితనం, జగన్ రెడ్డి అసమర్ధత వల్ల నదీజలాల విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంది. ‎మీ తప్పుడు విధానాల వల్ల కృష్ణా, గోదావరి జలాలు కేంద్రం ఆధీనంలోకి వెళ్లిపోయాయంటే ‎ఇది మీ చేతకానితనం కాదా? కేంద్రం అనుమతి లేకుండా రాష్ట్రంలో కనీసం ఒక్క కాలువ కూడా త్రవ్వలేని పరిస్తితి తెచ్చారు. నాడు పోలవరాన్ని పూర్తి చేసి రాష్ట్రంలోని నదులన్నీ అనుసంధానం చేసి ప్రతి ఎకరాకు‎ నీరివ్వాలని సంకల్పంతో నదుల అనుసంధానికి శ్రీకారం చుట్టాం.

గోదావరి, కృష్ణా నదుల్ని అనుసంధానం చేశాం, ‎ వంశధార, పెన్నా నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాం. ‎నేడు అవన్నీ ఏమయ్యాయి? 2020 కి పూర్తి కావాల్సిన పోలవరం ఇప్పటికీ పూర్తికాలేదంటే మీ చేతాకాని తనం, అసమర్ధత కాదా? ప్రభుత్వం, ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకనుగుణంగా ‎పనిచేయాలి. కానీ వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నేతలు మాత్రం ప్రభుత్వ వైఫల్యాలు తప్పుల్ని ప్రశ్నిస్తే బూతులు తిట్టడం, అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్నారు. మీ బెదిరింపులకు భయపడం. ఉమ్మడి రాష్ర్ట ముఖ్యమంత్రిగా ఉన్నపుడు హైదారాద్ కి అనేక పరిశ్రమలు తెచ్చి యువతకు ఉద్యోగాలు కల్పించాం.

హైదారాబాద్ ని అన్ని విధాల అభివృద్ది చేశాం. మేం చేసిన అభివృద్దిని తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు విద్వంసం చేయకుండా కొనసాగించారు కాబటట్టే నేడు హైదారాబాద్ ‎ ‎ అభివృద్ది చెందింది. జగన్ రెడ్డికి సంపద సృష్టించటం చేతకాదు, కనీసం ఆ ఆలోచన కూడా లేదు కాబట్టే ‎ కాబట్టి 2 లక్షల కోట్ల సంపద కేంద్రంగా ఉన్న అమరావతిని నాశనం చేసి ఆ సంపదను ప్రజలకు అందకుండా ‎చేశారు. రాష్ట్రంలోని యువత ఉద్యోగాల కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లకుండా స్దానికంగా ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యంతో రాష్ట్రానికి అనేక పరిశ్రమలు తెచ్చాం. 5 లక్షలమందికి ఉధ్యోగాలు కల్పించాం.

రూ. 16 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు కుదిర్చాం, అవి వస్తే 34 లక్షల మందికి ఉద్యోగాలొచ్చేవి. కానీ జగన్ రెడ్డి విద్వంసం పాలన వల్ల నేడు ఒక్క పరిశ్రమ రాలేదు, ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వలేదు. వీటి గురించి అడిగితే బెదిరిస్తారా? మేం ప్ర‎జల కోసం పోరాడుతున్నాం. మేం ఎవరికీ భయపడం. వైసీపీ పాలనలో రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అద్వానంగా ఉంది, గ్రామాల నుంచి పట్టణానికి రావాలన్నా, జిల్లా కేంద్రానికి రావాలన్నా ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. ఆస్పత్రుల్లో మందులు లేవు, కోవిడ్ నివారణకు కట్టడి చర్యల్లేవు. టీడీపీ ‍హయాంలో అనేక సంక్షేమ పధకాలకు ‎ శ్రీకారం చుట్టాం, పుట్టిన బిడ్డ నుంచి వృద్దుల వరకు అనేక కార్యక్రమాలు అమలు చేశాం. తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ తీసుకువచ్చాం.మొబైల్ అంబులెన్సులు తెచ్చాం. కానీ నేడు ఏజెన్సీ ఏరియాల్లో గర్ణిణీలను ఆస్పత్రికి తీసుకెళ్లాలంటే డోలీల్లో మోసుకెళ్లే పరిస్థితి. వైసీపీకి ఓటేసిన పాపానికి ప్రజలు భాదలు పడాల్సి వస్తోంది.

ఇంగ్లీషు మీడియం, ఎయిడెడ్ వ్యవస్ధ రద్దు అంటూ అనాలోచిత నిర్ణయాలతో విద్యా వ్యవస్ధను భ్రష్టు పట్టిస్తున్నారు. నాసిరకం భోజనం, కుల్లిపోయిన కోడికుడ్లు ఇస్తూ విద్యార్ధుల పౌష్టికాహారం అందకుండా చేసి వారి ఆరోగ్యాన్ని భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. నాడు ఎందరో మహానుభావులు కష్టపడి నిర్మించిన రాజ్యాంగ వ్యవస్ధలను రెండున్నరేళ్లలోనే జగన్ రెడ్డి నాశనం చేశారు. అసెంబ్లీ అంటే లెక్కలేకుండా వ్యవహరిస్తూ శాసన సభ గౌరవాన్ని మంటగలిపారు. మండలిలో టీడీపీకి మెజార్టీ ఉందని రద్దు చేస్తామని తీర్మానం చేశారు, మళ్లీ ఇప్పుడు వైసీపీకి మెజార్టీ వచ్చిందని మండలి రద్దును వెనక్కి తీసుకుంటూ తీర్మానం చేశారు. మీ రాజకీయాలం కోసం వ్యవస్ధల్ని భ్రష్టుపట్టిస్తున్నందుకు సిగ్గనిపించటం లేదా? మీ రాజకీయం కోసం వ్యవస్ధలను నాశనం చేస్తారా? ఐఏయస్, ఐపీఎస్ వ్యవస్ధలను నిర్వీర్యం చేశారు.

కొంతమంది పోలీసులతో తప్పుడు కేసులు పెట్టించి భయపెట్టాలని చూస్తారా? మీ బెదిరింపులకు, ఉడత ఊపులకు మేం భయపడం. నేడు చట్టాన్ని దిక్కరించి తప్పుడు కేసులు పెట్టిన ప్రతి ఒక్కరికి రేపు చట్ట ప్రకారం శిక్ష తప్పదు. మేం చట్టాలను గౌరవిస్తాం, కానీ వైసీపీ ప్రభుత్వం తన స్వార్దం కోసం నీరుగార్చుతోంది. నేడు చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తున్న అధికారులంతా రేపు అనేది ఒకటి ఉందని గుర్తు పెట్టుకోవాలి. జగన్ ని నమ్మి గతంలో ఎంతోమంది అధికారులు జైలుకెళ్లారు. ఇప్పుడు చట్టాన్ని ఉల్లఘించేవారికి భవిష్యత్ లో అదే పరిస్థితి వస్తుంది. వైసీపీ తప్పుల్ని, వైఫల్యాల్ని ప్రశ్నిస్తున్న మీడియాపై తప్పుడు కేసులు పెట్టి గొంతు నొక్కాలని చూస్తారా? రేపు టీడీపీ అధికారంలోకి వస్తే మీ మీడియా పరిస్థితి ఏంటి? బ్లూ మీడియా రెచ్చిపోతూ ప్రతి రోజు అసత్యాలు ప్రచారం చేస్తోంది. ఓ వైపు అసత్య ప్రచారం మరోవైపు విద్వంసాలు చేస్తున్నారు. వైసీపీ అరాచకాలు, విధ్వంసాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి.

నిత్యవసరధలు ధరలు పెంచి ప్రజలపై భారం మోపారు, ఎప్పుడో ‎ కట్టిన ఇళ్లకు ఓటీఎస్ పేరుతో బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఉచిత ఇసుక రద్దు చేసి సామాన్యునికి ఇసుక అందకుండా చేశారు. నాడు మద్యపాన నిషేదం అని చెప్పి అధికారంలోకి వచ్చాకా నాసిరకం మద్యం అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఒక్క రోజులోనే రూ. 124 కోట్ల మద్యం విక్రయాలు జరిపారు. దీన్ని మద్యపాన నిషేదం అంటారా? మద్యాపానాన్ని పెంచిపోషించటం అంటారా? మద్యంపై భవిష్యతుల్లో వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి….రూ. 25 వేల కోట్లు అప్పు తెచ్చారంటే ఇది మోసం కాదా? వీటన్నింటికి ప్రజలను మోసం చేసిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి తప్ప సాక్షి జీతగాడు కాదు.

దేశంలో ఎక్కడ డ్రగ్స్, గంజాయి పట్టుబడినా ఏపీ పేరు చెబుతుంటే బాధ అనిపిస్తోంది. కానీ వైసీపీ నాయకులకు కనీసం సిగ్గనిపించటం లేదా? రాష్ట్రంలో హెరాయిన్, గంజాయి మాఫియా వల్ల యువత భవిష్యత్ పాడవుతోందని దీన్ని అరికట్టాలని మేం ప్రశ్నిస్తే మా టీడీపీ కార్యాలయాలపై దాడులు చేస్తారా? మీ దాడులకు మేం భయపడతామా? తెలుగుజాతి గౌరవాన్ని ఎందుకు మంటగలిపారో ముందు సమాధానం చెప్పండి. గంజాయి, డ్రగ్స్ ఈ రాష్ట్రంలోకి వస్తుంటే ప్రజల కోసం వాటిపై పోరాడాం. వైసీపీ మాత్రం తెలుగుదేశం పై దాడి చేసింది. వైసీపీ ఉడతూపు దాడులకు తెలుగుదేశం పార్టీ భయపడదు. విద్యుత్ ఛార్జీలు ఇప్పటికీ ఆరుసార్లు పెంచారు. ఇప్పుడు ఏడవసారి పెంచాలని చూస్తున్నారు. స్లాబులు కుదించి పేదలపై భారం మోపాలని చూస్తున్నారు. మోటార్లకు మీటర్లు పట్టే పరిస్థితి వచ్చారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారు. ధరలు అదుపులో లేవు. 15 శాతం కు ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. సంక్రాంతి కూడా చేసుకునే పరిస్థితి లేదు. 4 లక్షల కోట్లు అప్పులు చేశారు. దీనిపై జగన్ రెడ్డి ఏం సమాధానం చెబుతారు.

కాగ్ ను, భారత ప్రభుత్వాన్ని కూడా ఆర్ధిక అంశాలపై మోసం చేశారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నా. లిక్కర్ లో కనీసం ఆన్ లైన్ పేమెంట్ కు కూడా అనుమతించడం లేదు. ఆ డబ్బులన్నింటిని జగన్ రెడ్డి లూటీ చేస్తున్నారు. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా? వీటన్నింటిపై వైట్ పేపర్ రిలీజ్ చేసి ప్రజాక్షేత్రంలో చర్చించే దమ్ము ఈ ముఖ్యమంత్రికి ఉందా? అప్పులు తెచ్చి, ధరలు, పన్నులు పెంచి జగన్ రెడ్డి తన సొంత ఖజానా నింపుకుంటున్నారు. ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకెళుతాం. ఇప్పటికీ రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిపైన 36.5 శాతం అప్పులు తెచ్చారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు.

ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి వచ్చారు. ప్రత్యేకహోదా ఏమైంది? పోలవరం, రైల్వే జోన్, విశాఖ స్టీల్ ఏమైందో సమాధానం చెప్పే ధైర్యం జగన్ రెడ్డికి ఉందా? వీటిపై కేంద్ర ఏం చెప్పింది? ఏం సాధించారు మీరు. నాడు మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామని చెప్పారు. నేడు జగన్ రెడ్డి సొంత ప్రయోజనాల కోసం మెడలు వంచుకుని కేంద్రం ముందు రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టారు.సి.పి.ఎస్ ను ఒక్క వారంలో రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన నాడే అర్ధమైంది మీకు అనుభవం లేదని. సి.పి.ఎస్ అమలు చేస్తే బడ్జెట్ మొత్తం దానికే సరిపోతుందని ఇప్పుడు అంటున్నారు. ఇప్పుడు అడుగుతున్నాం ఏం సిపిఎస్ విషయంలో ఏం చేశారో సమాధానం చెప్పగలరా? ప్రజలను వంచించారు. ఇది వాస్తవం. నేను మాట ఇస్తే మాటకు కట్టుపడ్డాను తప్పా తప్పుడు మాటలు చెప్పి జగన్ లా ప్రజలను వంచించలేదు.

వివేకానందరెడ్డి హత్య కేసులో గుండెపోటుతో చనిపోయాడని నీ సొంత సాక్షి పేపర్ అబద్దాలు రాశారు. సొంత చిన్నాన చనిపోతే కనీసం కనికరం లేదు జగన్ రెడ్డికి. దీనిని ఏ విధంగా సమర్ధించుకుంటారు. కోడికత్తి ఏమైంది? ఇప్పటి వరకు ఈ కేసుపై ఒక్కమాట కూడా జగన్ రెడ్డి మాట్లాడలేదు. ఇది నాటకం కాదా అని అడుగుతున్నా.

జగన్ రెడ్డి ప్రభుత్వం రైతుల్ని, రైతు కూలీల్ని, భవన నిర్మాణ కార్మికులను మోసం చేసింది. డ్వాక్రా మహిళలను మోసం చేసే పరిస్తితికి వచ్చారు. ఉద్యోగస్తులను పీఆర్సీ ఇవ్వకుండా ముంచేసే పరిస్తితికి వచ్చారు. అందరికీ ఉద్యోగాలంటూ జాబ్ క్యాలెండర్ అన్నారు. అసలు ఉద్యోగాలిచ్చే పరిస్థితి లేదు రాష్ట్రంలో. గుత్తేదారులు బిచ్చాటన చేసే పరిస్థితికి వచ్చారు.

తెలుగుదేశం హయాంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీ, మైనారిటీ, కాపులు, వైశ్యా, బ్రాహ్మణులకు ప్రత్యేక బడ్డెట్ పెట్టాం. పేదవారి సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తే అవన్నీ కూడా రద్దు చేశారు. ఎస్సీలకు భూములు కూడా కొనుగోలు చేసి ఇచ్చిన పార్టీ తెలుగుదేశం. 133 కులాల అభివృద్ధికి పాటుపడి, జగన్ రెడ్డి పాలనలో జరిగిన అన్యాయాన్ని సరిచేసే భాధ్యత తెలుగుదేశం తీసుకుంటుందని హామీ ఇస్తున్నా. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వెనుకబడిన వర్గాల కోసం కొనుగోలు చేసిన పనిముట్లు కూడా తుప్పుపట్టించారు. బడికెళ్లే బాలికలకు సైకిళ్లు కొనుగోలు చేస్తే అవన్నీ కూడా పనికి రాకుండా చేశారు.

తెలుగుదేశం పార్టీకి పేరొస్తుందని పనిముట్లను కూడా పంపిణీ చేయలేదు. తెలుగుదేశం పార్టీకి పేరు రాకుండా ఎవరూ అడ్డుకోలేరు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ పేదవారి గుండెల్లో ఉంటుంది.మైనారిటీ సోదరులు ఏం తప్పు చేశారు? మదరసా స్కూళ్లుపై దాడి చేస్తారా? కేసులు పెడుతారా? వారి ఆస్తులను లాక్కుంటారా? అధికారం శాశ్వతం కాదు. తెలుగుదేశం పార్టీపై తప్పుడు కేసులు పెట్టి పైశాచిక ఆనందం పొందాలనుకుంటున్నారు. కానీ, ఆ తప్పుడు కేసులు నిలబడవని గుర్తించుకోండి. నేను తప్పు చేయను. మీ తండ్రి రాజశేఖర్ రెడ్డి నాపై 25 కేసులు వేసి ఏమీ చేయలేకపోయారు. అది నా నిబద్దత. తెలుగుదేశం పార్టీ విశ్వసనీయత. తెలుగుదేశం పార్టీ 5 కోట్ల మంది తెలుగువారికి అండగా నిలబడుతుంది. ఈ విషయాన్ని నాయకులు గ్రామ గ్రామానికి తీసుకెళ్లాలి. ప్రజలను చైతన్యవంతులను చేద్దాం. వారికి నమ్మకాన్ని కల్పిద్దాం. ప్రజలను ఒక సంఘటిత శక్తిగా తయారుచేయాల్సిన బాధ్యత తెలుగుదేశం నాయకులదే. ప్రజల భవిష్యత్తును కాపాడే గురుతర భాధ్యత తెలుగుదేశంపై ఉంది. ప్రజలకు న్యాయం చేసే వరకు ప్రజలకు అండగా ఉందామని విజ్జప్తి చేస్తున్నా.

నవ్యాంధ్రప్రదేశ్ ను ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తయారు చేయాలని కలలు కన్నా. 2022 కి మూడు భారతదేశ రాష్ట్రాలలో ఒకటి ఉండాలని, 2029 కి భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రంగా చేయాలనుకున్నా. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలోనే కాకుండా హ్యాపీనెస్ లోకూడా నంబర్ 1 రాష్ట్రంగా ఉండాలని కోరుకున్నా. హైదరాబాద్ అభివృద్ధికి ప్రణాళిక చేసిన నాడు ఔటర్ రింగ్ రెడ్డు ఒక గ్రాఫిక్. కానీ నేడు 8 వరుసల రియాలిటీ. హైదరాబాద్ చుట్టూ 162 కి.మీ చుట్టూ సర్వే చేయించి దాన్ని నిజం చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. మాటలు చెప్పడం, విధ్వంసం చేయడం సులభమే. అభివృద్ధి చేయడం ఎంత కష్టమో ప్రజావేధికను కూల్చిన జగన్ రెడ్డి తెలుసుకోవాలి.

రాష్ట్రానికి వైసీపీ గ్రహణం, వైరస్ పట్టింది. దాన్ని సరిచేసే భాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. దీని కోసం నిరంతరం పోరాటం చేద్దాం. ఈ రాష్ట్రానికి ఏం తక్కువ. బంగారు పంటలు పండే భూములున్నాయి. మంచి నదులున్నాయి. కానీ, నేడు వెనక్కు వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది విద్యలో 3 వ స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని నేడు 18 వ స్థానానికి తీసుకొచ్చారు.

రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. 32 వైసీపీ పాలనలో మీ జీవితాల్లో ఏమైనా మార్పులొచ్చాయా? మీఆదాయం పెరిగిందా? ఖర్చులు పెరిగాయా? స్కూళ్లలో మీ పిల్లలకు మంచి విధ్యఅందుతోందా? ఆసుప్రతికి మందులు దొరుకుతున్నాయా? టీడీపీ హయాంలో పరిస్తితి ఎలా ఉందో వైసీపీ పాలనలో ఏవిధంగా ఇబ్బందులు పడుతున్నారో ప్రజలు బేరీజు వేసుకోవాలి. మీ కోసమే మేం పోరాడున్నాం. అందరూ కలిసి వైసీపీ దురాగాతకు, విద్వాంసాలకు అడ్డుకట్ట వేయాలి.

నాయకులు పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టాలి, గ్రామ, మండల,పట్టణ కమిటీలు 15 లోపు పూర్తి చేయాలి. ఎన్నికల నిర్వహణకు, ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు క్లస్టర్, యూనిట్, బూత్ కమిటీలు వేసుకోవాలి 100 ఓట్లకు ఒక బూత్ కమిటీని, బిఎల్ఎ లను ఏర్పాటుచేసుకొని ఈ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అరాచకాలు, వాస్తవాలను ప్రజలకు తెలియ జెప్పాలి. వైసిపి వారిని అడుగుతున్నా… ప్రజలకు సమాధానం చెప్పండి….ప్రజాస్వామ్యంలో ప్రతిఒక్కరికీ ప్రశ్నించే హక్కు ఉంది…ఎవరైనా అడిగితే దాడిచేస్తాం,..నోరు మూస్తామంటే కుదరదు….ప్రజలంతా తిరగబడితే పారిపోతారు! రాబోయే ఎన్నికల్లో సమర్థవంతమైన, ప్రజల్లో పలుకుబడిగల, నిత్యం ప్రజలతో మమేకమయ్యే వారిని గుర్తించి అభ్యర్థులుగా ఎంపికచేస్తాం…ఇప్పటికే పార్లమెంటు కమిటీలు వేసుకున్నాం.. త్వరలో జిల్లా కోఆర్డినేషన్ కమిటీలు వేస్తాం….ఈ నెలలో ఎన్టీఆర్ 18వ వర్థంతి సందర్భంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తాం.

రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమాలు చేపట్టాలి….ఆ రోజునే మెంబర్ షిప్ డ్రైవ్ ప్రారంభిస్తాం. ఈరోజు వైసిపి నాయకులు లేస్తే బూతుపురాణం అందుకుంటున్నారు…నేను కూడా మావారితో బూతులు తిట్టాలంటే తిట్టించగలను, అయితే అది మేము నేర్చుకున్న భాష కాదు….ప్రజలకోసం, ప్రజలకు అండగా ఉండటానికి మాత్రమే టిడిపి పనిచేస్తుంది. .తెలుగుదేశం పార్టీ సమస్యలపై పోరాడుతుంది. అసెంబ్లీలో ప్రజాసమస్యలపై గట్టిగా మాట్లాడతాం తప్ప ఎప్పుడూ బూతులు మాట్లాడలేదు.

పార్టీ నాయకులు స్థానిక సమస్యలు కూడా టేకప్ చేయాలి, ఒక కార్యాచరణతో ముందుకు వెళ్లాలి….చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా పైనుంచి కిందవరకు వైసిపి నేతలంతా రాష్ట్రంలోని ఖనిజ సంపదనంతా దోచుకుంటున్నారు. పంచభూతాల్లో ఏ ఒక్కటీ మిగల్చలేదు. గ్రావెల్, మట్టితో పాటు పోలవరం కాల్వలు కూడా వదల్లేదు. కాల్వలను తవ్వి కొన్ని వందల లారీల్లో రాత్రిళ్లు తరలిస్తున్నారు. ఇదిచాలక…గంజాయిపంట పండించి వందలకోట్లు దోచుకుంటున్నారు. పేదవాళ్లకు ఇళ్ల పట్టాలిస్తామని 7వేల కోట్ల దోపిడీ చేశారు, ల్యాండ్ లెవలింగ్ పేరుతో మరికొంత దోచుకున్నారు. నల్ల రామకృష్ణారెడ్డి, చంద్రమోహన్ రెడ్డి లాంటివారు అక్రమ మైనింగ్ పై పోరాడుతున్నారు, నా నియోజకవర్గంలో కూడా పెద్దఎత్తున అక్రమ మైనింగ్ చేస్తున్నారు. అధికార యంత్రాంగం సరెండర్ అయిపోయే పరిస్థితి ఏర్పడింది.

ఈ విషయాలన్నింటినీ టేకప్ చేద్దాం… రాబోయే రోజుల్లో కరోనాకు మించి జగన్ వైరస్ రాష్ట్రంలో ప్రబలుతుంది…ఈ రెండింటిపై అందరం కలిసి సమర్థవంతంగా పోరాడదాం, ప్రజా సమస్యలపై పోరాటం చేద్దాం. ఈరోజు ఎజెండా రూపొందించి దశ,దిశా నిర్దేశించాం….దీనిని క్షేత్రస్థాయిలో అమలుచేయాల్సిన బాధ్యత నియోజకవర్గ ఇన్ చార్జిలదేనని చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, అన్ని పార్లమెంట్ మరియు నియెజకవర్గ ఇన్ చార్జ్ లు, టీడీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE